What Happens When You Stop Alcohol : సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి ఎప్పుడో ఒకసారి తాగడంతో మొదలయ్యే మద్యపానం.. క్రమంగా బానిసలుగా మార్చేస్తుంది. చాలా మంది ఈ ఊబిలో నుంచి బయట పడలేరు. కొందరు మాత్రం ఆల్కాహాల్ తాగడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుని.. బంద్ చేయాలని డిసైడ్ అవుతారు. అయితే.. చాలా కాలంపాటు తాగి, ఒక్కసారిగా మందు తాగడం మానేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొద్దిగా తాగినా ప్రమాదమే!
మందు కొద్దిగా తాగినా లేదా ఎక్కువగా తీసుకున్నా కూడా మన ఆరోగ్యం పాడవుతుంది. దీర్ఘకాలింగా మద్యం ఎక్కువగా తాగడం వల్ల మెదడు, గుండె, కాలేయం వంటి వివిధ అవయవాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. మందు తాగిన తర్వాత అది పొట్టలోని చిన్న పేగులోకి వెళ్తుంది. అక్కడ అల్డిహైడ్స్ అనే కెమికల్‌గా విడిపోతుంది. అక్కడ నుంచి పేగుల్లోని రక్తం ద్వారా కాలేయం వంటి ఇతర శరీర భాగాలకు చేరుతుంది. లివర్ మనం తిన్న ఫుడ్‌లో పోషకాలను వేరు చేసి రక్తంలో కలిపి, ఆ రక్తాన్ని శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. అయితే అల్డిహైడ్ అనే రసాయనాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి రక్తం ద్వారా కాలేయానికి చేరుకుని లివర్ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.
ఒక్కసారిగా మానేస్తే 'తలనొప్పి' తప్పదు!
మద్యం తాగడం వల్ల మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే, ఒక్కసారిగా మందు మానేయడం వల్ల కొందరిలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనిని 'విత్‌డ్రాయల్ సిండ్రోమ్' అని అంటారు. ఒక్కసారిగా మందు తాగడం మానేయడం వల్ల కొంతమందిలో టెన్షన్, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2018లో "అడిక్షన్" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. మద్యం తాగడం మానేసిన చాలామందిలో తలనొప్పి లక్షణాలు కనిపించాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాకు చెందిన డాక్టర్ జాన్ డో పాల్గొన్నారు. ఒక్కసారిగా మందు తాగడం మానేస్తే తలనొప్పి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్‌ను సంప్రదించండి!
ఎక్కువ రోజుల నుంచి మందు తాగేవారు.. ఒక్కసారిగా మానేయడం వల్ల కొన్ని మానసిక సమస్యలు వస్తాయి. చెవుల్లో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తుంటాయి. అలాగే ఎవరో తమను పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. దీనినే 'ఆల్కాహాల్ ప్రేరిపిత భ్రాంతి' అని అంటారు. కొన్ని సంవత్సరాల నుంచి రోజూ మందు తాగేవారు ఒక్కసారిగా ఆల్కాహాల్ తీసుకోకపోవడం వల్ల 3 రోజుల్లో ఈ మానసిక సమస్యలతో బాధపడతారని నిపుణులు చెబుతున్నారు. కొందరు అయోమయం, కోపానికి గురవుతారని అంటున్నారు. కాబట్టి.. మందు మానేయాలనుకునే వారు ముందుగా డాక్టర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కుక్క కరిస్తే శరీరంలో ఏం జరుగుతుంది? - రేబిస్ రాకుండా ఏం చేయాలి?? - How To Stop Rabies
వాటర్ బాటిళ్ల మూతలు రకరకాల రంగుల్లో! - అవి నీటి క్వాలిటీకి గుర్తులా? - Water Bottle Caps Colour