ETV Bharat / international

'భారత్​లోని ఆ భూమి మాదే!'- నేపాల్​ కొత్త కయ్యం- మార్చిన మ్యాప్ ఫొటోలతో కరెన్సీ నోట్లు - Nepal Currency Notes Issue

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2024, 3:16 PM IST

Nepal Currency Notes Issue : భారత్‌-నేపాల్ మధ్య మరోసారి భూవివాదం చెలరేగింది. నేపాల్‌ రాష్ట్ర బ్యాంక్ భారత భూభాగాలతో కూడిన వివాదాస్పద నేపాల్‌ మ్యాప్‌తో కొత్త నోట్లను ముద్రించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Nepal Currency Notes Issue
Nepal Currency Notes Issue (Getty Images)

Nepal Currency Notes Issue : భారత్‌తో ఉన్న భూవివాదాన్ని నేపాల్‌ సెంట్రల్‌ బ్యాంక్ మరింత రాజేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య వివాదాస్పద భూభాగాలుగా ఉన్న లిపులేక్‌, కాలాపానీ, లింపియాదూర ప్రాంతాలను తమవిగా చెప్పుకొనే ప్రయత్నం నేపాల్‌ చేస్తోంది. నేపాల్‌ రాష్ట్ర బ్యాంక్‌ ముద్రించే కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌లను కూడా జత చేసింది. దీనికి సంబంధించి ప్రింటింగ్‌ ప్రక్రియ మొదలైందని ఆరు నెలల నుంచి ఏడాదిలోపు ఇది పూర్తవుతుందని నేపాల్‌ రాష్ట్ర బ్యాంక్‌ ‌ప్రతినిధి పేర్కొన్నారు. నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ నేతృత్వంలోని మంత్రివర్గం ఈ వివాదాస్పద మ్యాప్‌తో నోట్లను ముద్రించాలని మే 3వ తేదీన నిర్ణయించింది.

భారత్‌ అభ్యంతరాలు బేఖాతరు!
లిపులేక్‌, కాలాపానీ, లింపియాదురా ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్‌ 2020లో సరికొత్త మ్యాప్‌లను విడుదల చేసింది. నాటి కేపీ శర్మ వోలీ ప్రభుత్వం ఈమేరకు తీర్మానం చేసింది. దీనికి అప్పట్లో నేపాల్‌ పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేసింది. భారత్‌ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఆ దేశం అధికారిక పత్రాల్లో వాడే మ్యాప్‌లను సరికొత్త మ్యాప్‌లతో భర్తీ చేశారు.

మొత్తం ప్రదేశం భారత్‌లోనే!
భారత్‌-నేపాల్‌ మధ్య 1850 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. భారత్‌లోని సిక్కిం, బంగాల్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలతో నేపాల్‌ సరిహద్దు కలిగి ఉంది. భారత్‌-నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న కాలాపానీతో పాటు లిపులేఖ్‌, లింపియాదురా ప్రాంతాలు రెండు దేశాల మధ్య వివాదంగా ఉన్నాయి. ఇవి తమకు చెందినవేనని భారత్‌ చెబుతోంది. 1879లో బ్రిటిష్ ఇండియా అధికారులు రూపొందించిన చిత్రపటం మేరకు కాలాపానీ మొత్తం ప్రదేశం భారత్‌లోనే ఉంది.

ఎలాంటి మార్పు ఉండదంటున్న జైశంకర్!
తాము కొత్తగా ఒక అంగుళం భూమిని కూడా ఆక్రమించుకోలేదని భారత్‌ గతంలోనే స్పష్టం చేసింది. కాలాపానీతో పాటు లిపులేఖ్‌ కనుమదారి కూడా తమ ప్రాంతమేనని నేపాల్‌ వాదిస్తోంది. అయితే 1830 నుంచి ఈ ప్రాంతం తమ అధీనంలో ఉందని భారత్‌ చెబుతోంది. భారత భూభాగాలతో కూడిన కొత్త మ్యాప్‌లను నేపాల్‌ విడుదల చేసినంత మాత్రాన వాస్తవ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదని గతంలోనే విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పష్టం చేశారు.

నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణం- మోదీ శుభాకాంక్షలు
సీతాదేవి స్వస్థలంలో ప్రాణప్రతిష్ఠ సందడి- జనక్​పుర్​లో అంగరంగ వైభవంగా వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.