ETV Bharat / health

వాకింగ్‌ Vs మెట్లు ఎక్కడం - బరువు తగ్గడానికి ఏది బెటర్​ ఆప్షన్​! - Walking Vs Climbing Stairs

author img

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 12:24 PM IST

Walking Vs Climbing Stairs Which is Best: అధిక బరువుతో బాధపడేవారు బరువు తగ్గడానికి ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే వెయిట్‌ లాస్‌ అవ్వడం కోసం కొంత మంది ఉదయాన్నే వాకింగ్‌ చేస్తే.. మరికొంత మంది మెట్లు ఎక్కుతుంటారు. మరి ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏది మంచిదో ఇప్పుడు చూద్దాం.

Weight Loss
Walking Vs Climbing Stairs Which Is Best For Weight Loss (ETV Bharat)

Walking Vs Climbing Stairs Which is Best For Weight Loss : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వెయిట్‌లాస్‌ అవ్వడానికి వివిధ రకాల వ్యాయామాలు చేస్తూ, కఠినమైన డైట్‌ను పాటిస్తుంటారు. అయితే, బరువు తగ్గడానికి కొంత మంది వాకింగ్‌ చేస్తే.. మరికొంత మంది స్టెప్స్​ ఎక్కుతుంటారు. మరి ఈ రెండింటిలో ఏది బరువు తగ్గడానికి సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం.

మెట్లు ఎక్కడం వల్ల కలిగే లాభాలు :

బరువు తగ్గడానికి: మెట్లు ఎక్కడం వల్ల తొడలు, కాళ్లలోని కొవ్వు కరుగుతుందని.. అలాగే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెట్లు ఎక్కడ వల్ల మూడు రెట్లు వేగంగా ఫ్యాట్‌ బర్న్‌ అవుతుందట. దీనివల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉందంటున్నారు. 2001లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌'లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. అధిక బరువుతో బాధపడేవారు మెట్లు ఎక్కడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ డేవిడ్ జె. లెవి పాల్గొన్నారు.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: మెట్లు ఎక్కడం వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుందని తద్వారా రక్త ప్రసరణ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్​, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అంటున్నారు. అయితే గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా మెట్లు ఎక్కడం మంచిది కాదని.. అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా డాక్టర్ సూచనల ప్రకారం మెట్లు ఎక్కాలని సూచిస్తున్నారు.

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది: వ్యాయామం ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపిస్తుందని.. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు. అలాగే మెట్లు ఎక్కడం వల్ల ఆందోళన, నిరాశ లక్షణాలు తగ్గుతాయని చెబుతున్నారు.

బెల్లీ ప్యాట్​ తగ్గాలా? ఇష్టమైన ఫుడ్​ తింటూనే ఈ టిప్స్ పాటిస్తే చాలు! - Ayurvedic Tips for Belly Fat

నడక వల్ల లాభాలు: ఎవరైనా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఈజీగా చేయగలిగే వ్యాయామం నడక మాత్రమే. రోజూ ఉదయాన్నే ఒక అరగంట పాటు నడవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

కొలెస్ట్రాల్‌ కరుగుతుంది : శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవడానికి నడక ఒక మంచి ఎక్సర్‌సైజ్‌ అని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజు అరగంటకు పైగా నడవడం వల్ల కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చని చెబుతున్నారు.

గుండె ఆరోగ్యంగా : ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న వయసులోనే వివిధ రకాల గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, రోజూ నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 2018లో పీర్‌ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. వాకింగ్‌ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని, అలాగే రక్తపోటు అదుపులో ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.

ఒత్తిడి తగ్గుతుంది : ఉదయాన్నే నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించుకోవచ్చని.. వాకింగ్‌ చేయడం వల్ల మైండ్‌ రిలాక్స్‌గా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఇవే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వాకింగ్​ వల్ల పొందవచ్చు.

బరువు తగ్గడానికి నడవడం లేదా మెట్లు ఎక్కడం ఏది బెటర్​: ఈ రెండూ కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడేవని నిపుణులు అంటున్నారు. ఈ రెండింటిలో ఏది మంచిదనేది వాళ్ల ఫిట్​నెస్​ స్థాయిలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అయితే మోకాళ్లు, కాళ్ల నొప్పులు వంటి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే బరువు తగ్గడానికి వాకింగ్‌ చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఈ సమస్యలతో బాధపడే వారు మెట్లు ఎక్కడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే, ఆరోగ్యంగా ఉన్నవారు వాకింగ్‌, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలను చేయవచ్చని సూచిస్తున్నారు.

బాదంపప్పును తింటున్నారా? - ఇలా తింటే ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలు! - Soaked Vs Unsoaked Almonds

తిన్న తర్వాత కేవలం 10 నిమిషాలు నడవండి - మీ శరీరంలో ఊహించలేని మార్పు! - Benefits of Walking after Meals

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.