ETV Bharat / international

అబ్రహం లింకన్‌ టు డొనాల్డ్​ ట్రంప్‌- అమెరికాలో నాయకులే లక్ష్యంగా దాడులు! - Attacks On US Presidents - ATTACKS ON US PRESIDENTS

Attacks On US Presidents And Candidates : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంతో యావత్‌ ప్రపంచం ఉలిక్కిపడింది. అగ్రరాజ్యంలో రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు జరగటం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో పలువురు అధ్యక్షులు, మాజీలు, పలు పార్టీలకు చెందిన అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్‌ తరహాలోనే దాడుల బారినపడ్డారు. వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.

Attacks On US Presidents And Candidates
Attacks On US Presidents And Candidates (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 4:12 PM IST

Updated : Jul 14, 2024, 4:20 PM IST

Attacks On US Presidents And Candidates : అమెరికాలో రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు జరగటం ఇదే మొదటిసారి కాదు. అగ్రరాజ్యం అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ నుంచి మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ వరకు పలువురు ఈ దాడుల బారినపడ్డారు. అగ్రరాజ్యంలో రాజకీయ హింసకు తొలిసారిగా అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ బలయ్యారు. 1865 ఏప్రిల్‌ 14న వాషింగ్టన్‌లోని ఫోర్డ్స్‌ థియేటర్‌లో భార్యతో కలిసి ఓ షోకు హాజరైన లింకన్‌పై, జాన్‌ విల్కెస్‌ బూత్‌ అనే దుండగుడు కాల్పులు జరిపాడు. తలవెనక భాగంలో తీవ్రగాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అబ్రహం లింకన్‌ ప్రాణాలు కోల్పోయారు. నల్ల జాతీయుల హక్కులకు మద్దతు ఇవ్వడమే లింకన్‌ హత్యకు కారణంగా తేలింది.

బాధ్యతలు స్వీకరించిన 6 నెలల్లోనే!
అమెరికా 20వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన 6 నెలల్లోనే గార్ఫీల్డ్‌ హత్యకు గురయ్యారు. 1881 జులై 2న న్యూ ఇంగ్లాండ్‌ వెళ్లేందుకు వాషింగ్టన్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం నడుస్తున్న సమయంలో చార్లెస్‌ గిటౌ అనే దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన గార్ఫీల్డ్‌, వైట్‌హౌస్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ప్రజలతో కరచాలనం చేస్తున్న సమయంలో!
1901 సెప్టెంబర్‌ 6న ప్రసంగం అనంతరం అమెరికా 25వ అధ్యక్షుడు విలియం మెక్‌కిన్లే ప్రజలతో కరచాలనం చేస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో హంతకుడు కాల్పులు జరపగా 2 బుల్లెట్లు మెక్‌కిన్లే ఛాతీలోకి చొచ్చుకుపోయాయి. వారం రోజులపాటు మృత్యువుతో పోరాడిన మెక్‌కిన్లే తుదిశ్వాస విడిచారు. రెండోసారి అధికారం చేపట్టిన ఆరునెలల్లోనే ఆయనపై దాడి జరిగింది.

1933లో అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా ఉన్న సమయంలో ఆయన ఉన్న ఓపెన్‌ కారుపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో రూజ్‌వెల్ట్‌కు గాయాలేమీ కాలేదు. అయితే చికాగో మేయర్ అంటోన్ సెర్మాక్ మరణించారు. అమెరికా 33వ అధ్యక్షుడు హ్యారీ S. ట్రూమాన్ 1950లో వైట్ హౌస్‌కి ఎదురుగా బ్లెయిర్ హౌస్‌లో ఉంటున్న సమయంలో ఇద్దరు ముష్కరులు లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ట్రూమాన్ గాయపడలేదు, కానీ వైట్‌హౌస్ పోలీసు, దుండగుల్లో ఒకరు మరణించారు.

కాన్వాయ్‌పై శక్తిమంతమైన రైఫిల్‌తో!
1963 నవంబర్‌లో డల్లాస్‌కు వెళ్లిన సమయంలో అమెరికా 35వ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడీపై కాల్పులు జరిగాయి. ఆయన కాన్వాయ్‌పై శక్తిమంతమైన రైఫిల్‌తో దుండగులు కాల్పులు జరిపారు. కెన్నడీని పార్క్‌ల్యాండ్‌ మెమోరియల్‌ ఆసుపత్రికి తరలించగా అక్కడే ఆయన ప్రాణాలు వదిలారు. 38వ అధ్యక్షుడు గెరాల్డ్‌ ఫోర్డ్‌పై 1975లో వారాల వ్యవధిలో రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. రెండు సందర్భాల్లోనూ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.

1981 మార్చిలో అమెరికా 40వ అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌పై వాషింగ్టన్‌ DCలో కాల్పులు జరిగాయి. ఆ గాయాల నుంచి రీగన్‌ కోలుకున్నారు. అమెరికా 43వ అధ్యక్షుడు జార్జ్‌ W బుష్‌ 2005లో జార్జియన్ అధ్యక్షుడు మిఖాయిల్ సాకాష్విలితో టిబిలిసిలో ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఒకరు గ్రనేడ్‌ విసిరారు. అది 100 అడుగుల దూరంలో పడటమే కాకుండా పేలకపోవడం వల్ల ప్రమాదం తప్పింది.

అటాక్​తో పెరిగిన ట్రంప్ గ్రాఫ్- విజయావకాశాలు భారీగా జంప్! - 2024 US Elections Trump

మాజీ అధ్యక్షుడిని కాపాడిన 50పేజీల స్పీచ్ పేపర్లు​- బుల్లెట్​ తగిలినా ఆగని ప్రసంగం! - US Elections

Last Updated : Jul 14, 2024, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.