ETV Bharat / health

మీ శరీరంపై ఈ బొడిపెలు ఉన్నాయా? - ఏం జరుగుతుందో తెలుసుకోండి! - Skin Tags Causes and Treatment - SKIN TAGS CAUSES AND TREATMENT

Skin Tags: కొందరికి శరీరంపై అక్కడక్కడా చిన్న చిన్న బొడిపెలు వస్తుంటాయి. చూస్తే చర్మం ముడిపడి సంచుల్లా మారినట్లు కనిపిస్తుంటాయి. ఇవి స్కిన్​ కలర్​లో లేదా కాస్తా ముదురు రంగులో ఉంటాయి. ఇలా శరీరంపై కనిపించేవి ఏమిటివి? ఎందుకొస్తాయి? నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అనేది ఇప్పుడు చూద్దాం..

SKIN TAGS CAUSES
SKIN TAGS CAUSES AND TREATMENT (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 1:23 PM IST

Skin Tags Causes : శరరీంపై కనిపించే బొడిపెలను స్కిన్‌ ట్యాగ్స్, ఫైబ్రోఎపిటిల్లల్‌ పాలిప్స్‌ అని అంటారు. ఇవి స్త్రీలు, పురుషులు ఇద్దరినీ ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి ఆరోగ్యపరంగా ఎలాంటి హాని కలిగించనప్పటికీ, బ్యూటీ పరంగా ఇబ్బంది ఉండవచ్చని సౌందర్య నిపుణురాలు డాక్టర్​ శైలజ సూరపనేని చెబుతున్నారు.

స్కిన్ ట్యాగ్‌లు చర్మంపై హానిచేయని కణితులని చెప్పవచ్చని ఆమె అంటున్నారు. ఇవి నరాల కణాలు, కొవ్వు కణాలు లేదా ఫైబర్‌లను కలిగి ఉండే కణితులని చెబుతున్నారు. ఇవి క్యాన్సర్ కాదని స్పష్టం చేస్తున్నారు. ఇవి ఎక్కువగా.. కనురెప్పలు, ఛాతీ, చంకలు, రొమ్ము ప్రాంతం, మెడ లేదా గజ్జలు వంటి ప్రదేశాల్లో పెరుగుతాయని అంటున్నారు.

ఎప్పుడు వస్తాయి, ఎవరికి వస్తాయి: చర్మం పైపొర మీద కణాలు పెరిగినప్పుడు ఇవి ఏర్పడతాయని డాక్టర్​ శైలజ సూరపనేని అంటున్నారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని కణాలు చర్మం పైపొర మీద పెరిగినప్పుడు స్కిన్ ట్యాగ్‌లు ఏర్పడతాయని అంటున్నారు. వైద్యులు దీన్ని చాలా సాధారణ పరిస్థితిగా గుర్తిస్తారని చెప్పారు. ఇక ఇవి అధిక బరువు లేదా చర్మం మడతలు ఉన్నవారిలో ఎక్కువగా ఉంటాయని ఆమె తెలిపారు. అలాగే ప్రెగ్నెన్సీలో హార్మోనుల్లో హెచ్చుతగ్గుల కారణంగా కూడా ఇవి రావడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని పలు పరిశోధనలు కూడా స్పష్టం చేశాయి. అవి సాధారణంగా నొప్పిలేకుండా ఉంటాయని.. ఒకవేళ అవి ఉన్న ప్రదేశంలో దుస్తులు వేసుకుంటే కాస్త దురద చికాకు కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు.

అలర్ట్ : పెద్దవాళ్ల సబ్బులు పిల్లలకు ఉపయోగిస్తున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా? - Health Benefits of Baby Soaps

  • 2002లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. గర్భం ధరించని వారి కంటే గర్భవతుల్లో స్కిన్ ట్యాగ్స్ రెండు రెట్లు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. వీటి పెరుగుదలకు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు ఎక్కువగా కారణమని కనుగొన్నారు.
  • 2016లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఊబకాయంతో ఉన్న వ్యక్తులకు స్కిన్ ట్యాగ్స్ ఉండే అవకాశం బరువు లేని వ్యక్తుల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందని కనుగొన్నారు.

వాటిని ఎలా తొలగించుకోవచ్చంటే: కొన్ని నార్మల్​గానే తొలగిపోతాయని డాక్టర్​ శైలజ అంటున్నారు. అయితే వీటికి ఏ క్రీములూ పనిచేయవని.. సొంత వైద్యాలు చేసినా పనిచేయవని.. పైగా ఇన్‌ఫెక్షన్‌కి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. స్కిన్​ ట్యాగ్స్​ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే వైద్యులను సంప్రదించమని సలహా ఇస్తున్నారు. వారు లోకల్‌ అనస్థీషియా ఇచ్చి, రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా తొలగిస్తారని చెబుతున్నారు. వారం రోజులు ఎండలోకి వెళ్లకుండా ఉంటే చాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా క్రయోథెరపీ, ఎండియాక్‌ లేజర్‌ ద్వారానూ తొలగించవచ్చని సూచిస్తున్నారు. అయితే ఇవి ఉన్నా ప్రమాదం ఏమీ ఉండదని.. ఒకరి నుంచి మరొకరికీ సంక్రమించవని.. చూడటానికి బాగా లేవని చికిత్స చేయించుకున్నా ఎలాంటి కాంపిక్లేషన్సూ ఉండవని అంటున్నారు.

డైలీ ఈ ఫేస్‌ప్యాక్‌లు ట్రై చేశారంటే- మేకప్‌ లేకుండానే మెరిసిపోవచ్చు! - natural face mask for glowing skin

ముఖం తళతళ మెరిసిపోవాలా? కరివేపాకుతో ఈ ఫేస్​ప్యాక్​లు ట్రై చేయండి! - Curry Leaves Benefits

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.