What Will Happen If I Stop Eating Onions : ప్రపంచంలోని చాలా రకాల వంటల్లో ఉల్లిపాయలు ముఖ్యమైన పదార్థంగా నిలుస్తాయి. వివిధ పోషక విలువలతో పాటు ప్రత్యేకమైన రుచిని కలిగిన ఉల్లిపాయలు మీ వంటలకు స్పెషల్ టేస్టును అందిస్తాయి. ప్రతి రోజు మనం వండుకునే రకరకాల కూరల నుంచి బిర్యానీ, స్నాక్స్ వంటి ఆహార పదార్థాల వరకు ఉల్లిపాయలు లేనిదే రుచి రాదనడంలో అతిశయోక్తి లేదు. కాకపోతే ఉల్లిపాయతో వచ్చిన చిక్కేంటంటే, ఇది తిన్న తర్వాత నోటి నుంచి వచ్చే వాసన చాలా చికాకుగా ఉంటుంది. ఈ ఒక్క కారణంతోనే ఎక్కువ మంది ఉల్లిపాయకు దూరంగా ఉంటారు. అయితే ఓ నెల పాటు ఉల్లిపాయలు తినడం మానేస్తే ఏం జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆనియన్స్కు దూరంగా ఉంటే శరీరానికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయలకు నెల రోజుల పాటు పూర్తిగా దూరంగా ఉండటం వల్ల మలబద్ధకం నుంచి కంటి చూపు వరకు చాలా రకాల సమస్యలు వస్తాయంటే మీరు నమ్ముతారా? సీనియర్ డైటీషియన్లు, నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం ఉల్లిపాయల్లో విటమిన్లు, మినరల్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో లభించే విటమిన్-సీ, విటమిన్-బీ6, ఫోలేట్లు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు, కణాల ఎదుగులకు, ఆరోగ్యకరమైన జీవక్రియకు సహాయపడతాయి. ఉల్లిపాయల్లో అలిసిన్, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు, యాంటీ ఆక్సిండెంట్లు, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా మెండుగా లభిస్తాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
నెల రోజులు ఉల్లిపాయలకు దూరంగా ఉంటే ఏం జరుగుతుంది?
ఒక నెల రోజుల పాటు ఉల్లిపాయలు తినడం మానేస్తే శరీరంలో పెద్దగా మార్పులు రాకపోవచ్చు. కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు కచ్చితంగా జరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఉల్లిలో ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు అవసరమైన డైటరీ ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం వల్ల మలబద్ధకంతో పాటు జీర్ణసమస్యలు తలెత్తుతాయి.
అంతేకాదు, ఉల్లిపాయలను తినకపోవడం వల్ల రోగనిరోధక వ్యవస్ధను బలహీనపరిచే మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్-సీ, విటమిన్-బీ6, ఫోలేట్ లోపాలు వస్తాయి. ఫలితంగా శరీరంలో అలసట పెరుగుతుంది, ఎర్రరక్త కణాలు ఏర్పడతాయి, రక్తం గడ్డ కట్టడం లాంటి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. కాబట్టి ఉల్లిపాయలు తినడం పూర్తిగా మానేయకుండా మితంగా తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.