ETV Bharat / health

అధిక బరువుతో బీపీ వేధిస్తోందా? - వెయిట్ లాస్ సర్జరీతో చెక్ పెట్టొచ్చా?! - Weight Loss tips

Weight Loss Surgery : ప్రస్తుత కాలంలో ఎక్కువ మందిని వేధిస్తోన్న ఆరోగ్య సమస్యల్లో హైబీపీ ఒకటి. అయితే.. వీరిలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి వెయిట్ లాస్ సర్జరీ సరైన చికిత్స అంటోంది ఓ పరిశోధన! ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Weight Loss Surgery
Weight Loss Surgery
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 12:14 PM IST

Weight Loss Surgery : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుని పని చేయటం వంటి వివిధ కారణాలతో.. నేడు చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడున్నారు. ఊబకాయం వచ్చిన తర్వాత.. మరిన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా వీరిని అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి చుట్టు ముడుతుంటాయి. అయితే.. అధిక బరువుతో బాధపడేవారు వెయిట్ లాస్ సర్జరీ చేసుకోవడం ద్వారా.. హైబీపీ సమస్యను తగ్గించుకోవచ్చని ఒక పరిశోధన చెబుతోంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

ఏంటా శస్త్రచికిత్స?
ఊబకాయంతో బాధపడేవారు.. శరీర బరువును తగ్గించుకోవడానికి ఆపరేషన్ చేయించురుంటారు. దీన్నే బేరియాట్రిక్ సర్జరీ అంటారు. ఈ చికిత్స వల్ల బరువును వేగంగా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. అధిక బరువుతో బాధపడుతున్న వారు ఈ బేరియాట్రిక్‌ సర్జరీ చేసుకోవడం వల్ల ఉపయోగంగా ఉంటుందట. ఈ ఆపరేషన్ చేయించుకున్న కొందరిలో హైబీపీ తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారట.

రిస్క్ ఎక్కువే..

బేరియాట్రిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గడంతోపాటు బీపీకి చెక్ పెట్టే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నప్పటికీ.. దీని వల్ల రిస్క్​ కూడా ఎక్కువగానే ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ సర్జరీ అనేది అందరిలోనూ ఒకేవిధమైన ఫలితాలు ఇస్తుందని చెప్పడానికి లేదంటున్నారు. కొందరిలో సత్ఫలితాలు కనిపించినా.. మరికొందరిలో దుష్ఫలితాలు ఉండొచ్చని చెబుతున్నారు. ఇంకొందరిలో ముందుగా బాగానే అనిపించినా.. దీర్ఘకాలంలో ఇబ్బందులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. అందువల్ల.. చికిత్స కన్నా నివారణే మేలు అన్నట్టుగా బరువు పెరగకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.

అధిక బరువు సమస్య రాకుండా ఉండటానికి ఏం చేయాలి ?

  • రోజూ క్రమం తప్పకుండా శారీరక శ్రమను కలిగించే వ్యాయామం చేయాలి.
  • అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి.
  • తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
  • బరువు పెంచే జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్‌, కూల్‌డ్రింక్స్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి.
  • ఒత్తిడి, తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటి వాటిని జీవితంలో భాగం చేసుకోవాలి.

గమనిక : వెయిట్ లాస్ సర్జరీ రిస్క్ తో కూడుకున్నది. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత, మీ ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి. ఇది కేవలం మీ అవగాహన కోసమే.

బొల్లి మచ్చలతో బాధపడుతున్నారా ? - దీనికి ఓ చికిత్స ఉందని మీకు తెలుసా?

నానబెట్టిన ఎండు ద్రాక్షతో ఎన్నో లాభాలు- 30ఏళ్లు పైబడిన మహిళలు పక్కాగా తినాల్సిందే!

మీకు కంటి సమస్యలున్నాయా? - అది గ్లకోమానా? లేదా క్యాటరాక్టా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.