PM Modi Brunei Visit : బ్రూనైతో జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల మధ్య మెరుగైన భాగస్వామ్యాన్ని పెంచాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజులు విదేశీ పర్యటనలో భాగంగా బ్రూనై వెళ్లిన ప్రధాని బుధవారం ఆ దేశ సుల్తాన్ హసనల్ బోల్కియాతో భేటీ అయ్యారు. ముందుగా ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్‌కు వెళ్లిన మోదీకి హసనల్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రతినిధుల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఇరువులు విస్తృతమై చర్చలు జరిపి పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.
#WATCH | Brunei Darussalam: Prime Minister Narendra Modi and Sultan of Brunei, Haji Hassanal Bolkiah hold delegation-level talks. Signing and exchange of MoUs take place between India and Brunei.
— ANI (@ANI) September 4, 2024
(Source: DD News/ANI) pic.twitter.com/eCWOu18Hja
భారతీయుల తరపున బ్రూనై ప్రజలకు ప్రధాని మోదీ 40వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాక్షాంకలు తెలిపారు. బ్రూనైతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 40 సంవత్సరాలు కావడం కూడా సంతోషంగా ఉందని అన్నారు. ఈ పర్యటన, ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించడానికి అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ' సుల్తాన్ హసనల్ బోల్కియాను కలవడం ఆనందంగా ఉంది. యాక్ట్‌ఈస్ట్ విధానం, ఇండో- పసిఫిక్ విజన్‌లో భారత్‌కు, బ్రూనై ముఖ్యమైన భాగస్వామి. ఈ పర్యటన, మా చర్చలు రానున్న కాలంలో రెండు దేశాల మధ్య స్నేహపూరిత సంబంధాలకు ఒక వ్యూహాత్మక దిశను అందిస్తాయని నేను విశ్వసిస్తున్నా. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగైన భాగస్వామ్యాన్ని పెంచుతాయని నేను నమ్ముతున్నా.'' అని మోదీ పేర్కొన్నారు.
#WATCH | Brunei Darussalam: Prime Minister Narendra Modi says " i express my heartfelt gratitude to you and the entire royal family for your kind words, warm welcome and hospitality. i convey my greetings to you and the people of brunei on the 40th anniversary of independence on… pic.twitter.com/rKyVoP1wmY
— ANI (@ANI) September 4, 2024
భారత్ బ్రూనై సంబధాలు యాక్ట్ఈస్ట్ విధానానికి ప్రేరణగా ఉన్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా పేర్కొంది. 'ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, అంతరిక్షం, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్యం వంటి పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. ప్రపంచ సమస్యలపై కూడా తమ అభ్రిపాయాలు పంచుకున్నారు' అని తెలిపింది.
" delighted to meet his majesty sultan haji hassanal bolkiah. our talks were wide ranging and included ways to further cement bilateral ties between our nations. we are going to further expand trade ties, commercial linkages and people-to-people exchanges," posts prime minister… pic.twitter.com/quWlaxpriZ
— Press Trust of India (@PTI_News) September 4, 2024
విదేశీ పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ బ్రూనై వెళ్లారు. దారుస్సలాం విమానాశ్రయంలో ఆయనకు బ్రూనై యువరాజు అల్ ముహ్‌తడీ బిల్లా ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ సైనిక వందనం స్వీకరించారు. బుధవారం ఆ దేశ సుల్తాన్‌తో భేటీ అనంతరం మోదీ సింగపూర్‌కు బయలుదేరారు.