ETV Bharat / health

షుగర్​ ట్రీట్​మెంట్​లో కొత్త మార్పులు? ఏ మందులు వాడాలో తెలుసా? - WORLD DIABETES DAY 2024

-పెరుగుతున్న కొత్తరకం డయాబెటిస్ మందుల వాడకం -మారుతున్న చికిత్సపై వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా సమగ్ర కథనం

World Diabetes Day 2024
World Diabetes Day 2024 (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Nov 14, 2024, 10:58 AM IST

World Diabetes Day 2024: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో మధుమేహం ఒకటి. దీనికి చికిత్స అనగానే రక్తంలో గ్లూకోజ్‌ తగ్గించుకోవటమేనని మనం అనేక ఏళ్లుగా నమ్ముతూ వస్తున్నాం. ఇందుకోసం గ్లూకోజు స్థాయిలను ఎప్పుడూ ఒక్కలాగానే.. పరగడుపున 100 మి.గ్రా. లోపు, తిన్న తర్వాత 140 మి.గ్రా. కన్నా తక్కువగా ఉంచుకోవటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటాం. అయితే రక్తంలో గ్లూకోజు నియంత్రణ ఒక్కటే కాకుండా.. మధుమేహంతో ముడిపడిన గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ సమస్యల నివారణా ముఖ్యమేనని ప్రముఖ మధుమేహ పరిశోధకులు డా।। పి.వి.రావు చెబుతున్నారు. మనదగ్గర డయాబెటిస్ ఆలస్యంగా బయటపడుతుండటం, గుర్తించిన తొలిరోజున్నే చాలామందిలో ఏదో ఒక సమస్య ఉన్నట్టు తేలటం ఆలోచింపజేస్తున్నాయన్నారు. దీంతో పాత మధుమేహ మందులు వెనక్కి పోయి, కొత్తరకం మందుల వాడకం పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే నవంబరు 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం (వరల్డ్‌ డయాబిటిస్‌ డే) సందర్భంగా మారుతున్న మధుమేహ చికిత్సపై వివరిస్తున్నారు.

"అమెరికన్‌ డయాబిటిస్‌ అసోసియేషన్‌ చాలా ఏళ్లుగా టైప్‌ 2 డయాబెటిస్ చికిత్సా పద్ధతుల్లో మార్పులు, చేర్పులు చేస్తూ ఏటా మార్గదర్శకాలను జారీ చేస్తోంది. వీటిని అమెరికాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు ఆమోదించాయి. కానీ మనదేశంలో పాటించటానికి మాత్రం డాక్టర్లు, వైద్య సంస్థలు ఆసక్తి చూపడం లేదు. దశాబ్దాలుగా వాడుతున్న మెట్‌ఫార్మిన్, సల్ఫనైల్‌ యూరియా వంటి మాత్రలన్నింటినీ ముందు వరసల్లోంచి తప్పించటమే దీనికి ప్రధాన కారణం. కొన్నింటిని అసలు వాడకూడదనీ మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ వీటిన్నింటినీ ఉన్నట్టుండి పక్కన పెట్టేయటానికి మన డాక్టర్లు ముందుకు రావడం లేదు. కానీ ఇప్పుడీ ధోరణిని మార్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది."

డాక్టర్ పి.వి.రావు, మధుమేహ పరిశోధకులు, డయాబిటిస్‌ రిసెర్చ్‌ సెంటర్‌ పంజాగుట్ట, హైదరాబాద్‌

దుష్ప్రభావాల మీదే కన్ను
మధుమేహుల్లో గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధి, పక్షవాతం, కాలేయ క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక సమస్యల్ని ఇప్పటికీ పూర్తిగా నివారించలేకపోతున్నామని డాక్టర్ పీవీ రావు అన్నారు. వేళ్లు, పాదాల కణజాలం చచ్చుబడటం (గ్యాంగ్రీన్‌), నడి వయసులోనే మతిమరుపు, గాఢ నిద్రలో కాసేపు ఊపిరి ఆగటం, అరికాళ్లలో మంట, పాదాల్లో తిమ్మిర్లు, నొప్పుల వంటివీ చూస్తున్నామన్నారు. ఈ సమస్యలకి అధిక గ్లూకోజు కన్నా శరీర బరువు, రక్తపోటు, రక్తంలో కొవ్వు పదార్థాలు, యూరిక్‌ యాసిడ్, హోమోసిస్టిన్, వాపు ప్రక్రియ ప్రేరకాలు ముప్పుగా పరిణమిస్తున్నాయని వివరించారు. గ్లూకోజు నియంత్రణలో ఉన్నా సగానికి పైగా మంది మధుమేహంతో వచ్చే రక్తనాళాల సమస్యల బారినపడున్నారని తెలిపారు. ఇక్కడే కొత్త మందులు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయన్నారు. ఇవి మధుమేహంతో ముడిపడిన గుండెజబ్బులు, పక్షవాతం వంటి వ్యాధులు రాకుండా చూస్తాయని.. ఒకవేళ ఈ సమస్యలుంటే వాటిని ముదరకుండా కాపాడతాయని అంటున్నారు.

