ETV Bharat / international

ఆర్కిటిక్‌ ఓషన్​లో నెలపాటు మంచు మాయం! మానవులే కారణం!!

Arctic Ocean Ice : 2050 కల్లా ఉత్తర ధ్రువం వద్ద ఉన్న ఆర్కిటిక్‌ మహాసముద్రంలో సంవత్సరంలో ఒక నెల పాటు తేలియాడే సముద్రపు మంచు కనిపించకపోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఫలితంగా తీర ప్రాంతాల్లో సముద్ర నీటి మట్టాలు పెరిగి జన జీవనానికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. మానవ చర్యలు, భూతాపమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

Arctic Ocean Ice
Arctic Ocean Ice
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 6:58 PM IST

Arctic Ocean Ice : అంటార్కిటిక్‌, ఆర్కిటిక్‌ మహాసముద్రాల్లో ఎటు చూసినా మంచే ఎక్కువగా దర్శనమిస్తోంది. అయితే ఆర్కిటిక్‌ మహాసముద్రంలో తేలియాడే సముద్రపు మంచు ఎంత మేర తగ్గుతుందో తెలుసుకునేందుకు కొలరాడో విశ్వవిద్యాలయ పరిశోధకులు దశాబ్దాల తరబడి చేసిన పరీక్షల నివేదికలను విశ్లేషించారు. ఈ శతాబ్దం మధ్యకల్లా ఆర్కిటిక్‌ సముద్రంలో సంవత్సరంలో ఒక నెల పాటు తేలియాడే సముద్రపు మంచు కనిపించకపోవచ్చని తెలిపారు.

జంతువుల మనుగడకు ఇబ్బందులు తప్పవ్​!
ఆర్కిటిక్‌ సముద్రంలో తేలియాడే సముద్రపు మంచు ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణం కంటే తక్కువ ఉంటే దాన్ని మంచురహితంగా పరిశోధకులు చెబుతారు. సముద్రంలో మంచు లేకపోతే మంచు ఎలుగుబంట్లు లాంటి జంతువుల మనుగడకు ఇబ్బందులు తప్పవని చెప్పారు. వేటాడడం, సంతానోత్పత్తికి అవి సముద్రపు మంచు మీదనే ఆధారపడతాయని పరిశోధకురాలు జాన్‌ తెలిపారు. అయితే గ్రీన్‌ లాండ్‌ పరిసరాల్లో నివసించే వాటికి ఇబ్బందులు ఉండవని జాన్​ చెప్పారు.

మానవ చర్యలు, భూతాపమే కారణం!
ఆర్కిటిక్‌ మహాసముద్రంలో ఈ పరిస్థితికి మానవ చర్యలు, భూతాపమే కారణమని పరిశోధకురాలు జాన్‌ తెలిపారు. తేలియాడే సముద్రపు మంచు కరిగిపోతే సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలలో నివసించే జన జీవనానికి ముప్పు తప్పదని ఆమె హెచ్చరించారు. భవిష్యత్తులో అధిక ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే ఆర్కిటిక్‌ సముద్రంలో ఎక్కువ రోజుల పాటు సముద్రపు మంచు ఉండకపోవచ్చని కూడా వివరించారు.

జులై నుంచి నవంబరు వరకు ఐస్​ ఫ్రీ!
ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల కన్నా మించితే ఈ శతాబ్దపు చివరి కల్లా ప్రతి సంవత్సరం జులై నుంచి నవంబరు వరకు ఆర్కిటిక్‌ మహా సముద్రంలో ఐస్‌ ఫ్రీ పరిస్థితులు ఉంటాయని తెలిపారు. 1979 నాటితో పోలిస్తే గతేడాది సెప్టెంబరులో ఆర్కిటిక్‌లో 2.6 మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర సముద్రపు మంచు విస్తీర్ణం తగ్గిందని నేషనల్‌ స్నో అండ్‌ ఐస్‌ డేటా సెంటర్‌ నివేదిక చెబుతోంది.

ఇంతకుముందు కూడా ఆర్కిటిక్‌ హిమఖండంలో పెరిగిన వేడిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు దశాబ్దాల్లో ఆర్కిటిక్‌ ప్రాంతంలో వేసవి రోజుల్లో సముద్ర జలాలపై మంచు కనుమరుగై పోనుందని హెచ్చరించారు. ఇప్పటికైనా మనం మేల్కొని కర్బన ఉద్గారాలను తద్వారా భూతాపాన్ని కట్టడి చేయకపోతే పరిస్థితి చేజారిపోవచ్చని కూడా తెలిపారు. ఇంకా ఏం చెప్పారో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

లైవ్​ వీడియో: చూస్తుండగానే సముద్ర గర్భంలోకి!

ఐదు కొత్త ద్వీపాలు కనుగొన్న రష్యన్​ పరిశోధకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.