Mysterious Drones In US : అమెరికాలోని ఆకాశంలో ప్రకాశవంతమైన వస్తువులు కలకలం సృష్టిస్తున్నాయి. న్యూజెర్సీలో రాత్రి వేళ ఆకాశంలో అనుమానాస్పదంగా వస్తువులు కనిపించాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురైనట్లు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వాటని కూల్చేయలంటూ అమెరికాకు ఎన్నికైన అధ్యక్షుడు స్పందించారు.
ఇటీవల యూఎఫ్‌వో (UFO) తరహా డ్రోన్‌లు ఆకాశంలో ఎగిరాయి. మళ్లీ గురువారం రాత్రి ఆకాశంలో అనుమానాస్పద వస్తువులు ఎగరడం కనిపించింది. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు ఈ డ్రోన్‌లు ఇరాన్ మదర్‌షిప్ నుంచే వచ్చాయని కొందరు, వాటిని చైనా వదిలిందని మరికొందరు, ట్రంప్ చేయించారంటూ సామాజిక మాధ్యమాల్లో వందతులు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో అధ్యక్షుడు జో బైడెన్ దీనిపై సమాధానం చెప్పాలని స్థానిక గవర్నర్ ఫిల్ మర్ఫీ డిమాండ్ చేశారు.
How are dozens of SUV-sized drones flying over New Jersey on a nightly basis and nobody in our government knows where they’re coming from or what they’re doing?
— The Kevin Harlan Effect (@KevHarlanEffect) December 11, 2024
FBI, Congress, local officials - all baffled.
And no one is even talking about it?
WHAT?!pic.twitter.com/7ldNDqF94Y
'వాటిని కూల్చేయండి'
న్యూజెర్సీ గగనతలంలో డ్రోన్‌లు ఎగరడంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. 'బైడెన్ ప్రభుత్వానికి తెలియకుండానే అవి ఎగురుతున్నాయా?. దీని గురించి ప్రజలకు తెలియజేయండి. లేదంటే వాటిని కూల్చేయండి' అని ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.
ఇదిలాఉండగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, ఎఫ్‌బీఐ అధికారులు ఈ డ్రోన్‌లు ఎగరడంపై దర్యాప్తు చేస్తున్నారని వైట్‌హౌస్ నేషనల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జాన్ కిర్మీ తెలిపారు. అంతేకాకుండా అవి మనుషులతో కూడిన విమానాలేనని, చట్టబద్ధంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.