"ప్రపంచంలోని ఇతర దేశాల్లో 55 ఏళ్ల లోపు మధుమేహం ఉందని తెలిసినా సరే.. అధిక బరువు, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్, మూత్రంలో సుద్ద, పొగ అలవాటు లేనట్టయితే తొలి 3 నెలలు మందులు ఇవ్వరు. ఆ తర్వాత కూడా తినడానికి ముందు గ్లూకోజు 100 మి.గ్రా. కన్నా ఎక్కువగా ఉంటేనే మందులు ఇవ్వడం మొదలుపెడతారు. మనదేశంలో అలా కాకుండా.. మధుమేహం 25-35 ఏళ్లలోనే ప్రారంభమవుతుంది. చాలామందిలో డయాబెటిస్ గుర్తించటం సగటున పదేళ్ల వరకూ ఆలస్యం అవుతోంది. ఇంకా మధుమేహంతో ముడిపడిన ఇతర సమస్యలూ ముందుగానే కనిపిస్తున్నాయి. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు డయాబిటిస్‌ వచ్చిందని తెలిసిన తొలి రోజుననే సగం మందిలో ఏదో ఒక సమస్య ఉన్నట్టూ బహిర్గతమవుతుంది. మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే ఇలాంటి ధోరణిని గమనిస్తున్నాం. కాబట్టి మనం డయాబెటిస్ బారినపడ్డ నాటి నుంచే మందులు ఆరంభించటం తప్పనిసరి. ఇంకోసారి పరీక్ష చేసి చూద్దామంటూ ఆలస్యం చేయరాదు. మందులతో పాటు ఆహార వ్యాయామ నియమాలూ పాటిస్తూనే.. మందులకు ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి."

ఏ మందులు ఎలా?
మధుమేహం తొలిసారిగా బయటపడ్డాక పెద్ద రక్తనాళాలు (గుండె, మెదడు, కాళ్ళలోవి), సూక్ష్మ రక్తనాళాలు (మూత్రపిండాలు, కళ్లతో పాటు అన్ని అవయవాల్లో ఉండేవి) ఎవరిలో దెబ్బతిన్నాయి? మున్ముందు దెబ్బతినొచ్చా? అనే విషయాలను పరిశీలిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి అవకాశముంటే ముందు వరస మందులైన జీఎల్‌పీ (గ్లూకగాన్‌ లైక్‌ ప్రొటీన్‌), గ్లిఫ్లోజిన్‌ మందులను వెంటనే ఆరంభించాలని సూచిస్తున్నారు. అలాగే గ్లూకోజు, బరువు తగ్గించటానికీ మందులను నిర్ణయించాల్సి ఉంటుందని అంటున్నారు.

పెద్ద రక్తనాళాల సమస్యలకు: "మనదేశంలో అనేక మంది పెద్ద రక్త నాళాల వ్యాధులతో తీవ్ర సమస్యలు ఎదురయినప్పుడే (గుండెపోటు, పక్షవాతం వచ్చిన తర్వాత.. బైపాస్‌ ఆపరేషన్‌ లేదా స్టెంట్‌ వేయించుకోవటం, కాలి వేళ్లు గానీ పాదం గానీ తొలగించాల్సిన అవసరం వచ్చినప్పుడే) డయాబెటిస్ వ్యాధి బయటపడుతోంది. కొందరిలో అప్పుడప్పుడూ కొన్ని నిమిషాల సేపు స్పృహ తప్పటం (టీఐఏ), అలాగే కొద్ది నిమిషాలే గుండె నొప్పి వచ్చి (యాంజైనా) ఆ వెంటనే తగ్గటం వంటివీ వస్తుంటాయి. కాబట్టి మధుమేహుల్లో పెద్ద రక్తనాళాల వ్యాధులు రాకుండా ఆపటం లేదా ముదరకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి సమస్యలు గలవారికి మధుమేహాన్ని గుర్తించిన తొలి రోజు నుంచే రోజూ లేదా వారానికోసారి తీసుకునే జీఎల్‌పీ ఇంజెక్షన్లు ఇవ్వడం ప్రారంభించాలి." అని డాక్టర్ పీవీ రావు తెలిపారు.

వీటితో పాటు కొందరికి కొద్ది వారాల పాటు కడుపులో మంట, తేన్పులు, కడుపు నొప్పి, వికారం, ఉబ్బరం, అజీర్ణం, విరేచనాలు లేదా మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తొచ్చని డాక్టర్ పీవీ రావు వివరించారు. ఇవి క్రమంగా తగ్గుతాయని.. దీనికి కారణం మన ఆహార అలవాట్లేనని చెబుతున్నారు. ఈ మందులు రక్తనాళాల సమస్యల నివారణకే కాకుండా బరువు, రక్తంలో గ్లూకోజు, రక్తపోటు, కొవ్వు, వాపు ప్రక్రియ ప్రేరకాల వంటివి తగ్గటానికీ తోడ్పడతాయని అంటున్నారు. ఒకవేళ 3 నెలలు దాటినా ఇబ్బందులు భరించలేని స్థితిలో ఉన్నట్టయితే జీఎల్‌పీ రకం మందులు ఆపేసి, గ్లిఫ్లోజిన్‌ రకం మందులు ఇవ్వాలని సూచిస్తున్నారు. సూక్ష్మ రక్తనాళాల సమస్యలు తగ్గటానికి ఉపయోగపడే ఈ మందులు.. కొంతవరకూ పెద్ద రక్తనాళాల సమస్యల నివారణకూ తోడ్పడతాయన్నారు. జీఎల్‌పీ రకం మందులు వాడలేనివారికి పయోగ్లిటజోన్‌ అనే మరో రకం మందులూ ఇవ్వచ్చని.. వీటిని గ్లిఫ్లోజిన్‌తో కలిపి గానీ విడిగా గానీ వాడొచ్చని వెల్లడించారు.

