ETV Bharat / health

వేకువజామునే గుండెపోటు ముప్పు- సోమవారాల్లో మరింత అధికం- కారణం ఏంటి?

Why Heart Attack Often Happens Early Morning : ఎవరికైనా, ఎప్పుడైనా గుండెపోటు రావచ్చు. అయితే గుండెపోటు వచ్చిన వారి జాబితాను గమనిస్తే చాలామందికి ఉదయం పూటే ఎక్కువగా గుండెపోటు రావడాన్ని గమనించవచ్చు. ఇంతకీ ఉదయం పూటనే ఎక్కువగా గుండెపోటు ఎందుకు వస్తుంది? గుండెపోటు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Why heart attack often happens early morning
pre heart attack symptoms
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 12:36 PM IST

Why Heart Attack Often Happens Early Morning : ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది. అందులోనూ గుండె ఆరోగ్యం ఎంతో కీలకమైంది. ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు. అయితే గుండెపోటు వస్తున్న తీరును గమనిస్తే చాలా మందిలో ఉదయం పూటనే ఎక్కువగా గుండెపోటు రావడాన్ని గమనించవచ్చు. అసలు ఉదయం పూటే ఎందుకు ఎక్కువగా గుండెపోటు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం పూటనే గుండెపోటు ఎందుకు వస్తుంది?
గుండెపోటు రావడానికి ప్రత్యేక సమయం అంటూ ఏమీ లేకపోయినా, ఎక్కువ మందికి ఉదయం పూట గుండెపోటు వస్తూ ఉంటుందని సీనియర్ కార్డియాలజిస్ట్ డా.రమేశ్ గూడపాటి తెలిపారు. మరీ ముఖ్యంగా ఉదయం 4 నుంచి 10 గంటల మధ్యలో ఎక్కువ మందికి గుండెపోటు వస్తున్నట్లు చాలా అధ్యయనాల్లో తేలిందని ఆయన చెప్పారు. 'దీనికి కారణం ఉదయం నిద్ర లేచిన తర్వాత మన శరీరం రోజువారీ కార్యక్రమాలకు సిద్ధంగా ఉండటం కోసం స్ట్రెస్ హార్మోన్లు అయిన కార్టిసాల్, కాటెకోలమైన్ ఎక్కువగా విడుదల అవుతాయి. ఈ సమయంలో హార్మోన్లు ఎక్కువగా విడుదల కావడం వల్ల రక్తం చిక్కబడటం, రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడడం లాంటవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే తెల్లవారుజామున గుండెపోటు ఎక్కువగా వస్తుంది' అని సీనియర్ కార్డియాలజిస్ట్ డా.రమేశ్ గూడపాటి వివరించారు. అలాగే పీఏ1 అనే ప్రోటీన్ శరీరంలో గడ్డకట్టుకుపోయిన రక్తాన్ని కరగనివ్వకుండా ఆపుతుందని, దీని వల్ల కూడా గుండెపోటు వస్తుందని ఆయన తెలిపారు.

సోమవారం ఎక్కువ మందికి గుండెపోటు వస్తుంది - ఎందుకు?
'చాలామంది సోమవారం రోజే గుండెపోటుకు గురవుతుంటారు. దీనికి కారణం శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో మన మెదడు విశ్రాంతి మోడ్​లో ఉంటుంది. సోమవారం పని చేసే రోజుగా ముందే మెదడు, శరీరం ఫిక్స్ అవుతాయి. అందుకే సోమవారం వర్కింగ్ డే అనే ఒత్తిడి వల్ల స్ట్రెస్ హార్మోన్లు ఎక్కువగా విడుదలై, గుండెపోటుకు కారణం అవుతాయి' అని వైద్యులు వివరిస్తున్నారు.

ఇలాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు!
తెల్లవారుజామున గుండె దడగా అనిపించడం, విపరీతంగా చెమటలు పట్టడం, ఆయాసంగా అనిపించడం, నొప్పి, అజీర్తిగా అనిపించడం లాంటి లక్షణాలు ఉంటే, వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. చాలామంది సాధారణ మంట, నొప్పిగా భావించి నిర్లక్ష్యం వహిస్తుంటారని, దీని వల్ల ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే పై లక్షణాలు ఏమి కనిపించినా, వెంటనే వైద్య సాయం పొందాలని సూచిస్తున్నారు.

గుండెపోటు - నివారణా మార్గాలు
మన జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా చాలా వరకు గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా నివారించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయడం, వారంలో ఐదు రోజులకు తగ్గకుండా వ్యాయామం చేయడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. నూనె పదార్థాలు తగ్గించడం, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లను మానుకోవడం, ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే క్రమం తప్పకుండా చెకప్​‎లు చేయించుకోవడం ద్వారా గుండెపోటు సమస్యలను తగ్గించవచ్చని అంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గర్భంతో ఉన్నప్పుడు సెక్స్​ చేయవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారు?

ఇలా చేస్తే మీకూ మూత్రం లీక్‌ అవుతుంది - ఇలా చెక్ పెట్టండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.