World Idli Day 2024 : దంతాలు రాని చిన్న పిల్లల నుంచి పళ్లు ఊడిపోయిన ముసిలి వాళ్లు వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టంగా, ఈజీగా తినగలిగే ఆహార పదార్థం ఏదైనా ఉందా అంటే అది ఇడ్లీ ఒక్కటే అని కచ్చితంగా చెప్పొచ్చు. ఇడ్లీ కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, దీన్ని తినడం వల్ల అరుగుదల నుంచి బరువు తగ్గడం వరకూ చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇడ్లీలోని మరో ప్రత్యేక గుణం ఏంటంటే అది చాలా సులభంగా జీర్ణమవుతుంది. అందుకే గర్భిణులు, ఆపరేషన్ అయిన వారు కూడా ఇడ్లీ తింటే మంచిదని వెద్యులు సూచిస్తుంటారు. అలాంటి ఇడ్లీని ఎన్ని రకాలుగా చేసుకుని తినవచ్చు? వాటిని తినడం వల్ల కలిగే ఇతర లాభాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జీర్ణవ్యవస్థకు మేలు
ఇడ్లీ తినడం వల్ల కడుపు నిండినట్లుగా ఉంటుంది. ఇందులో పుష్కలంగా లభించే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.
కండరాలకు!
ఇడ్లీ పులియబెట్టిన ఆహార పదార్థం కనుక ఇందులో కండరాల పెరుగుదలకు అవసరమ్యే ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.
గుండెకు మంచిది
ఇడ్లీ తయారీలో నూనె, నెయ్యి లాంటి కొవ్వు కలిగించేవి పదార్థాలేవీ ఉండవు. ఎలాంటి మసాలాలు కూడా ఉండవు. కాబట్టి ఇవి ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు. అలాగే ఇందులోని సహజమైన కొవ్వు గుండె ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
బరువు తగ్గేందుకు!
బరువు తగ్గాలని ప్రయత్నించేవారు తమ డైట్లో కచ్చితంగా చేర్చుకోవాల్సిన ఆహార పదార్థం ఇడ్లీ. అలాగే దీంట్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎంత తిన్నా బరువు పెరగరు.
పేగులకు మంచిది
పులియబెట్టి చేసే ఆహార పదార్థాల్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావాలిసిన మినరల్స్‌తో పాటు విటమిన్లు అందుతాయి. ఇవి శరీరానికి హాని చేసే కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ప్రొటిన్లను నాశనం చేసి పేగుల ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇడ్లీ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా! ఇప్పుడు ఇడ్లీ రెసిపీలు చూసేయండి!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">