ETV Bharat / health

ఆలస్యంగా తినడం కూడా ఛాతీలో మంటకు కారణమా? - ఏ సమయంలో తింటే మంచిది??

-ఆలస్యంగా తింటే ఆరోగ్య సమస్యలు - ఈ సమయాల్లో భోజనం చేయడం ఎంతో మేలు!

author img

By ETV Bharat Health Team

Published : 8 hours ago

ACIDITY CAUSES
What are The Best Times to Eat (ETV Bharat)

What are The Best Times to Eat? నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరిదీ ఉరుకుల పరుగుల జీవితమే. ఈ క్రమంలోనే చాలా మంది రకరకాల కారణాల వల్ల సరైన సమయంలో భోజనం చేయరు. ముఖ్యంగా మహిళలైతే ఇంటి పనుల కారణంగా మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్, మధ్యాహ్న భోజనం చాలా ఆలస్యంగా తింటుంటారు. దీంతో కొందరిలో ఛాతీలో మంట, ఇతర సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే, అలా.. ఛాతీలో మంట రావడానికి ఆలస్యంగా తినడమే కారణమా? అదే అయితే.. ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? దీనిపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఛాతీలో మంటకు రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే, అందులో ముఖ్యంగా ఎసిడిటీ వల్ల ఛాతీలో మంట వస్తుండవచ్చంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్. ఎసిడిటీ రావడానికి.. ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం లేదా పొట్టలో హెచ్​పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్​ఫెనక్షన్.. ఇలా ఎన్నో కారణాలున్నాయంటున్నారు. అంతేకాకుండా.. అన్నవాహిక దగ్గర ఉండే చిన్న కండరం వదులుగా అయినప్పుడు జీర్ణకోశంలో ఉండాల్సిన ద్రవాలు గొంతులోకీ నోట్లోకీ వస్తుంటాయి. దాని కారణంగానూ ఎసిడిటీ లక్షణాలు కనిపిస్తుంటాయంటున్నారు. అదేవిధంగా.. అందరి జీవనశైలి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. ఎప్పుడు నిద్రలేస్తారు.. ఏం పని చేస్తారు.. ఏ ఫుడ్ తీసుకుంటారు.. ఎంత మోతాదులో తింటారు.. ఇవన్నీ కూడా జీర్ణకోశ పనితీరుపై ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకీ శ్రీనాథ్.

వీటి వల్ల ఎసిటిడీ వచ్చే ఛాన్స్! ముఖ్యంగా.. మాంసాహారం, నూనెతో చేసిన పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. పైగా ఈ పదార్థాలు అధిక ఆమ్లాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. అంతేకాదు.. కొంతమందికి అన్ని రకాల మసాలాలు పడకపోవచ్చు, అలాగే ఎండుమిర్చి, మిరియాలు, కారం, చింతపండు వంటి కొన్ని పదార్థాల వల్ల కూడా ఎసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందని సూచిస్తున్నారు. ఇవేవీ కాకుంటే.. హెచ్‌ పైలొరీ ఇన్‌ఫెక్షన్‌ ఉండి ఉండొచ్చు కాబట్టి ఒకసారి వైద్యుల్ని సంప్రదించి వారి సూచన, సలహాలకు అనుగుణంగా నడుచుకోవడం మంచిదంటున్నారు.

రోజూ ఈ సమయానికి తింటే ఆరోగ్యానికి మేలు!

  • ఇకపోతే.. డైలీ ఓ అరగంట నడక లేదా వ్యాయామం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. మార్నింగ్ 6 గంటలకు లేచి తొమ్మిదికల్లా బ్రేక్​ఫాస్ట్, ఒంటి గంటకి భోజనం, సాయంత్రం నాలుగు నుంచి ఐదు లోపు ఓట్స్‌ జావ, ఫ్రూట్స్‌, నట్స్‌, వంటివి తీసుకునేలా మీ డైలీ డైట్ ప్లాన్​ను సెట్ చేసుకోవాలంటున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్.
  • అదేవిధంగా.. రాత్రి ఏడు నుంచి ఎనిమిది మధ్యలో డిన్నర్ కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలంటున్నారు. ఆలస్యంగా తినడం, ఒక పూట మానేయడం చేయకుండా, తేలికగా జీర్ణమయ్యే ఫుడ్స్ తీసుకోవాలి. ఇలా.. రోజూవారి ఆహారంలో మార్పులు చేసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవని సూచిస్తున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

ఒక్క పీస్​తో మొదలు పెట్టి.. మొత్తం తినేస్తున్నారా? - కోరిక ఆపుకోలేక పోతున్నారా? - దానికి కారణం ఇదేనట!

డిన్నర్​కి "బ్రేక్​ఫాస్ట్"​ మంచిదేనా? - నిపుణులు సమాధానం మీ కోసం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.