PM Modi Austria Visit : భారత్-ఆస్ట్రియా మధ్య స్నేహబంధం దృఢంగా ఉందని, రానున్న కాలంలో మరింత బలపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆస్ట్రియాకు చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ ఆతిథ్య విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత్- ఆస్ట్రియా బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారిక చర్చలకు ముందు ప్రధాని మోదీకి కార్ల్ నెహమ్మర్ విందు ఇచ్చారు.
Landed in Vienna. This visit to Austria is a special one. Our nations are connected by shared values and a commitment to a better planet. Looking forward to the various programmes in Austria including talks with Chancellor @karlnehammer, interactions with the Indian community and… pic.twitter.com/PJaeOWVOm1
— Narendra Modi (@narendramodi) July 9, 2024
అంతకుముందు వియన్నాకు చేరుకున్న ప్రధాని మోదీని కార్ల్ నెహమ్మర్ కౌగిలించుకున్నారు. అలాగే ప్రధానితో సెల్ఫీ సైతం దిగారు. "ప్రధాని మోదీకి స్వాగతం. మిమ్మల్ని ఆస్ట్రియాకు స్వాగతించడం ఆనందంగా, గౌరవంగా ఉంది. ఆస్ట్రియా- భారత్ మిత్ర దేశాలు. ఇరుదేశాల మధ్య బలమైన చర్చలు కోసం ఎదురుచూస్తున్నా" అని ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Happy to meet you in Vienna, Chancellor @karlnehammer. The India-Austria friendship is strong and it will get even stronger in the times to come. https://t.co/Sr1FSjVnk3
— Narendra Modi (@narendramodi) July 9, 2024
41ఏళ్ల తర్వాత ఆస్ట్రియాకు
రష్యా పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆస్ట్రియా చేరుకున్నారు. ఆస్ట్రియాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షాలెన్ బర్గ్, భారత రాయబారి శంభు కుమారన్, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. కాగా, భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే మొదటిసారి. అంతకుముందు ఇందిరాగాంధీ ప్రధాని హోదాలో ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు.
VIDEO | PM Modi (@narendramodi) arrives in Vienna after concluding his Russia visit. This is the first visit by an Indian Prime Minister to Austria in 41 years.
— Press Trust of India (@PTI_News) July 9, 2024
(Source: Third Party) pic.twitter.com/pD78dJ4oqU
#WATCH | Prime Minister Narendra Modi arrives at the hotel Ritz-Carlton in Vienna, Austria; greets members of the Indian diaspora at the hotel pic.twitter.com/alepT9XZC4
— ANI (@ANI) July 9, 2024
కాగా, ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటనపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. "భారత్-ఆస్ట్రియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ప్రధాని మోదీకి ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ వ్యక్తిగత ఆతిథ్యం ఇచ్చారు. ఇది ఇద్దరు నాయకుల మధ్య మొదటి సమావేశం. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ముందుకు సాగుతున్నాయి." అని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే ప్రధాని మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు.
Austria is known for its vibrant musical culture. I got a glimpse of it thanks to this amazing rendition of Vande Mataram! pic.twitter.com/XMjmQhA06R
— Narendra Modi (@narendramodi) July 10, 2024
ఛాన్సలర్ కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ
ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. "వియన్నాలో కార్ల్ నెహమ్మర్‌ను కలవడం ఆనందంగా ఉంది. మీ ఆదరణ పొందినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. మన మధ్య జరిగే చర్చల కోసం ఎదురుచూస్తున్నాను. ఇరుదేశాలు ప్రపంచ ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తూనే ఉంటాయి. భారత్-ఆస్ట్రియా స్నేహం బలంగా ఉంది. రాబోయే కాలంలో అది మరింత బలపడుతుంది. ఆస్ట్రియా సంగీత సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. వందేమాతరం ట్యూన్ చేసినందుకు ఆస్ట్రియాకు ధన్యవాదాలు. " అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Thank you, Chancellor @karlnehammer, for the warm welcome. I look forward to our discussions tomorrow as well. Our nations will continue working together to further global good. 🇮🇳 🇦🇹 pic.twitter.com/QHDvxPt5pv
— Narendra Modi (@narendramodi) July 9, 2024
వీటిపై చర్చంచే అవకాశం!
ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం, వివిధ బౌగోళిక రాజకీయ సవాళ్లపై చర్చించనున్నారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్, ఛాన్సలర్ కార్ల నెహమ్మర్ తో ప్రధాని మోదీ బుధవారం చర్చలు జరపనున్నారు.