Do Identical Twins Have The Same Fingerprints : చేయాలనుకున్న అల్లరి పనులన్నీ చేసెయ్యటం అన్న, తమ్ముడు, అక్క, చెల్లి మీద తోసేయటం. బాల్యంలో అందరూ ఒకే రకం. ఇక కవలల విషయానికి వస్తే చెప్పనవసరం లేదు, తల్లి గర్భం నుంచి ఒకే సమయంలో లేదా కొన్ని సెకన్ల వ్యవధిలో జన్మించే కవల పిల్లలలో అయితే ఎవరు అల్లరి చేసారో పోల్చుకోవటం కష్టం. ఎందుకంటే చాలా మంది శరీర నిర్మాణం, రంగు, జట్టు, ఎత్తు వంటివన్నీ దాదాపు 99 శాతం ఒకేలా ఉంటాయి. ఒకే పోలికతో ఉండే కవలలను వైద్య పరిభాషలో 'ఐడెంటికల్ ట్విన్స్'(Identical Twins) అంటారు. అయితే చిన్నప్పుడు అల్లరి సంగతి పక్కన పెడితే పెద్దయ్యాక ఇది అంత సమస్య అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ నేరాల విషయంలో మాత్రం ఇది చాలా కీలక అంశం.
పురుషుల్లోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి విడుదలయ్యే శుక్ర కణం మహిళల్లోని అండంతో ఫలదీకరణం చెందడం వల్లే పునరుత్పత్తి జరుగుతుందని మనకు తెలుసు. అయితే ఒక్కోసారి మహిళల్లో రెండు అండాలు విడుదలైనప్పుడు వాటికి రెండు శుక్ర కణాలు జతకలిస్తే ఫలదీకరణ విభిన్నంగా ఉంటుంది. లేదా ఒకే అండం రెండు సార్లు విదళనం చెందిన క్రమంలో కవల పిల్లలు జన్మిస్తారు. అయితే కవలలు రూపంలో ఒకేలా ఉన్నా, తల్లి గర్భం వారికి సమానంగా స్థలాన్ని పంచినా, జెనెటిక్ నిర్మాణాన్ని మాత్రం వంద శాతం సమానంగా పంచలేదు. ఇక వారి ఫింగర్ ప్రింట్స్, కళ్లు (ఐరిస్)మాత్రం పూర్తిగా వేరేలా ఉంటాయి. ఒకవేళ ఇలా లేకుండా ఉండే అవకాశం ఉంటే 64 బిలియన్‌లలో ఒకటి కంటే తక్కువగానే ఉంటుందట. సాధారణంగా గర్భస్థ శిశువుకు 13 నుంచి 19 వారాల వ్యవధిలో వేలి ముద్రలు రూపొందుతాయి. ఈ సమయంలో తల్లి రక్తపోటు, గర్భం వైశాల్యం, బొడ్డు తాడు పొడవు, తల్లి నుంచి సంక్రమించే పోషకాల స్థాయి వేళ్ల పెరుగుదల వేలి ముద్రల నిర్మాణంలో ప్రభావం చూపుతాయి. అందుకే చూడటానికి ఒకే రకంగా ఉండే ఐడెంటికల్ ట్విన్స్ అయినా వారి వేలి ముద్రలు మాత్రం వేర్వేరుగానే ఉంటాయి.
చీమలకు ఊపిరితిత్తులు ఉండవ్! మరెలా గాలి పీల్చుకుంటాయో తెలుసా? - How Do Ants Breathe