ETV Bharat / international

25రోజులు పచ్చి చికెన్ తిన్న వ్యక్తి- నో ఫుడ్ పాయిజన్​- ఎలా సాధ్యమైంది? - man eats chicken side effects

Man Eats Raw Chicken For 25 Days : పచ్చి మాంసాన్ని 25రోజులపాటు తిన్నాడు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి. అయినా అతడు ఎటువంటి రోగాలబారిన పడలేదు. ఫుడ్​ పాయిజన్ కూడా కాలేదు. పచ్చి చికెన్ తిన్నా ఆరోగ్యంగా ఉండేందుకు అతడు ఏం చేశాడో తెలుసా?

Man Eats Raw Chicken For 25 Days
Man Eats Raw Chicken For 25 Days
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 5:04 PM IST

Man Eats Raw Chicken For 25 Days : ఉడికించని ఆహార పదార్థాలు తినడం వల్ల అందులో ఉన్న బ్యాక్టీరియాతో రోగాల బారినపడతారు. అలాంటింది అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన జాన్ అనే వ్యక్తి మాత్రం 25రోజులు పచ్చి కోడి మాంసం, గుడ్లను తిన్నాడు. అయినా అతడు ఎటువంటి రోగాల బారినపడలేదు. ఉడికించని చికెన్, గుడ్లలో సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతిస్తాయి. మరి జాన్​ పచ్చి మాంసం, గుడ్లు తిన్నా కూడా ఆరోగ్యంగా ఉండడానికి గల కారణాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

పచ్చి మాంసం తినడం వల్ల కొన్నిసార్లు ఫుడ్​ పాయిజనింగ్ అవుతుంది. అప్పుడు జ్వరం, వికారం, వాంతులు, అతిసారం, బ్లడ్​ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆరోగ్యవంతమైన వ్యక్తులు కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రాణాలను సైతం కోల్పోవాల్సి ఉంటుంది. పచ్చి కోడి మాంసం, గుడ్లు వంటి ప్రాణాంతకమైన ఫుడ్​ తిన్నా, జాన్​ జబ్బుల బారిన పడకపోవడం గమనార్హం. అయితే జాన్ తన డైట్ గురించి వైద్యులను సంప్రదించాడట. అప్పుడు పచ్చి కోడి మాంసం, గుడ్లు తిన్నవారు ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడాలంటే ప్రొఫెలాక్టిక్ యాంటీ బయాటిక్స్​ తీసుకోవాలని వైద్యులు సూచించారట.

పచ్చి చికెన్‌ను శానిటైజ్ చేయడానికి స్టమక్ యాసిడ్‌ను వాడేవాడు జాన్. తద్వారా చికెన్​లో ఇన్​ఫెక్షన్లు కొంత దూరం అవుతాయి. అయినా అతడు పచ్చి మాంసం తిన్నా రోగాల బారిన పడలేదు. మానవుని కడుపు 1.5 నుంచి 2 PH వరకు ఆమ్ల ద్రవాలను కలిగి ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్​కు కారణమైన క్రిములు సున్నితంగా ఉంటాయి. వాటిని కడుపులోని ఆమ్లం చంపేయగలదు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో ఫుడ్​ పాయిజన్​ నుంచి రక్షణ తక్కువగా ఉంటుంది.

వ్యవసాయ క్షేత్రంలో పెరిగే కోడిని జాన్ తిన్నాడు. కాబట్టి కోడి చాలా తాజాగా ఉంటుంది. అదే కోళ్ల ఫారం నుంచి కొన్న కోళ్లు అయితే సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్‌ల వంటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని జాన్ చెప్పాడు. పచ్చి చికెన్​ను రుచిగా మార్చుకునేందుకు మాంసంపై సోయా సాస్, మరికొన్ని మసాలాలు కలిపి తింటానని తెలిపాడు.

అయితే సోయా సాస్ మానవుని కడుపులో ఉన్న యాసిడ్ స్రావాన్ని పెంచడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఆహారంలో ఉన్న సూక్ష్మజీవులను చంపడానికి సాయపడుతుంది. సోయా సాస్ షిగెల్లా ఫ్లెక్స్‌నేరి, స్టెఫిలోకాకస్ ఆరియస్, విబ్రియో కలరా, సాల్మోనెల్లా ఎంటెరిటిడిస్, ఎస్చెరిచియా కోలి వంటి బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే చిల్లీ సాస్‌ ఫుడ్ పాయిజనింగ్ కారణమయ్యే బ్యాక్టీరియా నుంచి మనల్ని కాపాడుతుంది.

చికెన్ ఎలా తినాలంటే?
పచ్చి చికెన్ లేదా మాంసంలో బ్యాక్టీరియాను ఎవరూ తొలగించలేరు. మాంసాన్ని సురక్షితంగా తినడానికి ఏకైక మార్గం దానిని ఉడికించడం. మాంసాన్ని వేడి చేసి తినడం వల్ల అందులో ఉన్న సూక్ష్మజీవులు నశిస్తాయి. సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా 75°C ఉష్ణోగ్రత వరకు మాంసాన్ని ఉడికించడం వల్ల అవి నశిస్తాయి. చికెన్‌ను సరిగ్గా వండడం మాత్రమే మీరు మాంసాన్ని సురక్షితంగా తినడానికి ఉన్న ఏకైక మార్గం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.