ETV Bharat / health

డల్​ స్కిన్​, డార్క్​ సర్కిల్స్​కు చెక్- ఈ 7 కూరగాయల తొక్కలతో ఇన్ని లాభాలా? - Vegetable Peel Benefits For Skin

Vegetable Peel Benefits For Skin : వంట చేసిన తర్వాత కూరగాయల తొక్కలను ఏం చేస్తున్నారు? పడేస్తున్నరా, అయితే మీరు చాలా మిస్ అవుతున్నట్టే. కూరగాయల తొక్కలతో మన చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు. మన ముఖంపై ఉన్న నల్ల మచ్చలను పొగొట్టొచ్చు. జిడ్డు కారడానికి కూడా ఈ తొక్కలు పరిష్కారం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. మరి అలాంటి కూరగాయల తొక్కలతో ఉండే ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Vegetable Peel Benefits For Skin
Vegetable Peel Benefits For Skin
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 5:02 PM IST

Vegetable Peel Benefits For Skin : వంట చేసేందుకు మనం చాలా రకాల కూరగాయలను ఉపయోగిస్తుంటాం. అందులో భాగంగా బంగాళాదుంప, క్యారెట్ వంటి కూరగాయల తొక్కలను తీసేస్తుంటాం. లోపలి కండ భాగాన్ని వంటల్లో, తీసేసిన తొక్కల్పి చెత్త డబ్బాలో వేస్తుంటాం. కానీ కూరగాయల తొక్కలను కూడా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా? వాటిలో కూడా చాలా రకాల పోషకాలుంటాయంటే మీరు కాదని అనగలరా. కూరగాయల తొక్కలతో బెనిఫిట్స్​ ఏంటో వివరంగా తెలుసుకుందాం.

మనం నేరుగా తినేముందు గానీ, వంటం వండే ముందు గానీ కూరగాయల తొక్కలు తీసి పడేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటి మీద ఉండే దుమ్ము, ధూళి, లేక పండించే సమయంలో వాడే పురుగుల మందులు లాంటివి ఒక కారణమైతే. తొక్కలు చేదుగా, మచ్చలుగా ఉండటం వలన కూరగాయ రుచి కోల్పోవడం మరో కారణం. అయితే చాలా రకాల కూరగాయల లాగానే వాటి తొక్కల్లో కూడా ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయని, అవి చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడతాయని కాస్మోటాలజిస్ట్లు, చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఏయే కూరగాయల తొక్కలను ఉపయోగించుకోవచ్చు?
బంగాళదుంప
బంగాళదుంప తొక్కల్లో విటమిన్-సీ, విటమిన్-బీ6, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై మచ్చలను తొలగించడానికి, కంటి కింద నల్లటి వలయాలు పొగెట్టేందుకు, చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు ఉపయోగపడతాయి.

దోసకాయ తొక్కలు
వీటిలో సిలికా, విటమిన్-కేతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మానికి చల్లదనాన్ని, హైడ్రేటింగ్ లక్షణాలను అందిస్తాయి. చర్మం రంగు, స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో దోసకాయ తొక్కలు బాగా ఉపయోగపడతాయి.

క్యారెట్
క్యారెట్ తొక్కలో బీటా కెరోటిన్, విటమిన్-ఏ , విటమిన్-సీతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలోనూ, గీతలు, ముడతలు తగ్గించడంలోనూ సహాయపడతయి.

బీట్ రూట్ పీల్స్
వీటిలోని బీటాలైన్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్- ఎ, విటమిన్-సీ రక్త ప్రసరణను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అలాగే ముఖానికి సహజమైన కాంతిని అందిస్తాయి. బీట్ రూట్ లొక్కల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, చికాకు మంట లాంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయి.

గుమ్మడికాయ
గుమ్మడికాయ తొక్కలో ఎంజైమ్‌లు, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్‌లు (AHAలు), విటమిన్‌-ఏ, విటమిన్-సీ ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే మృత కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేయడానికి సహాయపడతాయి.

టమాటా
టమాటా తొక్కల్లో లైకోపీన్, విటమిన్-ఎ, విటమిన్-సీ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో, రంధ్రాలను బిగుతుగా చేయడంలో, అదనపు నూనె ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే డల్ స్కిన్‌ను ప్రకాశవంతంగా మార్చడానికి టమాటా తొక్కలు చక్కగా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ముల్లంగి
ముల్లంగి తొక్కలలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లుతో పాటు సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో, రంధ్రాలను అన్‌లాగ్ చేయడంలో సహాయపడతాయి. అలాగే చర్మంపై అదనపు నూనె ఉత్పత్తికి ముల్లంగి తొక్కలు అడ్డుకట్ట వేస్తాయి.

వీటన్నింటిని తొక్కలను తీసేసినప్పుడు వృథాగా పడేయకుండా ఆవిరి కషాయాలుగా, ఫేస్ ప్యాక్ లుగా, మచ్చలకు చికిత్సగా ఉపయోగించుకోవచ్చు. కూరగాయలు అన్నీ సురక్షితమైనవి కనుక ఎలాంటి భయం లేకుండా వాటిని ఉపయోగించవచ్చు. కానీ కొందరికి కొన్ని పదార్థాలు అలర్జీలు కలిగించవచ్చు. కాబట్టి అలెర్జీ సమస్యలు ఉన్నవారు, సున్నితమైన చర్మం కలిగిన వారు, వాటిని ముందుగా చెక్ చేసి ఉపయోగించడం మంచిది.

స్వీట్​ తింటే దాహం వేస్తుందా? డీహైడ్రేట్​ అయ్యే ఛాన్స్​! ఇలా చేస్తే అంతా సెట్​ - Feel Thirsty After Eating Sweet

గంజిని వేస్ట్​గా పారబోస్తున్నారా? మీ జుట్టుకు ఇలా వాడి చూడండి- హెయిర్​ సేఫ్​! - Hair Growth With Rice Water

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.