ETV Bharat / health

వరుసగా 3రోజులు తినకపోతే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? - What Happens If You Dont Eat

What Happens If You Dont Eat For 3 Days : ఉపవాసం ఆరోగ్యానికి మంచిదే. కానీ బరువు తగ్గాలనే కారణంతో ఎక్కువ కాలం ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది? మూడు రోజుల పాటు ఏమీ తినకుండా ఉంటే శరీరంలో జరిగే మార్పులు ఏంటి?

Can a human survive 3 days without food?
What Happens If You don't Eat For 3 Days (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 3:24 PM IST

What Happens If You Dont Eat For 3 Days : ఉపవాసం అనేది భారతీయులు ఎప్పటినుంచో పాటిస్తున్న పద్ధతి. దైవ భక్తితో కొందరు, ఆరోగ్యంగా ఉండాలని ఇంకొందరు పురాతన కాలం నుంచి పాటిస్తున్న ఆహార నియమమే ఉపవాసం. నిజానికి ఉపవాసం ఆరోగ్యకరమైనదే. కానీ ఈ మధ్య బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువ కాలం ఉపవాసం ఉంటున్నారు. దీన్నే 'కీటో డైట్' ప్లాన్ అని పిలుస్తారు. సాధారణంగా ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అప్పుడు శరీరంలో కార్బోహైడ్రేట్లకు బదులుగా శక్తి కోసం నిల్వ చేసుకున్న కొవ్వును కాల్చేస్తుంది. ఫలితంగా జీవక్రియ మెరుగువుతుంది. కానీ ఎక్కువ కాలం ఉపవాసం ఉంటే శరీరానికి ఏం జరుగుతుంది? కిటోసిస్ కారణంగా అంటే మూడు రోజుల పాటు ఏమీ తినకపోతే శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఎటువంటి నష్టం వాటిల్లుతుంది? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.

ఎటువంటి ఆహారం తీసుకోకుండా తన కీలకమైన విధులను నిర్వర్తించే ప్రయత్నంలో శరీరం కీలక మార్పులకు గురవుతుంది. డాక్టర్ పల్లేటి శివ కార్తీక్ రెడ్డి, ఎంబీబీఎస్​, ఎండీ జనరల్ మెడిసిన్, కన్సల్టెంట్ ఫిజీషియన్ అభిప్రాయం ప్రకారం, మూడు రోజు పాటు ఏమీ తినకుండా ఉంటే, మొదట్లో మీ శరీరం శక్తి కోసం నిల్వ చేసుకున్న గ్లూకోజ్​ను ఉపయోగిస్తుంది. ఇలా మొదటి 24 గంటల్లో ఈ గ్లైకెజెన్ క్లీనించి, శరీరం గ్లూకోనోజెనిసిస్​ను ప్రారంభిస్తుంది. అంటే అమైనో ఆమ్లాల వంటి కార్బోహైడ్రేట్ కాని మూలాల నుంచి గ్లూకోజ్​ను సృష్టిస్తుంది.

రెండో రోజు శరీరం కీటోసిస్​ను ప్రారంభిస్తుంది. మెదడుకు శక్తిని అందించేందుకు నిల్వ చేసుకున్న కొవ్వులను కీటోన్ విడిగొట్టడం మొదలు పెడుతుంది. ఇది జీవక్రియ కండరాల కణజాలాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది. కండరాలు ప్రొటీన్ విచ్ఛిన్నంపై ఆధారపడకుండా కాస్త శక్తిని అందిస్తుంది.

మూడవ రోజు ఎలివేటెడ్ నోర్‌పైన్‌ఫ్రైన్ కారణంగా జీవక్రియ తాత్కాలికంగా పెరుగుతుంది. అయితే ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం విధి నిర్వహణ సర్దుబాటు చేయడంతో శక్తిని కోల్పోతుంది. ఇలా ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడం, నోర్‌పైన్‌ఫ్రైన్ స్థాయిలను పెంచడం ద్వారా శరీరంలోని కొవ్వును కరిగించి జీవక్రియకు అనుకూలిస్తుంది. మూత్రపిండాల్లోని అదనపు ఉప్పును, నీటిని బయటకు పంపుతుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది. ముఖ్యంగా కొవ్వు నిల్వల నుంచి కండరాల ద్రవ్యరాశిని కాపాడుతుంది. అయితే ఇలా మూడు రోజుల పాటు అంటే 72 గంటలు ఏమి తినకపోతే శరీరానికి లాభాలతో పాటు, కొన్ని నష్టాలు కూడా జరిగే ప్రమాదముంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

లాభాలు:

1. ఆటోఫాగి : ఇది సెల్యూలర్ క్లీనప్ ప్రాసెస్. శరీరంలోని దెబ్బతిన్న కణాలను తొలగించి కొత్త, ఆరోగ్యకరమైన కణాల ఉత్పత్తిని పెంచుతుంది.

2. ఇన్సులిన్ సెన్సిటివిటీ : ఉపవాసం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఫలితంగా టైప్-2 డయాబెటీస్ ప్రమాదం తగ్గుతుంది.

3. మానసిక స్పష్టత : కీటోసిస్ సమయంలో మెదడు-ఉత్పన్నమైన న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ (BDNF) ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల మానసిక స్పష్టత, ఫోకస్ పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

4. బరువు తగ్గడం : బరువు తగ్గాలనుకునే వారికి ఉపవాసం చక్కగా సహాయపడుతుంది. ప్రధానంగా కొవ్వు నిల్వల నుంచి కండర ద్రవ్యరాశిని కాపాడుతుంది.

నష్టాలు:

1. నిర్జలీకరణం : ఆహారం, నీరు తీసుకోకుండా ఉండటం వల్ల శరీరం పూర్తిగా నిర్జలీకరణంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఉపవాసం ఉంటున్న సమయంలో నీరు పుష్కలంగా తాగాలి.

2. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత : ఎక్కువ కాలం ఉపవాస ఉండటం వల్ల సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి అవసరమైన ప్రొటీన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది.

3. హైపోగ్లైసీమియా : మూడు రోజుల పాటు ఏమీ తినకపోతే హైపోగ్లైసీమియా బారిన పడే ప్రమాదముంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతే మైకం, తలనొప్పి, మూర్ఛ వంటి సమస్యలు వస్తాయి.

4. నిద్ర సమస్యలు : ఉపవాసం కారణంగా ఆకలి బాధతో పాటు నిద్ర సమస్యలు కూడా వస్తాయి. ఫలితంగా అలసట, చిరాకు కలుగుతాయి.

బట్టతల వచ్చాక బాధపడే కంటే - ముందు నుంచే ఈ టిప్స్ పాటించండి - మీ జుట్టు అస్సలు ఊడదు! - How To Prevent Premature Baldness

అలర్ట్ : తిన్న తర్వాత ఈ 5 పనులు అస్సలు చేయొద్దు - ఆరోగ్యానికి ముప్పు తప్పదు! - Dont Do These Things After Meals

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.