What To Eat In Night Shift : ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో నైట్ షిఫ్ట్ లు అనేవి సాధారణం. మల్టీ నేషనల్ కంపెనీలు, కాల్ సెంటర్లు, మీడియా హౌస్‌లు తదితర 24 గంటల అందుబాటులో ఉండే ఏ రంగంలోనైనా ఇవి మామూలే. అయితే చాలా మంది ఉద్యోగులు రాత్రివేళ పని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పడుకునే సమయంలో పని చేయాల్సి రావడం వల్ల మన శరీరం సైతం దానికి సహకరించదు. అయితే నైట్ షిఫ్ట్‌లో కొన్ని పదార్థాలు తినటం వల్ల నిద్ర, అలసట లేకుండా పని చేయవచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం.
నైట్ షిప్ట్‌ల సమయంలో వాల్ నట్స్, ఆల్మండ్స్, బాదం లాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. వీటితో పాటు మొలకెత్తిన విత్తనాలు తీసుకోవటం మంచిది. వీటిలో ఉండే ప్రోటీన్లు, ఫైబర్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. దానితో పాటు శరీరానికి అలసట రాకుండా చేస్తాయి. తద్వారా పనిపై ఏకాగ్రత పెరుగుతుంది.
కీరా, క్యారెట్స్
వేసవి కాలం సమీపిస్తున్నందున కీరా, క్యారెట్లు తినటం శరీరానికి చాలా మంచిది. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటంతో పాటు కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. అందుకే విరామ సమయాల్లో వీటిని తీసుకోవటం వల్ల అలసట తగ్గటం సహా రీఫ్రెష్ అయిన భావన కలుగుతుంది.
కోడిగుడ్లు
కోడిగుడ్లలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వాటితో పాటు విటమిన్ బీ12 , ఎమినో ఆమ్లాలతో పాటు సహా పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రాత్రివేళ పని సమయాల్లో మీకు అలసట రాకుండా,శక్తివంతంగా ఉండాలంటే ఎగ్స్ అనేవి మంచి ఆఫ్షన్
ఎనర్జీ బార్
ఎనర్జీ బార్లు ప్రోటీన్లు విటమిన్లు, కార్బోహైడ్రేట్ల కలయికతో తయారుచేసేవి. కనుక వీటిని తీసుకోవటం వల్ల శరీరానికి త్వరగా శక్తి లభిస్తుంది. అంతే కాకుండా ఇవి రుచిగా కూడా ఉంచాయి.
డార్క్ చాక్లెట్స్
డార్క్ చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్లతో పాటు కొంత మోతాదులో కెఫిన్ ఉంటుంది. వీటిని తినటం వల్ల మనసుకు ప్రశాంతత లభించటం లభిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా నిద్ర వచ్చినప్పుడు వీటిని తింటే నిద్ర తేలిపోతుంది. మీరు కోకో కంటెంట్ అధికంగా ఉన్న డార్క్ చాక్లెట్లను ఎంచుకోవటం మంచిది.
సాధారణంగా నైట్ షిప్ట్‌లలో శరీరం కొంత అలసట ఉంటుంది. కనుక రాత్రి వేళ పని సమయాల్లో ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవటం అవసరం. అంతే కాకుండా సరైన సమయంలో మంచి ఆహారం తీసుకోవటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. దీంతో పాటు ఏకాగ్రతతో విధులు నిర్వహించవచ్చు.
మీ కోసం వ్యాయామమే దిగి వచ్చింది - జస్ట్ 22 నిమిషాలు చేసినా చాలట!