ETV Bharat / health

డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, క్వినోవా- మీ లివర్ హెల్దీగా ఉండాలంటే ఇవి తినాల్సిందే! - Best Food For Liver Health

World Liver Day 2024 : ప్రస్తుతం మనం తినే ఆహారాలన్నీ దాదాపు రసాయనాలతోనే తయారవుతున్నాయి. ఇవే కాక మనం బాగా అలవాటు పడ్డ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లాంటివి మనకు తెలియకుండానే మన కాలేయ ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తున్నాయి. సరైన ఆహారం శరీర ఎదుగుదలకు మాత్రమే కాదు కాలేయ ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది. ముఖ్యంగా మన ప్రాణాలను కాపాడేందుకు నిర్విరామంగా కష్టపడే లివర్ బాగుండాలంటే మనం తినాల్సిన ఆహారాలేంటో ఏప్రిల్ 19వ తేదీ వరల్డ్ లివర్ డే సందర్భంగా తెలుసుకుందాం.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 5:05 AM IST

Updated : Apr 19, 2024, 2:40 PM IST

World Liver Day 2024 : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా గుండె, కాలేయం, కిడ్నీ లాంటి ముఖ్యమైన అవయవాలను భద్రంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అలా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడే శరీర భాగాల్లో కాలేయం అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఇది శరీరంలోరి విషాన్ని ఫిల్టర్ చేస్తుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు లివర్ నిరంతరం కష్టపడి పనిచేస్తుంది. కాబట్టి దీన్ని అలసిపోనివ్వకుండా, పాడవకుండా కాపాడుకోవాలంటే కాలేయానికి అవసరమైన పోషకాలను అందించాల్సి ఉంటుంది. కాలేయ శ్రేయస్సుకు అవసరమైన ఆహార పదార్థాలేంటో ఏప్రిల్ 19వ తేదీ వరల్డ్ లివర్ డే సందర్భంగా మనం తెలుసుకుందాం..

పసుపు
పసుపు కర్కుమిన్ అనే పదార్థంతో నిండి ఉంటుంది. శోధ నిరోధక లక్షణాలున్న ఇది కాలేయ నిర్విషీకరణకు సహాయం చేసి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

డ్రై ఫ్రూట్స్
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే బాదం పప్పు, వాల్నట్ లాంటివి ఉత్తమ పదార్థాలుగా చెప్పవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు లివర్ ను భద్రంగా ఉంచుతాయి.

క్వినోవా
ఫ్యాటీ లివర్ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే క్వినోవా మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇది మీ రోజూవారీ ఆహారంలో చేర్చుకుంటే క్వినోవా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD)ని నివారించి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

ఆకు కూరలు
ఆకు కూరలు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖానిజాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా బచ్చలికూర, కాలే, కొల్లార్డ్ ఆకు కూరలు కాలేయ పనితీరుకు, నిర్విషీకరణకు బాగా సహాయపడతాయి. వీటితో పాటు బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రెసెల్స్ వంటివి కూడా లివర్ డీహైడ్రేట్ కాకుండా కాపాడతాయి.

గ్రీన్ టీ
గ్రీన్ టీ కేవలం చర్మ ఆరోగ్యానికి, బరువును నియంత్రించడానికి మాత్రమే కాదు, కాలేయ ఆరోగ్యానికి కూడ చాలా మేలు చేస్తుంది. దీంట్లోని కాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ కణాలు దెబ్బతినకుండా అడ్డుకుంటాయి.

లీన్ ప్రొటీన్లు
చేపలు, పౌల్ట్రీ వంటి లీన్ ప్రొటీన్లు కాలేయానికి మేలు చేస్తాయి. సోయా, చిక్కుళ్లు, బీన్స్, చిక్పీస్ వంటి మొక్కల ఆధారిత పదార్థాలు కాలేయ మరమ్మతుకు, పనితీరుకు అవసరమై, అమైనో ఆమ్లాలను అందిస్తాయి.

వీటితో పాటు క్రూసిఫెరస్ కూరగాయలు, బెర్రీలు, సిట్రస్ పండ్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలు. అవకాడో, ఆలివ్ నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన పదార్థాలు, తృణధాన్యాలు, అధిక ఫైబర్ కలిగిన బ్రౌన్ రైస్, ఓట్స్, హోల్ వీట్ బ్రెడ్, వెల్లుల్లి, కొవ్వు చేపలు, బూడిద పొట్లకాయ, ద్రాక్ష, ఓట్మీల్ వంటివి కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Last Updated : Apr 19, 2024, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.