ETV Bharat / international

'దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు'- మాస్కో ఉగ్రదాడిపై పుతిన్ వార్నింగ్​ - Moscow Concert Hall Attack - MOSCOW CONCERT HALL ATTACK

Moscow Concert Hall Attack : మాస్కోలో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో మార్చి 24న దేశవ్యాప్తంగా సంతాపదినం పాటించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పిలుపునిచ్చారు. ఈ ఘటనకు కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Moscow Concert Hall Attack
Moscow Concert Hall Attack
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 7:33 AM IST

Updated : Mar 24, 2024, 8:06 AM IST

Moscow Concert Hall Attack : మాస్కోలోని అతి పెద్ద సంగీత కచేరీ హాలులో జరిగిన దాడికి కారణమైన వారిని వదిలి పెట్టేది లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాగే దేశవ్యాప్తంగా మార్చి 24న సంతాపదినం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ దాడి నేపథ్యంలో జాతినుద్దేశించి పుతిన్ ఈ విధంగా ప్రసంగించారు.

మార్చి24న సంతాపదినం
'రక్తపాతం సృష్టించిన ఉగ్రవాద దాడిలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 24న దేశవ్యాప్తంగా సంతాపదినంగా ప్రకటిస్తున్నా. తాజా పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా అదనపు భద్రతా చర్యలు చేపట్టాం. ఈ ప్రత్యక్ష దాడుల్లో పాల్గొన్న నలుగురితోపాటు 11 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాం. అయితే ముష్కరులకు ఉక్రెయిన్‌తో సంబంధాలున్నాయని తనకు సమాచారం అందింది. ఉగ్రవాదులను సరిహద్దులు దాటించేందుకు ఉక్రెయిన్‌కు చెందిన కొందరు సహకరించారు.ఈ దాడికి కారకులైన వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని పుతిన్ హెచ్చరించారు.

ఉక్రెయిన్‌ హస్తముందన్న రష్యా!
ముష్కరులకు ఉక్రెయిన్​తో సంబంధాలున్నాయని, దాడుల అనంతరం ఆ దేశం వైపు వెళ్లేందుకు యత్నించారని రష్యా భద్రత ఆరోపించింది. అయితే తమకేమీ సంబంధం లేదని ఉక్రెయిన్‌ ఖండించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఆధారాలేమీ లేవని అమెరికా వెల్లడించింది. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఇప్పటికే ప్రకటించుకుంది.

ఈ ఉగ్ర ఘటనలో మృతుల సంఖ్య 133కి చేరినట్లు రష్యా వెల్లడించింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు పేర్కొంది. శుక్రవారం రాత్రి దాదాపు 6,000 మందికి పైగా సామర్థ్యమున్న క్రాకస్‌ సిటీ హాలులో రష్యాలోనే ప్రముఖ బ్యాండ్‌ అయిన 'పిక్‌నిక్‌' సంగీత కార్యక్రమం జరుగుతుండగా, దుండగులు రెచ్చిపోయారు. తొలుత బాంబుపేలుళ్లకు, ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. ఈక్రమంలో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై భారత్ స్పందించింది. రష్యా ప్రజలకు అండంగా ఉంటామని ప్రధానీ మోదీ హామి ఇచ్చారు.

'భారత్​ మాకు ఎప్పటికీ మిత్రదేశమే'- మాట మార్చిన మాల్దీవులు- రుణ విముక్తి కోసమే! - Maldives India Debt

అరుణాచల్ భారత్​ భూభాగమే- చైనా వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం : అమెరికా - US On China

Last Updated : Mar 24, 2024, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.