ETV Bharat / health

40 ఏళ్లు దాటాక బరువు తగ్గాలా? - ఇలా చేస్తే సింపుల్​గా వెయిట్​ లాస్​ కావొచ్చంటున్న నిపుణులు! - weight loss after 40 years old - WEIGHT LOSS AFTER 40 YEARS OLD

Weight Loss After 40 Years Old: 40 ఏళ్లు దాటిన తర్వాత చాలా మంది బరువు పెరుగుతుంటారు. శరీరంలో చురుకుదనం తగ్గడం, మారే ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, హార్మోన్ల తేడాలాంటి ఎన్నో అంశాలు 40 దాటాక బరువును పెంచేస్తాయి. అయితే, ఈ వయసులో కూడా కొన్ని జాగ్రత్తలతో పెరిగిన బరువును తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పడు చూద్దాం.

Weight Loss After 40 Years Old
Weight Loss After 40 Years Old (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Aug 26, 2024, 7:43 PM IST

Updated : Sep 14, 2024, 7:52 AM IST

Weight Loss Tips After 40 Years Old: 40 ఏళ్లు దాటాక శరీర బరువును తగ్గించుకోవాలంటే ప్రధానంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలని ప్రముఖ సర్జికల్​ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్​ టి లక్ష్మీ కాంత్​ చెబుతున్నారు. ఆహారంలో ఎక్కువ భాగం పళ్లు, కూరగాయలను తినడం మంచిదని అంటున్నారు. మాంసం, పాలు, డెయిరీ ఉత్పత్తులు, ధాన్యపు ఆహారాలతో పోలిస్తే పళ్లు, కూరగాయల్లో ఎక్కువ పోషకాలు, తక్కువ కేలరీలు, కొవ్వు ఉంటాయని తెలిపారు. పళ్లు, కూరగాయలను తక్కువ మోతాదులో తీసుకున్నా.. పొట్ట నిండిన సంతృప్తి కలుగుతుందట.

చక్కెర, కొవ్వు, పిండి పదార్థాలు ఉన్న చిరుతిళ్ల కంటే తాజా పళ్లు తీసుకోవడం మంచిందని చెబుతున్నారు. అలాగే ఉదయం పూట ఓట్స్, చిరు ధాన్యాలు, పళ్లతో కూడిన ఆహారాలను తీసుకోవడం వల్ల మధ్యాహ్నం భోజన సమయంలో మితిమీరిన ఆకలి వేయకుండా ఉంటుందని సలహా ఇస్తున్నారు. చిన్న మొత్తాల్లో ఎక్కువసార్లు భోజనం చేయడం.. లేదా తరచుగా స్నాక్స్ తీసుకోవడం ద్వారా రోజంతా ఆకలి వేయకుండా నివారించుకోవచ్చంటున్నారు. అలాగే మనం తినే ఆహారంలో ఎక్కువ భాగాన్ని మధ్యాహ్నం 3 గంటలోపు తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశాలు పెరుగుతాయని వివరించారు. బరువు తగ్గాలని అనుకునేవారు తప్పనిసరిగా ఉదయం పూట అల్పాహారం మానకూడదని చెబుతున్నారు.

"వయసు పెరిగేకొద్దీ.. మన జీర్ణక్రియ శక్తి తగ్గుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారం శరీరంలో పేరుకుపోయి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. వయసు పెరిగే సమయంలో కండరాల సాంద్రతను పెంచుకోవడం వల్ల బరువు అంత సులభంగా పెరగరు. ఇందుకోసం వారంలో 5రోజులు సుమారు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దీంతో పాటు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటిని తక్కువగా తాగినప్పుడు.. దాహం వేసినా ఆకలిగా భావించి ఆహారం తింటాం. అందుకే ఎక్కువగా నీటిని తాగాలి. సాయంత్రం సమయాల్లో ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు."

