Microsoft Windows Reports Major Service Outage Globally : మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ అండ్ సర్వీసెస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు, బ్యాంకులు, మీడియా సంస్థల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడేందుకు కారణమైంది. వివిధ దేశాల్లో మైక్రోసాఫ్ట్ 365ను ఉపయోగిస్తున్న అనేక సంస్థలకు- తమ కంప్యూటర్లను యాక్సెస్ చేసే వీలు లేకుండా పోయింది. ఫలితంగా శుక్రవారం కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. విమానయాన సంస్థలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా వంటి విమానయాన సంస్థలతోపాటు వీసా, ఏడీటీ సెక్యూరిటీ, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బందిపడ్డాయి. ఆస్ట్రేలియాలో ప్రధాన మీడియా సంస్థలైన ఏబీసీ, స్కై న్యూస్ టీవీ, రేడియో ప్రసారాలు నిలిచిపోయాయి.
ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లు జారీ సహా ఇతర సేవలు అందించడానికి వీలు లేకుండా పోయింది. ఫలితంగా మాన్యువల్‌గా బోర్డింగ్ పాస్‌లు జారీ చేయాల్సి రాగా, ప్రయాణాలు ఆలస్యమయ్యాయి.
భారత్‌లోని విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మైక్రోసాఫ్ట్ అజూర్ సర్వర్లలో సాంకేతిక సమస్య కారణంగా తమ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు స్పైస్‌జెట్, ఇండిగో సహా దేశంలోని అన్ని విమానయాన సంస్థలూ ప్రకటించాయి. బోర్డింగ్ పాస్‌ల జారీ సహా ఇతర పనుల కోసం ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపాయి. అయితే, ఈ పరిస్థితి కారణంగా దేశంలోని పలు విమానాశ్రయాల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బోర్డింగ్ పాస్ కోసం చాలాసేపు క్యూలో నిలబడాల్సి వచ్చిందని, సిబ్బంది తమ పేర్లను తప్పుగా రాసి ఇచ్చారని వాపోయారు.
#ImportantUpdate: We are currently experiencing technical challenges with our service provider, affecting online services including booking, check-in, and manage booking functionalities. As a result, we have activated manual check-in and boarding processes across airports. We…
— SpiceJet (@flyspicejet) July 19, 2024
— IndiGo (@IndiGo6E) July 19, 2024
— Vistara (@airvistara) July 19, 2024
Due to the global IT issue, some of the services at the Delhi Airport were temporarily impacted.
— Delhi Airport (@DelhiAirport) July 19, 2024
We are closely working with all our stakeholders to minimise the inconvenience to our flyers.
బ్లూస్క్రీన్ ఎర్రర్
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య కారణంగా, ప్రపచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. ల్యాప్‌ట్యాప్/ పీసీ స్క్రీన్‌లపై ఈ ఎర్రర్ కనిపించి, వెంటనే సిస్టమ్ షట్‌డౌన్ గానీ, రీస్టార్ట్ అవుతోంది. దీంతో యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
Windows Crashed...! It seems everyone around the globe facing this issue.. wahhhh please don't resolve
— mudevi (@avoid_sugar) July 19, 2024
Take ur own time @Microsoft #windows #bluescreen pic.twitter.com/phd1LO7hHv
మైక్రోసాఫ్ట్ వివరణ
సాంకేతిక సమస్య తలెత్తడానికి కారణాలను మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు. అయితే, పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది.
We're investigating an issue impacting users ability to access various Microsoft 365 apps and services. More info posted in the admin center under MO821132 and on https://t.co/W5Y8dAkjMk
— Microsoft 365 Status (@MSFT365Status) July 18, 2024
ఈ సేవలపై ప్రభావం
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య (Microsoft outage) కారణంగా అనేక సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. విమాన సర్వీసుల దగ్గరి నుంచి బ్యాంకింగ్ వరకు అనేక రంగాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. సమస్య వెంటనే పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున గందరగోళం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.
- భారత్‌లో అనేక దేశీయ విమానయాన సంస్థల్లో చెకిన్, బుకింగ్ సహా విమాన సర్వీసుల వివరాల్లో అంతరాయం ఏర్పడింది.
- ఆస్ట్రేలియాలో వార్తాసంస్థల ప్రసారాల్లోనూ ఇబ్బందులు తలెత్తాయి. బ్రిటిష్ న్యూస్ ఛానెల్ స్కైన్యూస్ సైతం వార్తలను ఎయిర్ చేయడంలో అవాంతరాలు ఎదుర్కొంది.
- ఆస్ట్రేలియాలోని వూల్‌వర్త్స్ అనే సూపర్‌మార్కెట్ సేవల్లోనూ అంతరాయం తలెత్తింది.
- పాయింట్ ఆఫ్ సేల్స్‌లో కస్టమర్ల బ్యాంకు కార్డులు కూడా పనిచేయడం లేదు.
- కొన్ని దేశాల్లో ఆన్‌లైన్‌తో అనుసంధానమై ఉన్న పోలీసుల వ్యవస్థలు సైతం క్రాష్ అయ్యాయి.
- లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కూడా సమస్యలు తలెత్తాయి. అక్కడి మెట్రో సర్వీసులు సైతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
- అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిష్ట్రేషన్ కార్యకలాపాలు సైతం దెబ్బతిన్నాయి.
- అమెరికాలో 911 అత్యవసర సర్వీసుల్లోనూ ఇబ్బందులు ఏర్పడ్డాయి.
@IndiGo6E Stuck at Dubai airport for over an hour now. Check-in servers down, no movement in sight. Frustrating start to travel. @DubaiAirports any updates? #DubaiAirport #TravelTroubles pic.twitter.com/fsU6XesWsD
— Sameen (@MarketWizarddd) July 19, 2024