ETV Bharat / health

వర్షాకాలంలో D విటమిన్ చాలా తగ్గిపోతుంది - మందులు వాడకుండానే ఇలా చేయండి - ఓ రేంజ్​లో పెరుగుతుంది! - Vitamin D Rich Foods

Vitamin D Rich Foods : మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. శరీరానికి "విటమిన్ D" అందడం చాలా అవసరం. రోగాల బారినపడకుండా తగినంత ఇమ్యూనిటీ పవర్​ను అందించడంలో అది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బోన్స్ బలంగా ఉండేలా చూస్తుంది. కానీ.. ఈరోజుల్లో చాలా మంది D విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. అయితే, ఈ లోపాన్ని అధిగమించడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

Best Foods For Vitamin D
Vitamin D Rich Foods (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 12:24 PM IST

Best Foods For Vitamin D : నేటి రోజుల్లో ఎండ పొడ తగలకుండా రోజంతా ఏసీ గదుల్లో ఉండటం వంటి కారణాలతో చాలా మంది "విటమిన్‌ డి" లోపంతో బాధపడుతున్నారు. ఇక వర్షాకాలం అయితే సూర్యరశ్మి సరిగా ఉండదు. దీంతో.. ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. కాబట్టి.. మీరు "విటమిన్ డి"(Vitamin D) లోపం బారినపడకుండా ఉండాలంటే.. మీ డైట్​లో ఈ ఆహార పదార్థాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. మరి, ఆ ఫుడ్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కమలా పండ్లు : వీటిలో విటమిన్ సి, డి పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి, మీరు డైలీ ఒక కమలా పండు తిన్నా లేదంటే దాన్ని జ్యూస్ చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

పాలు, పెరుగు : శరీరానికి కావాల్సిన విటమిన్ Dని అందించడంలో పాలు, పెరుగు చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. అలాగే వీటిలో ప్రొటీన్స్, కాల్షియం కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ. అయితే, బయట దొరికే పెరుగులో చాలావరకు ఫ్లేవర్స్‌ కలుపుతుంటారు. కాబట్టి దానిలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటాయి.. అందుకే ఇంట్లోనే పెరుగు తోడేసుకొని తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

సన్‌ స్క్రీన్‌ లోషన్‌ వాడితే విటమిన్‌-D అందదా? నిజమెంత?

చేపలు : విటమిన్ D సమృద్ధిగా లభించే మరో పోషకాహారం.. చేపలు. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపలలో D విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో ఉండే కాల్షియం, ప్రొటీన్లు, ఫాస్ఫరస్.. వంటి ఇతర పోషకాలు సంపూర్ణ ఆరోగ్యానికి సహకరిస్తాయి. కాబట్టి, చేపలు మీ డైట్​లో తరచుగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.

2015లో "ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్​"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. సాల్మన్, మాకేరెల్, ఇతర చేపలలో విటమిన్ D పుష్కలంగా ఉంటుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో జర్మనీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్​కు చెందిన పరిశోధకులు డాక్టర్ Hirche Frank పాల్గొన్నారు. తరచుగా చేపలు తినడం ద్వారా విటమిన్ లోపం బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

గుడ్డు పచ్చ సొన : దీనిలోనూ విటమిన్ ‘డి’ తో పాటు ప్రొటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అయితే, కొవ్వులు కూడా ఎక్కువే. కాబట్టి రోజుకు ఒక గుడ్డు పచ్చసొన తీసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు.

పుట్టగొడుగులు : ఇవి ఎండలోనే పెరుగుతాయి. కాబట్టి వీటిలో కూడా విటమిన్ ‘డి’ స్థాయులు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. దీంతో పాటు బి1, బి2, బి5, కాపర్‌.. వంటి పోషకాలు కూడా పుట్టగొడుగుల్లో పుష్కంగా ఉంటాయి. కాబట్టి, డైలీ వీటిని తీసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు.

ఇవేకాకుండా.. తృణధాన్యాలు, చీజ్, సోయాపాలు, ఓట్స్ వంటి వాటిలో కూడా విటమిన్ ‘డి’ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని డైలీ డైట్​లో చేర్చుకున్నా శరీరానికి కావాల్సినంత విటమిన్ డి లభిస్తుందంటున్నారు నిపుణులు. అయితే, ఆహార పదార్థాలే కాకుండా డైలీ మార్నింగ్ లేలేత సూర్యకాంతిలో కనీసం పదిహేను నిమిషాలు నిల్చోవడం ద్వారా తగినంత విటమిన్ డి అందుతుందంటున్నారు!

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

విటమిన్ D లోపం వల్లే ఆ సమస్యలు - ఏమైందో అని భయపడుతుంటారు!

విటమిన్-డి మాత్రలు ఎక్కువగా వాడేస్తున్నారా?.. ఆ '10' లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.