Drone Attack in Jordan : ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం మొదలయ్యాక ఇరాక్, సిరియాల్లోని అమెరికా స్థావరాలపై తరచూ దాడులు జరుగుతున్నాయి. తాజాగా జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. ఇరాక్ కేంద్రంగా పనిచేసే ముజాహిదీన్ ఆఫ్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూపు ఈ దాడికి పాల్పడిందని అమెరికా వెల్లడించింది. యుద్ధం మొదలయ్యాక పశ్చిమాసియాలో తమ సైనికులు చనిపోవడం ఇదే మొదటిసారి అని అమెరికా తెలిపింది.
ఇరాన్ మద్దతునిచ్చే మిలిటరీ గ్రూపు దాడి
ఆదివారం నాలుగు శత్రు స్థావరాలపై దాడులు చేసినట్లు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ప్రకటించింది. సిరియాలో మూడు, జోర్డాన్‌లోని ఆక్రమిత పాలస్తీనా ప్రాంతంలో ఒక ప్రాంతంపై దాడులు చేసినట్లు పేర్కొంది. తమ స్థావరంపై దాడి ఇరాన్ మద్దతిచ్చే మిలిటరీ గ్రూపు పనేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దాడులకు పాల్పడిన వారిని తగిన సమయంలో శిక్షిస్తాం. 'మా దేశం ముగ్గురు సైనికులను కోల్పోయింది. వారి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.' అని జో బైడెన్ పేర్కొన్నారు.
ఈ ఘటనపై అమెరికా డిపెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ కూడా స్పందించారు. ఈ దాడిలో ముగ్గురు సైనికులను కొల్పోవటం బాధకరంగా ఉందన్న ఆస్టిన్, దీన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన జోర్డాన్, తమ దేశం బయట సిరియా సరిహద్దులో దాడి జరిగినట్లు వెల్లడించింది. జోర్డాన్‌లో దాదాపు 3 వేల మంది అమెరికా సైనికులు ఉంటున్నారు.
అమెరికా గస్తీ నౌకపై దాడి
Houthis Attack On Us Ship : శుక్రవారం హౌతీ తిరుగుబాటు దారులు అమెరికా గస్తీ నౌకపై దాడి చేశారు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో గస్తీ తిరుగుతున్న అమెరికా యుద్ధనౌక ఈఎస్ఎస్ కార్నేపై హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణిని ప్రయోగించారు. దీన్ని తమ దళాలు కూల్చివేశాయని అమెరికా మిలిటరీ ఓ ప్రకటనతో తెలిపింది. అయితే ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై హౌతీ దాడులకు దిగినప్పటినుంచి, అమెరికా నౌకను డైరెక్ట్‌గా టార్గెట్ చేయడం ఇదే తొలిసారి.
ఇరాన్‌కు చైనా వార్నింగ్- నౌకలపై దాడులు ఆపకపోతే వ్యాపార సంబంధాలు కట్!