ETV Bharat / international

బిలియనీర్ హిందూజా కుటుంబంలో నలుగురికి జైలు శిక్ష- ఆ కేసులో స్విస్ కోర్టు సంచలన తీర్పు - Hinduja Case Switzerland

Hinduja Servants Case : బ్రిటన్‌లో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారత సంతతికి చెందిన హిందుజా కుటుంబానికి షాక్‌ తగిలింది. స్విట్జర్లాండ్‌ జెనీవాలోని విల్లాలో పనిచేసే సిబ్బందిపై శ్రమదోపిడీకి పాల్పడ్డారనే కేసులో ఆ కుటుంబంలోని నలుగురికి కోర్టు జైలు శిక్ష విధించింది.

Hinduja Servants Case
Hinduja Servants Case (Getty Images, ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 8:12 AM IST

Hinduja Servants Case : భారతీయ మూలాలున్న సంపన్న హిందుజా గ్రూప్‌ కుటుంబసభ్యుల్లో నలుగురికి స్విట్జర్లాండ్‌లోని జెనీవా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇంటి పనివారికి తక్కువ వేతనాలు ఇవ్వడం, వేధింపులకు గురిచేశారనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ప్రకాశ్‌ హిందుజా, ఆయన భార్య కమల, కుమారుడు అజయ్‌, కోడలు నమ్రతకు నాలుగు నుంచి నాలుగున్నర ఏళ్లపాటు జైలు శిక్షను ఖరారు చేసింది. అదేవిధంగా కుటుంబ వ్యాపార నిర్వాహకుడు నజీబ్‌ జియాజీకి న్యాయస్థానం 18 నెలల సస్పెండెడ్‌ శిక్ష విధించింది. ఈ కేసులో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే తీవ్రమైన నేరారోపణలను జెనీవా కోర్టు తోసిపుచ్చింది.

పనివాళ్ల కంటే పెంపుడు కుక్కకే ఎక్కువ
నిరక్షరాస్యులైన భారతీయులను తీసుకొచ్చి జెనీవాలోని తమ విలాసవంతమైన విల్లాలో సేవకులుగా నియమించుకున్నారని, వారి పాస్‌పోర్టులను ప్రకాశ్‌ హిందుజా కుటుంబం తీసేసుకుందని ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. వేతనాలను స్విస్‌ కరెన్సీలో కాకుండా రూపాయల్లో చెల్లుస్తున్నారని, అదీ కూడా సేవకుల చేతికి ఇవ్వకుండా భారత్‌లోని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారని తెలిపింది. రోజుకు 15-18 గంటలకుపైగా పనిచేయించుకోవడం, తగు విశ్రాంత సమయాన్ని ఇవ్వకపోడం, విల్లాని వదిలి వెళ్లటానికి అనుమతించకపోవడం వంటి నేరారోపణలు మోపింది. 18 గంటలు పనిచేస్తే 6.19 పౌండ్ల (652 రూపాయలు) కంటే తక్కువ చెల్లిస్తున్నారని, ఇంట్లో ఉండే పెంపుడు శునకానికి మాత్రం ఏడాదికి 7615 (సుమారు 8లక్షలు) పౌండ్లు ఖర్చు చేస్తున్నారని తెలిపింది. స్విట్జర్లాండ్‌ చట్టాలను ఉల్లంఘించారని, ఆ కుటుంబంలో నలుగురిపై చర్యులు తీసుకోవాలని ప్రాసిక్యూషన్‌ కోరింది. కేసును విచారించిన జెనీవా కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

2007లోనూ దోషిగా
అయితే తీర్పు సమయంలో నలుగురు కోర్టులో లేరు. వారి మేనేజర్ హాజరయ్యారు. అతనికి 18 నెలలు జైలు శిక్ష విధించినప్పటికీ, అమలు చేయకుండా నిలిపివేసింది. ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేస్తామని ప్రకాశ్​ హిందుజా తరఫు న్యాయవాది తెలిపారు. రెండు దశాబ్దాల కిందటే హిందుజా కుటుంబం స్విస్‌ పౌరసత్వాన్ని పొందారు. 2007లోనూ ఇవే తరహా నేరాలకు ప్రకాశ్‌ హిందుజాను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కుటుంబం పన్నులకు సంబంధించిన కేసును కూడా ఎదుర్కొంటోంది.

పాలస్తీనియన్ల గుడారాలపై ఇజ్రాయెల్ దాడి - 25 మంది మృతి, 50మందికి గాయాలు

హజ్​ యాత్రలో 98మంది భారతీయులు మృతి- ఆ కారణంతోనే ఎక్కువగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.