సూక్ష్మ రక్తనాళాల జబ్బులకు: డయాబెటిస్ గలవారిలో గుండె కండరాల్లోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటే గుండె పంపింగ్‌ సామర్థ్యం కుంటుపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా గుండె నుంచి రక్త ప్రవాహం తగ్గిపోయి హార్ట్‌ ఫెయిల్యూర్‌గా మారొచ్చని అంటున్నారు. ఇది గుండె పోటు అనంతరం గానీ విడిగా గానీ తలెత్తొచ్చని చెబుతున్నారు. ఇదే కాకుండా మూత్రపిండాల్లోని రక్తనాళాలు దెబ్బతినటం వల్ల వడపోత సామర్థ్యం (జీఎఫ్‌ఆర్‌) నిమిషానికి 60 మి.లీ. కన్నా తక్కువకు పడిపోతుందని.. అలాగే మూత్రంలో సుద్ద 30 మి.గ్రా. కన్నా ఎక్కువగా బయటకు పోతుందని వివరించారు. ఈ ధోరణి మనలోనే ఎక్కువని.. అందువల్ల ఇలాంటి సమస్యలున్నా, త్వరలో రావచ్చని అనుమానించినా ముందుగానే గ్లిఫ్లోజిన్‌ మాత్రలు వాడడం ఆరంభించాలని సూచిస్తున్నారు. "కొందరిలో మూత్ర ఇన్‌ఫెక్షన్లు వేధిస్తాయి. రక్తంలో నీరు తగ్గి (హైపర్‌ ఆస్మలార్టీ) చిక్కగా అవ్వచ్చు. అరుదుగా ఎముకలు విరగటం, జననేంద్రియాల దగ్గర గ్యాంగ్రీన్‌ వంటి సమస్యలూ తలెత్తవచ్చు. ఇలాంటి సమస్యలను పక్కన పెడితే ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. కాబట్టే మనదేశంలో గుండె, మూత్ర పిండాల వ్యాధుల నిపుణులు ఈ మందులను ఎక్కువగా వాడుతున్నారు. ఇవి గ్లూకోజుతో పాటు బరువు తగ్గటానికీ ఉపయోగపడతాయి. ఒకవేళ వీటిని మానేయాల్సి వస్తే ప్రత్యామ్నాయంగా జీఎల్‌పీ రకం మందులు వినియోగించాలి." అని తెలిపారు.

గ్లూకోజు తగ్గటానికి: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి అన్నిటికంటే ఎక్కువ ప్రభావం చూపించేవి జీఎల్‌పీ మందులు (డ్యులాగ్లుటైడ్, సెమాగ్లుటైడ్, టిరిజెపటైడ్‌ లాంటి ఇంజక్షన్లు) అని.. వీటి తర్వాత ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు చెబుతున్నారు. ఇన్సులిన్ మందులను విడిగా లేదా జీఎల్‌పీ మందులతో కలిపి అయినా ఇవ్వచ్చని అంటున్నారు. అయితే, వీటి కన్నా కొంచెం తక్కువ ప్రభావం చూపించేవి, మనకు బాగా అలవాటైనవి, మన దేశంలో ఎక్కువగా వాడుతున్నవి గ్లిప్టిన్‌. మెట్ఫార్మిన్, గ్లిఫ్లోజిన్, సల్ఫనైల్‌ యూరియా, పయోగ్లిటజోన్‌ మాత్రలని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గటానికి: శరీర బరువు తగ్గించేందుకు ఎక్కువగా ఉపయోగపడేవి జీఎల్‌పీ మందులని చెబుతున్నారు. ఆ తర్వాత గ్లిఫ్లోజిన్‌ మందులూ కొంతవరకు మేలు చేస్తాయని వివరించారు. మనం చాలాకాలంగా వాడుతున్న గ్లిప్టిన్లు, మెట్‌ఫార్మిన్‌ మందులతో బరువు అంతగా తగ్గదదని. మందులతో పాటు ఆహార, వ్యాయామ నియమాలూ పాటించాలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

షుగర్​తో మానసిక వ్యాధులు వస్తున్నాయట! ఈ పరీక్షలూ తప్పనిసరిగా చేసుకుంటే బెటర్!

పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడుతున్నారా? జీర్ణకోశంలో ఈ సమస్యలు వస్తాయట! ఇవి పాటిస్తే అంతా సెట్!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.