Bangladesh PM House Looted : దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలతో షేక్ హసీనా ప్రభుత్వం వణికిపోయింది. అందోళనకారులు ప్రధాని అధికారిక నివాసమైన గణభాబన్‌ను ముట్టడించి, అక్కడ విధ్వంసం సృష్టించారు. విలువైన వస్తువుల్ని లూటీ చేసినట్లు స్థానిక మీడియా ప్రసారం చేస్తోన్న దృశ్యాల్లో కనిపిస్తోంది. చికెన్, ఫిష్, కూరగాయలు, ఫర్నీచర్, ఇతర విలువైన వస్తువులు పట్టుకుపోయినట్లు పేర్కొన్నాయి. దాదాపు 20 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన షేక్ హసీనా రాజీనామాతో పలువురు ఆనందం వ్యక్తం చేశారు. వీధుల్లోకి వచ్చి, జెండాలు ఊపుతూ మరి వాళ్ల సంతోషం వ్యక్తం చేశారు. ఢాకాలో పార్క్ చేసిన యుద్ధ ట్యాంక్‌పైకి ఎక్కి, డ్యాన్సులు చేశారని అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.
VIDEO | Visuals of Sheikh Hasina leaving Bangladesh in a helicopter shortly after resigning as PM, amid massive protests against her government that has killed more than 106 people since Sunday. pic.twitter.com/s64om4nhI7
— Press Trust of India (@PTI_News) August 5, 2024
#Bangladesh 's longest serving dictator fled the country ...
— Shafquat Rabbee 🇺🇸🇧🇩 (@srabbee) August 5, 2024
People stormed her palace and this is the scene ...#Revolution #colorrevolution pic.twitter.com/CF6x4YDIX7
2018లో అమలు చేయాలని
ఉద్యోగాలు లేక అసహనంతో ఉన్న విద్యార్థులు ప్రభుత్వం తీసుకువచ్చిన రిజర్వేషన్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. 1971లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారి కుటుంబ సభ్యులకు 30 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లను తేచ్చింది. దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. అయితే 2018లోనే ఈ రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ అప్పుడు విద్యార్థులు నిరసన తెలియజేయటం వల్ల వెనక్కి తగ్గింది. కానీ, ఈ ఏడాది జూన్‌లో బంగ్లా హైకోర్టులో రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువడటం వల్ల మళ్లీ ఆందోళనలు మిన్నంటాయి. తర్వాత మధ్యలో సద్దుమణిగిన నిరసనలు ఆదివారం ఒక్కసారిగా చెలరేగాయి. ఇప్పటివరకు ఈ నిరసనల్లో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు.
VIDEO | Protesters in large numbers out in the streets of Dhaka in scenes of jubilation following the confirmation of news of Sheikh Hasina resigning as Bangladesh PM and leaving the country amid massive anti-government protests. pic.twitter.com/aYpP4upu4d
— Press Trust of India (@PTI_News) August 5, 2024
#WATCH | Bangladesh: People in Dhaka take to streets, as violence erupts in the country.
— ANI (@ANI) August 5, 2024
Bangladesh PM Sheikh Hasina has landed at Hindon Air Base in Ghaziabad, India in a C-130 transport aircraft. As per Bangladesh Army Chief, she has resigned as the PM and an Interim… pic.twitter.com/acSOsDobOr
10 బిలియన్ల డాలర్ల నష్టం
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి 6 గంటల నుంచి బంగ్లాదేశ్ హోంశాఖ నిరవధిక కర్ఫ్యూ విధించింది. అలాగే ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సేవలనూ నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 4జీ మొబైల్ ఇంటర్నెట్‌ను ఆపేయాలంటూ మొబైల్ ఆపరేటర్లను ఆదేశించారు. ప్రజా భద్రతను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సోమవారం నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కర్ప్యూను దాటుకొని మరి నిరసనకారులు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. వరుసగా అన్ని కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటం వల్ల బంగ్లా ఆర్థిక వ్యవస్థకు 10 బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.
బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస- 100మంది మృతి- 14మంది పోలీసులు కూడా - Bangladesh Violence