ETV Bharat / international

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి - 34 మంది మృతి! - Israeli Gaza War - ISRAELI GAZA WAR

Israeli Airstrikes In Gaza : గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో 34 మంది మరణించారు.

Israeli Airstrikes In Gaza
Israeli Airstrikes In Gaza (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 7:30 AM IST

Israeli Airstrikes In Gaza : గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. పునరావాస కేంద్రంగా ఉన్న పాఠశాల భవనం, ఇళ్లపై జరిపిన వైమానిక దాడుల్లో 34 మంది మృతి చెందారు. వారిలో 19మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గాజా వైద్యులు తెలిపారు. అటు వెస్ట్​బ్యాంక్​లోనూ నిర్వహించిన దాడుల్లో ఐదుగురు మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.

బుధవారం ఉదయం సెంట్రల్ గాజాలోని నుసీరత్ శరణార్థి శిబిరం సమీపంలోని అల్​ జౌనీ ప్రిపరేటరీ బాయ్స్ స్కూల్​పై ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే పాఠశాల నుంచి హమాస్‌ మిలిటెంట్లు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, అందుకే దాడి చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటిచింది. మరోవైపు వెస్ట్‌బ్యాంక్‌లోని ట్యూబస్‌ నగరంలో మిలిటెంట్లు లక్ష్యంగా నిర్వహించిన వైమానిక దాడిలో ఐదుగురిని హతమార్చినట్లు ఐడీఎఫ్‌ తెలిపింది.

యుద్ధంలో 80వేల ఇళ్లు ధ్వంసం, రూ.1.53 లక్షల కోట్ల నష్టం!
గతేడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన మెరుపు దాడికి ప్రతిస్పందనగా గాజా నగరాలపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. ఈ యుద్ధం కారణంగా గాజాలో భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 80వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీటిని పునర్నిర్మించాలంటే బిలియన్‌ డాలర్లు అవసరమని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.

  • గతేడాది అక్టోబర్‌ 7 ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన మెరుపు దాడిలో 1200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
  • ఇజ్రాయెల్‌ జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటివరకు 41 వేలకుపైగా పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పోగా, 95 వేల మంది గాయపడ్డారు. భవన శిథిలాల కింద మరో 10 వేల మృతదేహాలు ఉండొచ్చని అంచనా.
  • ఈ యుద్ధం కారణంగా గాజాలో 80 వేల ఇళ్లు ధ్వంసమైనట్లు గాజా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 18.5 బిలియన్‌ డాలర్ల (రూ.1.53లక్షల కోట్ల) మేర ఆస్తి నష్టం సంభవించింది.
  • 4 కోట్ల టన్నుల శిథిలాలు పేరుకుపోయాయని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. వీటిని తొలగించేందుకే 15 ఏళ్ల సమయం పట్టడమే కాకుండా 50- 60 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని లెక్కకట్టింది.
  • ఐరాస నివేదిక ప్రకారం దాదాపు 19 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. గాజా పునర్నిర్మాణానికి 2040 సంవత్సరం వరకు లేదా మరిన్ని దశాబ్దాల సమయం పడుతుందని తెలుస్తోంది.

గాజాపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి - 40మంది మృతి- 60మందికి పైగా గాయాలు

గాజాపై ఇజ్రాయెల్ డెడ్లీ మిస్సైల్​ అటాక్స్- 16మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.