What Happens When You Take No Sugar : ప్రస్తుతం చాలా మంది మధుమేహం, అధిక బరువు వంటి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, ఇలాంటి పరిస్థితులు రావడానికి మన ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి, జన్యువులే కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకే మంచి ఆహారాన్ని తీసుకుంటూ.. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మరి.. కొన్నిరోజుల పాటు మనం షుగర్ పదార్థాలకు దూరంగా ఉంటే మన శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కెర స్థాయిలు అదుపులో..
షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. అయితే.. మనం వీటికి దూరంగా ఉండటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల చిరాకు, అలసట వంటివి కలుగుతాయి. చక్కెర తీసుకోవడం పూర్తిగా మానేస్తే మానసిక ఒడిదుడుకులూ దూరమవుతాయట.
బరువు అదుపులో..
షుగర్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో క్యాలరీలు మన శరీరంలో చేరతాయి. దీనివల్ల మనం బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చక్కెరకు దూరంగా ఉండటం వల్ల క్యాలరీలు మన శరీరానికి అందవు. దీంతో బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది..
చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌తో పాటు మరి కొన్ని క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందట. షుగర్‌కు చెక్ పెట్టడం వల్ల ఈ ప్రమాదాలను నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయని అంటున్నారు.
స్వీట్స్ వదిలించుకోలేకపోతున్నారా? - అయితే ఇలా ట్రై చేయండి!
చర్మం ఆరోగ్యంగా..
షుగర్ ఫుడ్స్‌కు దూరంగా ఉండటం వల్ల మొటిమల సమస్యలు తగ్గుతాయట. అలాగే.. చర్మం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా వృద్ధాప్య సమస్యలు అంత తొందరగా దరిచేరవని తెలియజేస్తున్నారు. చక్కెర తీసుకోకపోవడం వల్ల వాపు సమస్యలు తగ్గుతాయట.
నిద్రలేమి సమస్య దూరం..
షుగర్ ఐటమ్స్ తినకపోవడం వల్ల నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయట. చక్కెరకు దూరంగా ఉండటం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది..
చక్కెరలేని పదార్థాలను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆహారం సులభంగా జీర్ణమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి..
రోజూ చక్కెరకు దూరంగా ఉండటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు మన దగ్గరకు రాకుండా ఉంటాయట.
గమనిక : ఒక్కసారిగా చక్కెర పదార్థాలు తినకుండా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. మీకు ఏవైనా అనారోగ్య సమస్యలున్నా.. చక్కెర దూరం పెట్టాలని అనుకుంటున్నా.. డాక్టర్లను సంప్రదించి వారి సలహాలను పాటించండి.
చక్కెర తింటే డేంజర్ - బదులుగా ఇవి తినండి!
టైప్-2 షుగర్ బాధితులా? ఆ ఫుడ్‌కు దూరంగా ఉండండి- డైట్లో ఇవి తీసుకుంటే బెటర్!