ETV Bharat / health

రోజుకు 10 వేల అడుగుల వాకింగ్- ఈ సింపుల్ టిప్స్​తో సులువుగా నడిచేయండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 1:13 PM IST

Walking 10k Steps Per Day Tips In Telugu : ప్రస్తుత సాంకేతిక యుగంలో శారీరక శ్రమ చాలా తగ్గింది. బిజీ లైఫ్​లో చాలా మంది వ్యాయాయం కూడా చేయలేకపోతున్నారు. అందుకే చాలా మంది రోజుకి కనీసం 10 వేల అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. రోజుకు 10వేల అడుగులా? ఎలా నడవాలి? అనుకుంటున్నారా? ఈ సింపుల్ టిప్స్​తో ఈజీగా పదివేల అడుగులు నడిచేయండి.

Walking 10k Steps Per Day Tips In Telugu

Walking 10k Steps Per Day Tips In Telugu : ఆధునిక కాలంలో జీవన శైలి మారింది. ఉద్యోగం, వ్యాపారం అంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. దీంతో శారీరక వ్యాయామం చేయడం తగ్గింది. అందుకే కనీసం రోజుకు కొంత దూరమైనా నడవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో రోజుకి 10 వేల అడుగులు నడవాలని టార్గెట్ పెట్టుకుంటున్నారు కొందరు. కానీ కొన్ని సార్లు దాన్ని రీచ్ కాలేకపోతున్నారు. 10 వేల అడుగులు అంటే వినడానికి ఈ నంబర్ కొందర్ని భయపెట్టవచ్చు. కొన్ని టిప్స్ పాటించడం వల్ల సులువుగా రోజుకు 10వేల అడుగులు ఈజీగా నడవవచ్చని డా.అపూర్వ దువా చెబుతున్నారు.

రోజుకు 10 వేల అడుగుల్ని నడవడం పెడోమీట‌ర్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ పరికరంలో లక్ష్యాన్ని పూర్తి చేయ‌డానికి పెట్టుకున్న ఒక మ్యాజిక్ ఫిగ‌ర్. అంతే కానీ రోజుకు 10 వేల అడుగులు న‌డ‌వ‌టం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌కు శాస్త్రీయ ఆధారాలు లేవు. దీని వ‌ల్ల ఉన్న ప్ర‌యోజ‌న‌మేంటంటే ఎక్కువ దూరం న‌డిచేలా ఈ ల‌క్ష్యం మ‌న‌ల్ని ప్రేరేపిస్తుంది. రోజుకి 10 వేల అడుగులు న‌డ‌వ‌డానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.

1. ఇష్ట‌మైన ప్రాంతాల్లో న‌డ‌వ‌టం
మీకు ఇష్ట‌మైన ప్రాంతాల్లో న‌డ‌వ‌టం వల్ల మాన‌సిక స్థితి మెరుగుపడుతుంది. మీకు నచ్చిన ప్రాంతాల్లో న‌డ‌వ‌టం వ‌ల్ల మీకు తెలియ‌కుండానే ఎక్కువ దూరం న‌డిచే అవ‌కాశం ఉంటుంది. మీకు న‌చ్చిన పాట‌ను వింటూ చిన్న పాటి నృత్యం చేసుకుంటూ వెళ్లండి. దాని వ‌ల్ల మీ ల‌క్ష్యాన్ని ఈజీగా చేరుకుంటారు.

2. న‌చ్చిన ఆట ఆడ‌టం
న‌చ్చిన ఆట‌లో పాల్గొన‌టం వ‌ల్ల హాయిగా అనిపించ‌డ‌మే కాకుండా 10 వేల అడుగుల‌ ల‌క్ష్యాన్ని సుల‌భంగా చేరుకోవ‌చ్చు. మీ జీవిత భాగ‌స్వామిని జ‌త చేసుకోవ‌డం వ‌ల్ల ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఆడ‌గ‌ల‌రు.

