China Landslide Today : చైనాలోని పర్వత ప్రాంతమైన యునాన్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడి 47 మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు. ఈ ఘటన బీజింగ్ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 5:51 గంటలకు ఝాటోంగ్ నగరంలోని లియాంగ్‌షుయ్ గ్రామంలో జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విరిగిపడిన కొండచరియల్లో ఇరుక్కుపోయిన వారిని రక్షించడం కోసం దాదాపు 200 మంది రెస్క్యూ సిబ్బంది 33 అగ్నిమాపక వాహనాలు, 10 లోడింగ్ మెషీన్లను ఘటనా స్థలానికి తరలించారు. 500 మందిని ఘటనా స్థలం నుంచి సురక్షిత ప్రాంతాలనకు తరలించారు. ఈ ఘటనలో పలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- 23 మంది మృతి
Thailand Bomb Blast : ఇటీవలే సెంట్రల్ థాయిలాండ్‌లోని బాణసంచా పరిశ్రమలో పేలుడు సంభవించి సుమారు 23 మంది మరణించారు. రాజధాని బ్యాంకాక్‌కు వాయువ్య దిశలో 90 కి.మీల దూరంలోని సుఫాన్ బురీ ప్రావిన్సులో ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. కాగా, ఘటన జరిగిన సమయంలో 20 నుంచి 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు. అయితే ఫిబ్రవరిలో జరిగే చైనా నూతన ఏడాదిని పురస్కరించుకొనే డిమాండ్‌కు అనుగుణంగా ఇక్కడ పెద్ద ఎత్తున బాణసంచా తయారీ జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతేడాది నవంబర్లోనూ జరిగిన బాంబు పేలుడులో ఒక కార్మికుడు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు.
Fire Accident In Dormitory In China : ఇటీవలే చైనాలోని ఓ పాఠశాల వసతి గృహంలో మంటల చెలరేగి 13 మంది మృతిచెందగా ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన హెనాన్ ప్రావిన్స్‌లో యన్షాన్పు గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు.
స్కూల్ హాస్టల్లో మంటలు- 13 మంది మృతి- ఫ్యాక్టరీలో పేలుడుకు 8 మంది బలి
పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై ఇరాన్ దాడి - ఇద్దరు చిన్నారులు మృతి!