ETV Bharat / international

ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు- రష్యా ఆస్తుల వడ్డీ నుంచి రూ.4లక్షల కోట్లు!- ఇటలీకి మోదీ - G7 Summit 2024

G7 Summit Ukraine : ఉక్రెయిన్‌కు రూ.4.17లక్షల కోట్లు రుణ ప్యాకేజీ అందించాలని జీ-7 దేశాలు ముందుకొచ్చాయి. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధులను సమకూర్చాలని తీర్మానించాయి.

G7 Summit Ukraine
G7 Summit Ukraine (Associated Press, ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 7:45 AM IST

Updated : Jun 14, 2024, 9:03 AM IST

G7 Summit Ukraine : రష్యాతో యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరింత అండగా నిలిచేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి రూ.4.17 లక్షల కోట్ల (5 వేల కోట్ల డాలర్లు) రుణ ప్యాకేజీ అందించాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధులను సమకూర్చాలని తీర్మానించాయి. ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైన వేళ గురువారం ఈ మేరకు కీలక పరిణామం జరిగింది.

రష్యాపై ఆంక్షల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో దాదాపు రూ.21.72 లక్షల కోట్ల విలువైన ఆ దేశ ఆస్తులు స్తంభింపజేసి ఉన్నాయి. వాటిలో అత్యధికం ఐరోపా దేశాల్లోనివే. సాంకేతికంగా, చట్టపరంగా సమస్యలు తలెత్తకుండా ఈ ఆస్తుల నుంచి నిధులు ఎలా సమకూర్చాలన్నదానిపై జీ7 దేశాలు విస్తృతంగా సమాలోచనలు జరపనున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి భారీ విధ్వంసం సృష్టించినందుకు రష్యా పరిహారం చెల్లించేదాకా, ప్రస్తుతం స్తంభింపజేసిన ఆ దేశ ఆస్తులపై ఆంక్షలను తొలగించకూడదనీ అమెరికా, ఐరోపా దేశాలు నిర్ణయించాయి.

తాజా రుణ ప్యాకేజీలో భాగంగా తొలి విడత నిధులు ఈ ఏడాదే ఉక్రెయిన్‌కు అందనున్నాయి. శుక్రవారం దీనిపై సంయుక్త ప్రకటన వెలువడనుంది. జీ7లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్యదేశాలు. ఉక్రెయిన్‌కు సైనికేతర సాయం కింద తాము సొంతంగా 31 కోట్ల డాలర్లు అందజేయనున్నట్లు బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ తాజాగా ప్రకటించారు.

శిఖరాగ్ర సదస్సు ప్రారంభం
జీ7 శిఖరాగ్ర సదస్సు ఇటలీలో అపులియా ప్రాంతంలోని విలాసవంతమైన బోర్గో ఇగ్నాజియా రిసార్టులో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ తదితరులు తాజా సదస్సులో అతిథుల హోదాలో పాల్గొననున్నారు.

ఇటలీకి పయనమైన మోదీ
జీ7 శిఖరాగ్ర సదస్సు అనుబంధ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం ఇటలీ చేరుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అక్కడి సమావేశంలో ప్రధానంగా కృత్రిమ మేధ (ఏఐ), ఇంధనం, మధ్యధరా, ఆఫ్రికా దేశాల్లో పరిస్థితులపై తాను చర్చించనున్నట్లు ప్రయాణ ప్రారంభానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గ్లోబల్‌ సౌత్‌కు కీలకమైన అంశాలపైనా సమాలోచనలు జరపనున్నట్లు తెలిపారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే.

Last Updated : Jun 14, 2024, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.