ETV Bharat / health

కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నారా? - నిపుణులు ఏమంటున్నారో తెలుసా? - Legs Crossing side effects

Side Effects of Legs Crossing: చాలా మందికి కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ సమస్యలేంటో ఈ స్టోరీలో చూద్దాం..

Side Effects of Legs Crossing
Side Effects of Legs Crossing (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 4:43 PM IST

Side Effects of Legs Crossing: ఇళ్లు, ఆఫీసు.. ప్రదేశం ఏదైనా చాలా మంది కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. కొద్ది మంది అలవాటు ప్రకారం వేసుకుంటే.. కొద్దిమంది స్టైల్​ కోసం వేసుకుంటారు. అయితే ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ అలవాటు మానుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం..

రక్తప్రసరణ సమస్యలు: కాలు మీద కాలు వేసుకోవడం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల కాళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఇది తిమ్మిరి, నొప్పి, వాపు, ఇతర సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా, ఇది సిరల థ్రోంబోసిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

నడుము నొప్పి: ఈ భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇది నొప్పి, అసౌకర్యానికి దారితీస్తుందని.. సమయం గడిచేకొద్దీ ఇది డిస్క్ హెర్నియేషన్, సహా ఇతర వెన్నునొప్పి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. 2014లో జర్నల్ ఆఫ్ ఆర్థోపెడిక్ రీసెర్చ్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కాలు మీద కాలు వేసుకోవడం వల్ల వెన్నముకపై 32% అదనపు ఒత్తిడి కలుగుతుందని పేర్కొన్నారు.

నరాల నష్టం: కాలు మీద కాలు వేసుకోవడం వల్ల సయాటిక్ నరాలపై ఒత్తిడి పెరుగుతుందని.. ఇది కాళ్లలో నొప్పి, జలదరింపు, మొద్దుగా అనిపించడం వంటి లక్షణాలకు దారితీస్తుందని చెబుతున్నారు.

జీర్ణ సమస్యలు: ఈ భంగిమ జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. 2018లో జర్నల్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల జీర్ణ సమయం పెరుగుతుందని తద్వారా ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని కనుగొన్నారు. దీనివల్ల అజీర్ణం, ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలు రావచ్చొని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘై జియాటోంగ్ విశ్వవిద్యాలయం గాస్ట్రోఎంటరాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా జియాన్-పింగ్ లియు పాల్గొన్నారు.

వెరికోస్​ వెయిన్స్​: కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల కాళ్లలోని సిరలలో రక్త ప్రవాహం తగ్గుతుందని.. దీంతో సిరలపై ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇలా దీర్ఘకాలికంగా ఒత్తిడి పెరగడం వల్ల సిరలు సాగిపోతాయని తద్వారా వెరికోస్ వెయిన్స్ ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు.

రాత్రి పడుకునే ముందు పాలలో నెయ్యి కలిపి తాగితే - ఏం జరుగుతుందో తెలుసా? - Benefits Of Drinking Milk With Ghee

గర్భధారణ సమయంలో సమస్యలు: హెల్త్‌లైన్ ప్రకారం.. గర్భధారణ సమయంలో మహిళలు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. ఇలా కూర్చుంటే తల్లితోపాటు బిడ్డకు కూడా హాని కలిగిస్తుందని.. అంతే కాకుండా కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు. జర్నల్ ఆఫ్ మిడ్‌వైఫరీ అండ్ ఉమెన్స్ హెల్త్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, కాలు మీద కాలు వేసుకుని కూర్చునే గర్భిణులలో దాదాపు 26 శాతం మందికి రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ (RLS) లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు.

వీర్య కణాల ఉత్పత్తిపై ప్రభావం: కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే.. వీర్య కణాల ఉత్పత్తిపైనా ప్రభావం పడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. సాధారణంగా శరీర ఉష్ణోగ్రతల కన్నా టెస్టికల్స్‌ ఉష్ణోగ్రత 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా ఉండాలి. అయితే.. క్రాస్‌ లెగ్‌ స్థితిలో కూర్చున్నప్పుడు.. ఉస్ణోగ్రతలు 3.5 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశం ఉంది. టెస్టికల్స్‌లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి నాణ్యత తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

రక్తపోటు సమస్య: కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ భంగిమలో కూర్చోవడం వల్ల కాళ్లలోని సిరలలో రక్త ప్రవాహం తగ్గుతుందని, అలాగే గుండెపై ఒత్తిడి పెరుగుతుందని.. ఇవన్నీ రక్తపోటు పెరగడానికి దారితీస్తాయని అంటున్నారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ నర్సింగ్, జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్‌లో ప్రచురితమైన రెండు అధ్యయనాల ప్రకారం కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం రక్తపోటులో స్వల్ప పెరుగుదలకు దారితీస్తుందని కనుగొన్నారు.

పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారా? - ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి! - Summer EYe Safety Tips

అలర్ట్ : మామిడి పండు తింటే షుగర్ పెరుగుతుందా? - నిపుణులు ఏమంటున్నారంటే - Mango Increase Blood Sugar or Not

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.