ETV Bharat / international

బంగ్లాదేశ్​లో రిజర్వేషన్ల రగడ- నిరసనకారులపైకి బుల్లెట్లు- 15వేలమంది భారతీయులు సేఫ్​! - Bangladesh Violent Protest

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 5:26 PM IST

Bangladesh Violence Today : రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్‌ అల్లకల్లోలమవుతోంది. నిరసనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు బుల్లెట్లు, టియర్ గ్యాస్​ను ప్రయోగించారు. ఈ క్రమంలో ఢాకాలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను శుక్రవారం నిలిపివేశారు. మరోవైపు, బంగ్లాదేశ్​లో ఉన్న 15వేల మంది భారతీయులు క్షేమంగా ఉన్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

Bangladesh Violence
Bangladesh Violence (Associated Press)

Bangladesh Violence Today : రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్‌ అట్టుడుకుతోంది. నిరసనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు బుల్లెట్లు, టియర్ గ్యాస్​ను ప్రయోగించారు. అలాగే దేశ రాజధాని ఢాకాలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను శుక్రవారం నిలిపివేశారు. వారం క్రితం ప్రారంభమైన ఈ నిరసనలు గురువారం నాటికి తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారులు చేపట్టిన దేశవ్యాప్త బంద్‌ హింసాత్మకమైంది. దీంతో ఘర్షణల్లో 22 మంది మరణించగా, వేలాది మందికి గాయపడ్డారు. అలాగే శుక్రవారం మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా తెలిపింది.

Bangladesh Violence
బంగ్లాదేశ్​లో ఆందోళనలు (Associated Press)

వారికి రిజర్వేషన్లు తొలగించాలని నిరసనలు
బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం కోసం 1971లో జరిగిన యుద్ధంలో మరణించిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగ రిజర్వేషన్లలో 30శాతం కోటా కల్పిస్తున్నారు. అయితే ఇప్పటికైనా ఈ పద్ధతిని మార్చి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని అక్కడి వర్సిటీల విద్యార్థులు, ప్రజలు కొన్ని రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసనకారులు రెచ్చిపోయారు. వారిని అదుపు చేయడానికి ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ రాజధాని ఢాకాలో పోలీసులు, పారా మిలిటరీ బలగాలను మోహరించింది. శుక్రవారం కూడా ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్​లు ఫేస్‌ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాపై కూడా నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ లేకపోవడం వల్ల విమానాలు, బ్యాంకులు, మీడియా సంస్థలు, ఇతర సేవలకు అంతరాయం కలిగింది.

'రిజర్వేషన్లతో వారికే ప్రయోజనం'
తమ డేటా సెంటర్​పై నిరసకారులు దాడి చేయడం వల్ల సేవలను అందించలేకపోయామని బంగ్లాదేశ్ టెలికమ్యూనికేషన్ రెగ్యురేటరీ కమిషన్ పేర్కొంది. కాగా, షేక్ హసీనా సర్కార్ ఇస్తున్న రిజర్వేషన్లను విద్యార్థులు తప్పుపట్టారు. ఈ వ్యవస్థ వివక్షతో నిండిపోయందని వాపోయారు. ఈ రిజర్వేషన్లు షేక్ హసీనా మద్దతుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆరోపించారు. మరోవైపు, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు రిజర్వేషన్లను సమర్థించారు. దేశం కోసం యుద్ధంలో పాల్గొన్నవారికి గౌరవం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

'అది వారి అంతర్గత విషయం'
మరోవైపు, బంగ్లాదేశ్​లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ చెలరేగిన హింసపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ హింసను బంగ్లాదేశ్ అంతర్గత విషయంగా చూస్తామని పేర్కొంది. 8,000 మంది విద్యార్థులతో సహా 15,000 మంది భారతీయులు బంగ్లాదేశ్​లో ఉన్నారని, వారంతా క్షేమమని వెల్లడించింది. బంగ్లాదేశ్​లో ఉన్న భారతీయులకు సాధ్యమైనంత సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.