--డాక్టర్​ టి లక్ష్మీ కాంత్​, సర్జికల్​ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో చురుకుదనం తగ్గుతుందని.. దీంతో మునపటి కంటే తక్కువ కేలరీలు సరిపోతాయని చెబుతున్నారు. ఆహారం తగ్గించుకోవాలని అనుకునేవారు రోజంతా ఏం తింటున్నామనేది రాసుకోవడం మంచిదట. అలాగే రోజులో తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినే ప్రయత్నం చేయాలని వివరిస్తున్నారు. ఆహారం తీసుకునేటప్పుడు దానిపై ఏకాగ్రత ఉండాలని... అలా కాకుండా ఏదో ఒక పని చేస్తూ తినడం వల్ల అవసరమైన దానికంటే ఎక్కువగా తింటారని వివరిస్తున్నారు. 40 ఏళ్లు దాటిన తర్వాత ఆల్కహాల్ సైతం బరువు పెరిగేలా చేస్తుందట. మద్యం ఎక్కువగా తాగడం వల్ల ఆకలి పెరిగి.. ఆహారం అధికంగా తీసుకోవాల్సిన అవసరం పెరుగుతుందని వివరిస్తున్నారు.

"బ్రేక్​ఫాస్ట్​ సరిగ్గా తీసుకోవడం వల్ల మధ్యాహ్నం సమయంలో తక్కువ ఆహారం తీసుకోవచ్చు. ఎప్పుడైతే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం తినకపోవడం వల్ల రాత్రి పూట చాలా ఎక్కువగా ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. ఇలా తిన్న తర్వాత ఏ పని చేయకుండా నిద్రపోతాం కాబట్టి.. శరీరంలో కేలరీలు పేరుకుపోయి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మంచి బ్రేక్​ఫాస్ట్​ తీసుకుని భోజనంలో తక్కువ కేలరీలు ఆహారం తీసుకుంటే మంచిది. దీంతో పాటు ఒత్తిడి, నిద్ర అనేది కూడా బరువు పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే సరిగ్గా నిద్రపోవడం, ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడు.. మన డైట్​పై సరైన శ్రద్ధ పెడుతాం. కుటుంబం, స్నేహితులతో కలిసి ఏదైనా ఆట, వాకింగ్​, డ్యాన్స్ ఇలా ఏ పనిచేసినా ఉత్సాహంగా పాల్గొని బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది."

--డాక్టర్​ టి లక్ష్మీ కాంత్​, సర్జికల్​ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్​

40లో ఉన్నప్పుడు సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం అలవాటుగా మారుతుంది. పంచదారతో కూడిన టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్​ లాంటివి తగ్గించి.. మంచి నీరు, కేలరీలు తక్కువగా ఉండే పానీయాలు తాగడం మంచిదని చెబుతున్నారు. మంచి ఆహారం తీసుకుంటు, వ్యాయామం చేస్తున్నా.. బరువు పెరుగుతుంటే థైరాయిడ్​ పరీక్ష చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు. 40 దాటాక కండరాలు సాంద్రత తగ్గుతుంటుందని.. ఇలాంటప్పుడు వీటిని పెంచే వ్యాయామాలు అంటే బరువులు ఎత్తడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. 40 దాటాక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండాలంటే యోగా, ధ్యానం, దీర్ఘశ్వాస వ్యాయామం చేయడం మంచిదని తెలుపుతున్నారు. సరైన నిద్ర లేకపోయినా బరువు పెరుగుతారని.. అందుకే కంటినిండా కమ్మని నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

యూరిక్ యాసిడ్​ ఎక్కువై ఇబ్బందిపడుతున్నారా? - ఈ ఆహారాల జోలికి వెళ్లకుంటే ఇట్టే తగ్గిపోతుంది!! - uric acid avoid food list in telugu

అద్దాలు వాడితే కళ్లు దానం చేయకూడదా? నేత్రదానంపై వాస్తవాలివే! - Eye Donation Fortnight 2024

Last Updated : Sep 14, 2024, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.