what are the side effects of lipstick : అందం కోసం ఆడవాళ్లు ఎంతగా తాపత్రయపడతారో తెలిసిందే. ఇందుకోసం ఏవేవో చేస్తుంటారు. కొందరు నేచురల్ పద్ధతులను ఎంచుకుంటే.. మెజారిటీ జనం మాత్రం మేకప్ ప్రొడక్ట్స్‌ను నమ్ముకుంటారు. అయితే.. రోజూ మేకప్ వేసుకునే వారైనా, టచప్ ఇచ్చుకునే వారైనా.. లిప్ స్టిక్ తప్పక వేసుకుంటారు. అది వేసుకుంటేనే.. అందానికి మెరుగులు దిద్దడం కంప్లీట్ అయినట్టు. మేకప్‌లో లిప్‌స్టిక్ రేంజ్ అది. కానీ.. దీనివల్ల ఆరోగ్యానికి ముప్పు కూడా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. లిప్‌స్టిక్ రాసుకునే మహిళలు సగటున రోజుకు రెండు నుండి 14 సార్లు అప్లై చేసుకుంటారట. ఇక రోజుకు 24 సార్లకన్నా ఎక్కువగా లిప్ స్టిక్ రాసుకునే వారు కూడా ఎక్కువగానే ఉన్నారట. మరి.. ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే.. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హానికర పదార్థాలు..
లిప్‌స్టిక్‌లో పలు హానికారక లోహాలు, రసాయనాలు, పారాబెన్‌లు అధికంగా ఉంటాయట. ఇలాంటి లిప్ స్టిక్‌ను పెదాలపై అప్లై చేసుకున్న మహిళలు.. తమకు తెలియకుండానే కొంత లిప్‌స్టిక్ కొంత మింగేస్తారట. రోజూ లిప్ స్టిక్ రాసుకునే ఒక మహిళ.. ఆమె జీవితకాలంలో సుమారు 1.8 కిలోల లిప్‌స్టిక్ మింగేస్తుందట. దీంతో.. లిప్ స్టిక్‌లోని కెమికల్స్ రక్తంలో కలిసిపోయి.. ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ఈ రసాయనాలు వాళ్ల ఒంట్లో నుంచి పుట్టే పిల్లలకూ ట్రాన్స్ఫర్ అవుతాయట. కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు 30 మంది అమ్మాయిలపై రీసెర్చ్ చేసి.. ఈ విషయాన్ని తేల్చారట. సగటున రోజులో రెండు సార్లు లిప్‌స్టిక్ పెట్టుకునే వారి ఒంట్లోకి 24 మిల్లీగ్రాముల లోహాలు చేరుతున్నాయట.
మీ చర్మం మెరవాలంటే రాయాల్సింది క్రీమ్స్ కాదు - చేయాల్సింది ఇవీ! - Skin Care Tips
ప్రతి రోజూ లిప్‌స్టిక్ వేసుకునేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ కాస్మెటిక్ ఫిజిషియన్ రష్మీ శెట్టి సూచిస్తున్నారు. ఎరుపు, ఇంకా ముదురు రంగుల్లో ఉండే లిప్‌స్టిక్‌లలో లోహాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. లిప్ స్టిక్ రాసుకున్న తర్వాత పెదాలతో ప్రెస్ చేయడం.. తరచూ మళ్లీ మళ్లీ అప్లై చేసుకోవడం వల్ల వాటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ఇవి పాటించాల్సిందే..
కాబట్టి.. లిప్ స్టిక్ వేసుకునే విషయంలో అమ్మాయిలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిదని అంటున్నారు. అవసరాన్ని బట్టి.. ఫంక్షన్లకు ఎప్పుడో ఒకసారి వేసుకుంటే ఇబ్బంది లేదని, రోజూ ధరిస్తేనే ఇబ్బంది అని చెబుతున్నారు. అదే సమయంలో నాణ్యతలేని లిప్స్టిక్స్ కొనుగోలు చేయకూడదని.. సీసం వంటి పదార్థాలు లేని క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్లై చేసుకునే ముందు తప్పకుండా "బేస్" రాసుకోవాలని సూచిస్తున్నారు. చిన్న పిల్లలకు లిప్ స్టిక్ వేయకపోవడమే మంచిదని చెబుతున్నారు. వారి శరీరం ఇంకా పూర్తిగా ఎదగనందున.. వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఈ అలవాట్లు ఫాలో అయ్యారంటే - అద్దిరిపోయే అందం మీ సొంతం! - Korean Habits For Good Health