Ultra Processed Food Effects : ఆరోగ్యంగా ఉండటానికి రోజూ సమతుల ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యల బారినా పడకుండా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ.. ఇటీవల కాలంలో చాలా మంది జనాలు రుచి పేరుతో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నారు. వీటివల్ల దీర్ఘాకాలికంగా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి అస్సలే తినకూడని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏంటో మీకు తెలుసా?
బ్రెడ్ :
మనలో చాలా మంది బ్రెడ్‌ను ఇష్టంగా తింటారు. అయితే, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఒకటైన బ్రెడ్‌ను తినడం వల్ల శరీరానికి ఎక్కువగా పోషకాలు అందవు. వీటిని తయారు చేయడానికి రిఫైండ్ ఫ్లోర్, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, చక్కెర, హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ వంటి వాటిని ఉపయోగిస్తారు. అలాగే రంగు, రుచిని పెంచడానికి కృత్రిమ రంగులు, ఎమల్సిఫైయర్లు వాడతారు. అందుకే వీటిని తినడం వల్ల బరువు పెరగడంతో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయట.
చాక్లెట్ బిస్కెట్లు :
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా చాక్లెట్ బిస్కెట్లను తింటారు. అయితే.. వీటిని తయారు చేయడానికి రిఫైన్డ్ ఫ్లోర్, చక్కెర, కోకో పౌడర్, ఉప్పు వంటి వివిధ పదార్థాలు వాడతారు. వీటిని రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇంకా చాక్లెట్ బిస్కెట్లను తినడం వల్ల దంత క్షయం వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఫ్రెంచ్ ఫ్రైస్ :
చాలా మందికి ఇష్టమైన ఫాస్ట్‌ఫుడ్ ఐటమ్‌లలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి. అయితే.. ఇందులో ట్రాన్స్ ఫ్యాట్స్, ఉప్పు అధికంగా ఉంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, స్థూలకాయం వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుందట.
గబగబా తినేస్తున్నారా? ఎసిడిటీ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్త! - eating fast problems
ఐస్ క్రీమ్ :
ఐస్ క్రీమ్ తయారీలో చక్కెర, కొవ్వు పదార్థాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే.. వీటిని రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అందుకే ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు వీటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఐస్‌క్రీమ్ ఎక్కువగా తిన్నవారిలో గుండె జబ్బులు, స్ట్రోక్, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు వచ్చినట్లు గుర్తించారు.
ఇన్‌స్టంట్ నూడుల్స్ :
ఇన్‌స్టంట్ నూడుల్స్ ప్యాకెట్ తెరిచి కొన్ని వేడి నీళ్లు పోస్తే సరిపోతుంది. క్షణాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా నూడుల్స్ తినొచ్చు. దీంతో జనాలు సూపర్ మార్కెట్లు, షాపూల్లో దొరికే ఈ నూడుల్స్ ప్యాకెట్లను కొంటున్నారు. అయితే, వీటిని తయారు చేయడానికి మైదా, ఉప్పు, టేస్ట్ మేకర్లు వంటి వివిధ రకాల పదార్థాలను ఉపయోగిస్తారు. ఈ నూడుల్స్ ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, అధిక బరువు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులంటున్నారు.
పరిశోధన వివరాలు :
2018లో ప్రచురించిన 'బ్రిటీష్ మెడికల్ జర్నల్' (BMJ) అధ్యయనం ప్రకారం.. వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఇన్‌స్టంట్ నూడుల్స్ తినే వారిలో హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారట. ఈ పరిశోధనలో చైనా బీజింగ్ నగరంలోని 'చైనా-జపాన్ ఫ్రెండ్‌షిప్ హాస్పిటల్‌లో' కార్డియాలజీ చీఫ్ ఫిజీషియన్ గా పని చేసే డాక్టర్ వాంగ్ పాల్గొన్నారు. ఇన్‌స్టంట్ నూడుల్స్ ఎక్కువగా తినేవారిలో హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 28 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ 4 అలవాట్లతో - షుగర్ ఉన్నవారి లైఫే డేంజర్‌లో పడిపోతుంది! - Precautions For Diabetes