China Fire Accident Today : చైనాలో జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మరో 44 మంది గాయపడ్డారు. జియాంగ్సు ప్రావిన్స్ రాజధాని నాన్‌జింగ్‌లో ఓ భవనంలో మంటలు చెలరేగడం వల్ల శుక్రవారం జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న అధికారులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలక్ట్రికల్ సైకిళ్లు ఉంచిన భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
అమెరికాలో అగ్ని ప్రమాదం
America Fire Accident : అమెరికాలోని జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు మరణించగా, మరో 17మంది గాయపడ్డారు. న్యూయార్క్‌లోని ఓ అపార్ట్మెంట్లో శుక్రవారం మంటలు చెలరేగడం వల్ల జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డవారిలో నలుగురి విషమంగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
నివాస భవనాల్లో మంటలు- నలుగురు మృతి!
Spain Fire Accident : స్పెయిన్‌లోని వాలెన్సీయా నగరంలో అగ్నిప్రమాదం జరిగింది. రెండు బహుళ అంతస్తుల నివాస భవనాలు మంటల్లో చిక్కుకుపోయిన ఘటనలో నలుగురు మృతిచెందగా, మరో 13 మందికి గాయాలయ్యాయి. వారిలో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. మరో 14 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది క్రేన్ల సాయంతో పలువురిని రక్షించారు. తొలుత ఓ భవనంలో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న మరో దానికి వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు, భవంతుల్లో ఎంతమంది ఉన్నారో తెలియరాలేదు.
షాపింగ్ మాల్లో అగ్నిప్రమాదం- 39మంది బలి!
నెలరోజుల క్రితం చైనాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 39 మంది మరణించారు. ఆగ్నేయ జియాంగ్జీ ప్రావిన్స్‌లోని ఓ షాపింగ్ మాల్ పరిసరాల్లో జరిగిందీ దుర్ఘటన. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక దళాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదాలు పదే పదే జరగకుండా చర్యలు తీసుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.