World TB Day 2024 : టీబీ(క్షయ వ్యాధి) అనేది అంటువ్యాధి. ట్యుబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా వచ్చే ఈ వ్యాధి ఊపిరితిత్తుల ద్వారా శరీరంలోకి ప్రేశిస్తుంది. తర్వాత క్రమంగా శరీరంలోని అన్ని భాగాలకు చేరి ప్రాణాంతక సమస్యగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్చి 24న "ప్రపంచ టీబీ దినోత్సవం" సందర్భంగా టీబీ వ్యాధి లక్షణాలు, నివారణ వంటి విషయాలు మీ కోసం.
టీబీ అనగానే చాలా మంది ఇది కేవలం ఊపిరితిత్తుల్లో వచ్చే సమస్య అనుకుంటారు. కానీ అది మెదడు నుంచి చర్మం వరకూ శరీరంలో ఏ భాగాన్నైనా ప్రభావితం చేయచ్చని ఎంత మందికి తెలియదు.
టీబీ లక్షణాలు:
టీబీ వచ్చినవారికి విపరీతమైన దగ్గు, ఛాతిలో నొప్పి, తలనొప్పి, నీరసం, జ్వరం, అలసట, ఆకలి, బరువు తగ్గడం, చలి వేయడం, రాత్రి వేళ చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ముందుగానే గుర్తించి సరైన వైద్యం తీసుకుంటే సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది.
టీబీ ఎలా ప్రభావితం అవుతుంది
టీబీ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ఒకసారి వచ్చి తగ్గాక మళ్లీ వస్తుందా లేదా అనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఇది పూర్తిగా మనిషి రోగనిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఊపిరితిత్తుల ద్వారా ప్రవేశించే క్రిమి, శరీరమంతా వ్యాపించి ప్రమాదకరంగా మారకుండా ఉండటంలో రోగనిరోధక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది.
చాలా మందిలోకి ట్యుబర్క్యులోసిస్ క్రిమి ప్రవేశించినప్పటికీ అది పూర్తిగా వ్యాధిగా మారకుండా రోగనిరోధక శక్తి అడ్డుకుంటుంది. రోగనిరోధక శక్తి తక్కవ ఉన్న వారిలో ఈ క్రిమి ప్రభావం ఎక్కవగా ఉంటుంది. మెల్లిమెల్లిగా ఊపిరితిత్తులే కాకుండా కాలేయం, ఎముకలతో సహా శరీరంలోని ఇతర భాగాలు అన్నింటిలోకి ప్రవేశిస్తుంది. ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్న వారిలో కొన్నిసార్లు ఈ క్రిమి శరీరంలోకి ప్రవేశించినప్పటికీ, టీబీ బయటపడకుండా చేస్తుంది. అది ఒకసారైనా ఎన్నిసార్లైనా.
తగ్గాక మళ్లీ వస్తుందా
టీబీ వచ్చినవారు కొన్ని నెలల పాటు చికిత్స తీసుకున్నాక తగ్గుతుంది. అలాగని అది మళ్లీ తిరిగిరాదని అస్సలు అనుకోకూడదు. శరీరంలోకి ప్రవేశించిన ఇన్ఫెక్షన్ మళ్లీ ఎప్పుడైనా ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ బలహీన పడినప్పుడు, డయాబెటీస్, కిడ్నీ సమస్యలు వంటి దీర్థకాలిక వ్యాధుల బారిన పడినప్పుడు వాటితో పాటు టీబీ మళ్లీ తిరిగి పుంజుకునే అవకాశముంది. కొన్నిసార్లు టీబీ బ్యాక్టీరియా మళ్లీ కొత్తగా ప్రవేశించే పరిస్థితులు కూడా లేకపోలేవు. కాబట్టి ఒకసారి టీబీ వచ్చిన వారికి మళ్లీ రాదని కచ్చితంగా చెప్పలేము. మళ్లీ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఏకైక మార్గం ఏంటంటే, రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా డయాబెటీస్, రక్తపోటు లాంటి వ్యాధులు ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">