ETV Bharat / international

అవినీతి కేసులో ఇమ్రాన్ దంపతులు దోషులే- 14 ఏళ్లు జైలుశిక్ష విధించిన కోర్టు - CORRUPTION CASE IMRAN KHAN

అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో దోషులుగా ఇమ్రాన్ ఖాన్ దంపతులు- పాక్ కోర్టు సంచలన తీర్పు

Imran Khan
Imran Khan (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2025, 1:02 PM IST

Updated : Jan 17, 2025, 2:00 PM IST

Corruption Case Imran Khan : పాకిస్థాన్​ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. అల్ ఖాదిర్ యూనివర్సిటీ ట్రస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.2వేల కోట్ల కుంభకోణం కేసును విచారించిన కోర్టు- శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీలను దోషులుగా తేల్చింది. ఇమ్రాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించింది. బుష్రా బీబీకి ఏడేళ్ల జైలుశిక్ష, రూ.1.50 లక్షల జరిమానాను విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఇస్లామాబాద్‌లోని యాంటీ కరప్షన్ ప్రత్యేక కోర్టుకు చెందిన న్యాయమూర్తి జస్టిస్ నాసిర్ జావెద్ రాణా తీర్పు ఇచ్చారు.

గతంలో వివిధ కారణాలతో ఈ అవినీతి కేసులో తీర్పు ఇవ్వడం మూడుసార్లు వాయిదా పడింది. చివరిసారిగా జనవరి 13న తీర్పు వెలువరించడాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రావల్పిండిలో ఉన్న అదియాలా సెంట్రల్‌ జైలులో తాత్కాలిక కోర్టును ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే తీర్పును న్యాయమూర్తి జస్టిస్ నాసిర్ జావెద్ రాణా ఇచ్చారు. కాగా, ఇతరత్రా కేసుల్లో శిక్ష పడటం వల్ల ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే జైలులో ఉన్నారు. తీర్పును వెలువరించిన వెంటనే కోర్టులోనే బుష్రా బీబీని అరెస్టు చేశారు.

ఏమిటీ కేసు?
ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఎన్నో మలుపులు తిరిగాయి. జీలం ప్రాంతంలో అల్ ఖాదిర్ పేరుతో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ దంపతులు భావించారు. ఇందుకోసం ఇమ్రాన్ ఖాన్ 57.25 ఎకరాల భూమిని తన ప్రభుత్వం ద్వారా కేటాయించారు. యూనివర్సిటీకి సంబంధించి ఏర్పాటు చేసిన అల్ ఖాదిర్ ట్రస్టులో ట్రస్టీగా బుష్రా బీబీ నియమితులు అయ్యారు. ఆ తర్వాతే అసలు స్కామ్ జరిగింది.

పాకిస్థాన్​ చెందిన ఒక బడా స్థిరాస్తి వ్యాపారితో సెటిల్‌మెంట్‌లో భాగంగా బ్రిటన్‌కు చెందిన జాతీయ నేర దర్యాప్తు సంస్థ రూ.1,553 కోట్లను అప్పటి ప్రభుత్వానికి అందజేసింది. వాస్తవానికి ఆ నిధులు నేరుగా పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానాలోకి చేరాలి. కానీ ఇమ్రాన్ ఖాన్ ఆ నిధులను సదరు స్థిరాస్తి వ్యాపారికి అందేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకు ప్రతిఫలంగా బుష్రా బీబీ సారథ్యంలో నడుస్తున్న అల్ ఖాదిర్ ట్రస్టుకు స్థిరాస్తి వ్యాపార ఆర్థిక సహకారాన్ని అందించారు. యూనివర్సిటీ నిర్మాణానికి నిధులను సమకూర్చారు. ఈ క్విడ్ ప్రోకో వ్యవహారమే అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసు.

Last Updated : Jan 17, 2025, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.