PM Modi Poland Visit : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలెండ్‌కు చేరుకున్నారు. ఆ దేశ రాజధాని వార్సాలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. భారత్, పోలెండ్ మధ్య ఉన్న దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా మోదీ ప్రస్తుతం అక్కడ పర్యటించారు. అయితే, గత 45 ఏళ్లలో భారత ప్రధాని పోలెండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 1979లో చివరిసారిగా నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలెండ్‌కు వెళ్లారు.
#WATCH | Prime Minister Narendra Modi arrives in Warsaw, Poland.
— ANI (@ANI) August 21, 2024
PM Modi is on a two-day official visit to Poland. This is the first visit by an Indian Prime Minister to Poland in the past 45 years. pic.twitter.com/AjIVYw75SC
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పోలాండ్ అధ్యక్షుడు, ప్రధాన మంత్రితో భేటీ కానున్నారు. పొలాండ్‌కు చెందిన వ్యాపార దిగ్గజాలు, పర్యావరణవేత్తలతోనూ మోదీ చర్చలు జరపనున్నారు. భారత సంతతి ప్రజలను కలవనున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరుగుతన్న ఈ పర్యటన ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సెంట్రల్ యూరప్‌లో పోలాండ్ కీలక ఆర్థిక భాగస్వామి అని తెలిపారు. పోలెండ్‌లో ప్రవాస భారతీయులg స్వాగతం పలికిన ఫొటోలను మోదీ పోస్ట్ చేశారు.
" deeply touched by the warm welcome from the indian community in poland! their energy embodies the strong ties that bind our nations," posts pm modi (@narendramodi). pic.twitter.com/4YvstJy6S4
— Press Trust of India (@PTI_News) August 21, 2024
అయితే పోలెండ్‌లో రెండు రోజులపాటు పర్యటించనున్న మోదీ, అక్కడ నుంచి ఆ తర్వాత ఉక్రెయిన్ వెళ్లనున్నారు. ఆగస్టు 23న ఓ స్పెషల్ ట్రైన్లో సుమారు 10 గంటల పాటు ప్రయాణించి కీవ్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యి ఆ తర్వాత తిరిగి మళ్లీ రైలులోనే పోలెండ్ చేరుకుంటారు. అక్కడ పర్యటన ముగించుకొన్నాక మోదీ తిరిగి స్వదేశానికి తిరిగొస్తారు.
'ఉక్రెయిన్‌లో శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నా'
ఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఉక్రెయిన్‌లో శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు."మధ్య ఐరోపాలో భారత్‌కు పోలెండ్ కీలక ఆర్థిక భాగస్వామిగా ఉంది. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పోలెండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో నా భేటీ కోసం ఎదురుచూస్తున్నా. అక్కడి భారతీయులతోనూ ముచ్చటస్తా. ఆ పర్యటనను ముగించుకొని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదమిర్ జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు కీవ్ వెళ్లనున్నా. ఆ దేశంలో భారత ప్రధాని చేపట్టబోయే తొలి పర్యటన ఇదే కానుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడమే ప్రధానాంశంగా ఈ పర్యటన సాగనుంది. గత రెండేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారంపై జెలెన్‌స్కీతో నా ఆలోచనలు పంచుకొనే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. అక్కడ శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నా" అని ప్రధాని మోదీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌లో మోదీ కోసం స్పెషల్ లగ్జరీ ట్రైన్ - ఎందుకంటే?
ఆగస్టు 23న ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన! - PM Modi To Visit Ukraine On Aug 23