Side Effects of Wearing Shoes: ప్రస్తుతం అడుగు బయట పెట్టాలంటే కచ్చితంగా కాలికి చెప్పులు ఉండాల్సిందే! కేవలం బయట మాత్రమే కాకుండా ఇంట్లో కూడా చాలా మంది చెప్పులు యూజ్ చేస్తుంటారు. పాదాలకు రక్షణ కల్పించడం, స్టైల్‌గా కనిపించడం సహా..చెప్పులు ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రయోజనాలు ఉన్నాయని.. అదేపనిగా వాడితే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కీళ్ల నొప్పులు: స్టైలిష్‌గా ఉండేందుకు షూలు లేదా స్లిప్పర్లు రోజంతా వేసుకోవడం వల్ల తక్కువ వయసులోనే కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎత్తు ఎక్కువగా ఉండే హీల్డ్ సాండిల్స్ ధరించడం వల్ల కూడా కీళ్ల నొప్పులు వస్తాయని వివరించారు. అందుకే ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ముందుగానే హై హీల్ సాండిల్స్ వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే కాకుండా తక్కువ నాణ్యత ఉన్న షూలు, స్లిప్పర్లు వేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా ఆర్థరైటిస్ (రిపోర్ట్) వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. ఇలా కాకూడదని అనుకుంటే వీటి వాడకాన్ని తగ్గించాలని చెబుతున్నారు.
ఎముకల్లో సమస్యలు: రోజు మొత్తం షూలు వేసుకోవడం వల్ల బొటనవేలి గోరుతో పాటు ఎముక కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా బొటనవేలి ఎముక వంకరగా మారి.. అనేక సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. దీంతో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇందువల్ల పాదాల నొప్పులతో పాటు పాదాల ఆకృతి మారి Hammer Toe లాంటి వ్యాధులు వస్తాయని 2018లో చేసిన Journal of Foot and Ankle Research అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధనలో డాక్టర్లు హిల్ ఎస్, ధామస్ జే, టక్కర్ ఆర్, బెన్నెల్ కే పాల్గొన్నారు.
ఇన్ఫెక్షన్లు: ముఖ్యంగా రోజంతా పాదాలను గాలి ఆడకుండా షూలో పెట్టడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు. పాదాలకు సహజమైన గాలి, వెలుతురు పడకుండా ఉండడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని వివరించారు. అయితే, ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎలాంటి పాదరక్షలు లేకుండా ప్రతిరోజూ గడ్డిపై నడవాలని సూచించారు. లేదా ఏదైనా మైదాన ప్రాంతంలోనైనా కాసేపు నడవాలని చెప్పారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : వీళ్లకు సొరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువ - కారణాలు ఇవే! - Psoriasis Symptoms and Treatment