ETV Bharat / international

ఐరాస భద్రతా మండలిలో భారత్​ ఉండాలి- శక్తిమంతమైన దేశాలకు అదే సమస్య! : ఎలాన్ మస్క్ - ఐరాస భద్రతా మండలిలో భారత్

Elon Musk India Permanent Seat In UNSC : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్​కు స్థానం లేకపోవడంపై ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్​ కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో భారత్ ఉండకపోవడం అర్థరహితం అన్నారు. ఆఫ్రికన్ యూనియన్​కు కూడా సభ్యత్వం ఇవ్వాలని చెప్పారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 2:08 PM IST

Elon Musk India Permanent Seat In UNSC : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తప్పుబట్టారు. ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమని మస్క్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయని విమర్శించారు.

ఇదీ జరిగింది
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఇటీవల సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. భద్రతా మండలిలో ఏ ఆఫ్రికా దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థలు నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని, 80 ఏళ్ల కిందటి మాదిరిగా ఇప్పటికీ కొనసాగకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంటోనియో గుటెరస్‌ ట్వీట్‌తో భద్రతా మండలిలో దేశాల శాశ్వత సభ్యత్వంపై మళ్లీ చర్చ మొదలైంది.

భారత్ సంగతేంటి?
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంపై ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ చేసి ట్వీట్‌కు అమెరికా పెట్టుబడిదారు మైఖెల్‌ ఐసెన్‌బర్గ్‌ స్పందించారు. శాశ్వత సభ్య దేశాల్లో భారత్‌ సంగతేంటీ అని ప్రశ్నించారు. మైఖెల్‌ ఐసెన్‌బర్గ్‌ ట్వీట్‌పై ప్రపంచ కుబేరుడు ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ఐరాస, దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉందని మస్క్‌ తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడానికి అర్థరహితం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడకపోవడమే అసలు సమస్యని ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో ఐరాస ఆవిర్భవించింది. దీనికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయింది. నాటి నుంచి ఇప్పటి వరకు భద్రతా మండలిలో మాత్రం ఎలాంటి మార్పులూ చోటుచేసుకోలేదు. వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లే కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ పట్టుబడుతున్నా, ఎలాంటి మార్పులు జరగట్లేదు. ఐదింటిలో నాలుగు దేశాలు భారత్‌కు అనుకూలంగానే ఉన్నా ఒక్క చైనా మాత్రం మోకాలడ్డుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.