3. ఇంటి ప‌నులు చేయ‌డం
కొందరు ఇంటి పనులు చేయ‌డం ఎలాంటి వ్యాయామం కింద‌కు రాదనుకుంటారు. కానీ అది నిజం కాదు. రోజూ కొంత స‌మ‌యం ఇంటి ప‌నులు చేయ‌డం వ‌ల్ల ఎక్కువ సేపు న‌డిచే అవ‌కాశ‌ముంటుంది. స్వీపింగ్, వాక్యూమింగ్, మాపింగ్, డస్టింగ్, క్లీనింగ్ లాంటి కార్యకలాపాలు మీ ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డంలో సాయ‌ప‌డ‌తాయి.

4. వంట చేయ‌డం
వంట చేయ‌డం అంత ఈజీ ప‌నేమీ కాదు. చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఏదైనా ఉడ‌క‌బెట్టిన‌ప్పుడు, వంట మ‌ధ్య‌లో తీరికగా ఉన్న‌ప్పుడు అటు ఇటూ న‌డ‌వండి. కిచెన్​లో లేదా వీలైతే ఇంట్లోని ఇత‌ర ప్రాంతాల‌కు ఓ వాకింగ్ రౌండ్ వేసి రండి.

5. న‌చ్చిన వారితో కాసేపు గ‌డ‌ప‌టం
న‌చ్చిన వారితో గ‌డ‌ప‌డం వ‌ల్ల ఎలా న‌డిచే ల‌క్ష్యాన్ని చేరుకుంటాం అనే సందేహం అక్క‌ర్లేదు. ప్రియ‌మైన వారితో మాట్లాడ‌డడానికి అందరూ ఇష్ట‌ప‌డ‌తారు. ఇంట్లోని కుటుంబ స‌భ్యులు, జీవిత భాగ‌స్వాముల‌తో, లేదా ఆఫీసులో కొలీగ్స్​తో కాసేపు స‌ర‌దాగా మాట్లాడుకుంటూ బ‌య‌ట‌కి వెళ్లండి. దీని వ‌ల్ల మీకు తెలియ‌కుండానే చాలా దూరం న‌డ‌వ‌గ‌ల‌రు.

6. గంట‌కోసారి లేచి తిర‌గడం
ఒక‌వేళ మీరు వ‌ర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేస్తున్నారా? అయితే త‌క్కువ సేపు కూర్చుని ఎక్కువ సేపు తిర‌గ‌ండి. ప‌నిచేసే స‌మ‌యంలో వాట‌ర్ బాటిల్ మీ ప‌క్క‌నే పెట్టుకోకుండా ప్ర‌తి గంట‌కోసారీ వెళ్లి గ్లాసు నీళ్లు తాగేసి రండి.

7. నో టు ఆన్ లైన్ ఆర్డ‌ర్
ఆన్‌లైన్ డెలివరీలు మ‌న జీవితాన్ని ఈజీగా మార్చేశాయి. ఒక‌రకంగా చెప్పాలంటే బ‌ద్ద‌కంగా త‌యారు చేశాయి. ఏదైనా కావాల‌నుకున్న‌ప్పుడు ఆన్​లైన్​లో ఆర్డ‌ర్ పెట్టుకోకుండా స్వ‌యంగా వెళ్లి తీసుకోండి. తినాల‌నిపించిన‌పుడూ అంతే ద‌గ్గ‌ర్లోని హోటల్ లేదా రెస్టారెంట్​కు నడిచి వెళ్లి తినండి.

8. వాహ‌నాల‌పై ఆధార‌ప‌డ‌టం త‌గ్గించండి
వాహ‌నాల‌పై ఆధార‌ప‌డ‌టం తగ్గించుకోండి. ప్ర‌తి చిన్న విష‌యానికి బైక్​, కారు మీద వెళ్లకండి. తక్కువ దూరంలో పని ఉన్నట్లయితే నడుచుకుంటూ వెళ్లండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.