Trump on Daylight Saving Time : అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత "డే లైట్ సేవింగ్ టైమ్" విధానానికి ముగింపు పలకనున్నట్టు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తెలిపారు. గడియారాలను వసంతకాలంలో ఒక గంట ముందుకు, శరదృతువులో ఒక గంట వెనుకకు సెట్ చేయడం, వేసవి నెలలలో పగటి వెలుతురును పెంచడానికి ఉద్దేశించిందని తన సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. ఈ విధానంలో సమయాన్ని ఆదా చేయడం అసౌకర్యంగా ఉంటుందని, అది అమెరికాకు చాలా ఖర్చుతో కూడుకుందని ట్రంప్ పేర్కొన్నారు.
"డే లైట్ సేవింగ్ టైమ్‌ను" 1942లో మొదటిసారిగా యుద్ధకాల ప్రమాణంగా స్వీకరించారు. అమెరికా చట్టసభ సభ్యులు పలుమార్లు ఈ తరహా సమయ మార్పును పూర్తిగా తొలగించాలని ప్రతిపాదించారు. చాలా దేశాలు డేలైట్ సేవింగ్ సమయాన్ని పాటించవు. అలా చేసే వారికి, గడియారాలు మార్చే తేదీ మారుతూ ఉంటుంది. మారుతున్న సమయ వ్యత్యాసాలు సంక్లిష్టతను సృష్టిస్తాయి.