ETV Bharat / health

స్వీట్​ తింటే దాహం వేస్తుందా? డీహైడ్రేట్​ అయ్యే ఛాన్స్​! ఇలా చేస్తే అంతా సెట్​ - Feel Thirsty After Eating Sweet

Why We Feel Thirsty After Eating Sweet : డీహైడ్రేషన్​ అనేది అది ప్రమాదకరమైన సమస్య. దీనికి కారణం మీరు తింటున్న తీపి పదార్థాలేనా? నిజంగానే తీపి తింటే దాహం పెరుగుతుందా? నిజమే అయితే అలా ఎందుకు జరుగుతుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Why Does Sugar Make You Thirsty
Why Does Sugar Make You Thirsty
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 2:26 PM IST

Why We Feel Thirsty After Eating Sweet : స్వీట్​ అంటే చాలామంది ఇష్టపడతారు. భోజనం చేసిన తర్వాత ఏదో ఒక తియ్యటి పదార్థాన్ని తినే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. దాంతో పాటు బాగా టెన్షన్​గా అనిపించినప్పడు, ఒత్తిడికి లోనయినప్పుడు కూడా చాలామంది స్వీట్​ను తింటుంటారు. అది ఐస్​క్రీం, చాక్లెట్,​ ఇంకేదైనా కావచ్చు. ఇలా తీపి అంటే ఇష్టం ఉన్నవారు సరదాగా బయటకు వెళ్లినప్పుడు తీపి పదార్థాలను ఎక్కువగా తినేస్తుంటారు. కానీ ఇది మీలో డీహైడ్రేషన్​ సమస్యకు దారి తీస్తుందని మీకు తెలుసా? తీపి వస్తువులు తిన్నప్పుడు విపరీతమైన దాహం కలగడం మీరు ఎప్పుడైనా గమనించారా? చక్కెర లేదా ఇతర తీపి పదార్థాలు తినడం వల్ల శరీరం ఎందుకు డీహైడ్రేట్​ అవుతుందో ఇక్కడ చూద్దాం.

తీపి తినడం వల్ల దాహం ఎందుకు పెరుగుతుంది?
షుగర్​ను అధికంగా తీసుకోవడం రక్తంలోని చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేట్​ చేసి దాహాన్ని పెంచుతుంది. శరీరంలో గ్లూకోజ్​ స్థాయులు పెరగడం వల్ల అదనపు గ్లూకోజ్​ను బయటకు పంపడానికి మూత్రపిండాలు ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది శరీరంలోని ద్రవ్య సమతుల్యతను దెబ్బతీస్తుంది. అలా కోల్పోయిన ద్రవ్యాలను శరీరం తిరిగి కోరుకోవడం వల్ల మెదడు ఎప్పుడూ నీరు తాగమని అడుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

మరి తీపి తిన్నాక ఏం చేయాలి?
తీపి తింటే గ్లూకోజ్​ లెవెల్స్​ పెరుగుతాయని, డీహైడ్రేషన్​ సమస్య వస్తుందని ఎన్ని రోజులని నోరు కట్టేసుకుంటాం. అప్పుడప్పుడు అయినా ఆశ ఆపుకోలేక తినేస్తుంటాం కదా. అలా తిన్నప్పుడు సమస్య రాకుండా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి.

రోజంతా హైడ్రేటెడ్​గా ఉంటాయి
తీపి తినడం వల్ల కలిగే దాహం నుంచి తప్పించుకోవటానికి తిన్న వెంటనే నీరు పుష్కలంగా తాగాలి. దాహం వేసే వరకూ వేచి ఉండకుండా రోజంతా నీరు తాగుతూ ఉండాలి. తీపి తిన్నప్పుడు రక్తప్రవాహంలో అసమతుల్యతను భర్తీ చేయడానికి శరీరంలో తగినంత నీరు ఉండాలి.

మితంగా తినాలి
తీపి తినడం అందరికీ ఇష్టమే కానీ అమితంగా తిని అనారోగ్యం పాలు కాకూడదు. మీకు ఇష్టమైన స్వీట్​ను తక్కువ మోతాదులో తినండి. మితంగా తింటే ఏ ఆహారం కూడా హాని కలిగించదు.

చక్కెరకు బదులుగా
తీపి తినాలనే కోరిక మీకు కలిగినప్పుడు దాని నుంచి బయట పడేందుకు నీరు, పండ్ల రసాలు, హెర్బల్​ టీలు లాంటివి తాగుతుండండి. అలాగని తీపి తిన్న తర్వాత దాహం తీరడానికి వీటిని తాగితే ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి.

షుగర్​ ఉన్నవాళ్లయితే
డయాబెటీస్​ లేదా ఇన్సులిన్​ నిరోధకత సమస్య ఉన్నవారు షుగర్​ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రించుకోవడం తప్పనిసరి. అలాంటి వారు తమ ఆహార నియమాలను తగినట్లుగా మార్చుకోవాలి. హైడ్రేషన్​ సమస్యను తగ్గించేందుకు నీరు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవడం మంచిది. దీంతో తీపి తినడం వల్ల వచ్చే డీహైడ్రేషన్​ సమస్య పెరగదు.

ఇతర ఆహారాలతో
రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణంలో ఉండేందుకు దోహదపడే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాలను తినండి. అప్పుడు తీపి తింటే కలిగే సమస్యలు తీవ్రతరం కావు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గంజిని వేస్ట్​గా పారబోస్తున్నారా? మీ జుట్టుకు ఇలా వాడి చూడండి- హెయిర్​ సేఫ్​! - Hair Growth With Rice Water

పొద్దు పొద్దున్నే రాగులను బ్రేక్‌ఫాస్ట్‌లో తిన్నారంటే - మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి! - RAGI HEALTH BENEFITS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.