ETV Bharat / health

మెనోపాజ్​లో వేడి ఆవిర్లు, నిద్రలేమితో ఇబ్బందులా? - ఈ డైట్​ చాలా మేలు చేస్తుందట! - DIET FOR MENOPAUSE

- వ్యాయామంతోపాటు ఆహారంలోనూ మార్పులు అవసరం - ఈ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న నిపుణులు

Vegan Diet is During Menopause Phase
Vegan Diet is During Menopause Phase (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2024, 3:19 PM IST

Vegan Diet is During Menopause Phase : ప్రస్తుత కాలంలో చాలా మంది వీగన్​ డైట్​ ఫాలో అవుతున్నారు. నాన్​వెజ్​, గుడ్లు, పాలు, పాలపదార్థాలతోపాటు తేనె వంటి ఇతర పదార్థాలూ ఈ డైట్​లో ఉండవు. అయితే, ​ఇది ట్రెండా.. ఆరోగ్యమా.. అన్నది కాసేపు పక్కనపెడితే.. మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వృక్షసంబంధిత ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా ఈ దశలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని ప్రముఖ పోషకాహార నిపుణురాలు 'డాక్టర్​ లతాశశి' చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..

వేడి ఆవిర్లు.. ఇదే మెనోపాజ్‌ దశలో మహిళలను వేధించే ప్రధాన సమస్య. ఒంట్లో నుంచి సెగలొస్తున్నట్లే ఉంటుంది. సరిగా ఊపిరి అందదు. చెమటలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. మెనోపాజ్‌కి ముందు, తర్వాత తలెత్తే ఈ సమస్యని తట్టుకోలేక.. ఎక్కువ మంది డిప్రెషన్‌కీ లోనవుతారు. అందుకే కొంతమంది హార్మోన్‌ చికిత్సల్నీ ఆశ్రయిస్తారు.

అయితే.. ఆహారంలో మార్పులు, వ్యాయామంతో ఈ సమస్యని చాలా వరకు తగ్గించుకోవచ్చట. ముఖ్యంగా ఆ సమయంలో నాన్​వెజ్​ తగ్గించి శాకాహారం తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందని గతంలో పరిశోధనలు వెల్లడించాయి. తాజాగా అమెరికాలోని 'ఫిజీషియన్స్‌ కమిటీ ఫర్‌ రెస్పాన్సిబుల్‌ మెడిసిన్‌' అనే సంస్థ చేపట్టిన పరిశోధనలోనూ ఇదే విషయం తేలింది.

పరిశోధన వివరాలు..

రీసెర్చ్​లో భాగంగా.. వేడి ఆవిర్లతో ఇబ్బందిపడుతోన్న కొందరిని ఎంపికచేసి 4 వర్గాలుగా విభజించారు. వాళ్లకి 12 వారాలపాటు ఆహారాన్ని ఇచ్చి గమనించారు. ఒక గ్రూప్​కి ఎప్పట్లానే శాకాహారం, మాంసాహారం అన్నీ తీసుకోమన్నారు. మరో 3 విభాగాలకు శాకాహారాన్ని మాత్రమే ఇచ్చారు. వీళ్లలో ఒక గ్రూప్​కి ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, సోయా, క్వినోవా, నట్స్, తృణధాన్యాలు.. వంటివీ; రెండో గ్రూప్​కి సాధారణ శాకాహారాన్నీ ఇచ్చారు. మూడో గ్రూప్​ సభ్యులకు ప్రాసెస్‌ చేసినవీ, పండ్ల రసాలూ అందించారు. చిత్రంగా ఈ 3 విభాగాల్లోని మహిళలూ సుమారు నాలుగు కిలోల బరువు తగ్గారట. 92 శాతం వేడి ఆవిర్లు (హాట్‌ ఫ్లాషెస్‌) కూడా తగ్గాయట. ఇక నాన్​వెజ్​ తీసుకున్నవాళ్లలో ఏ మార్పూ లేదు.

ఈ పరిశోధనను బట్టి మెనోపాజ్‌లో ఉన్న లేదా దాటిన మహిళలు శాకాహారులుగా మారడం మంచిదే అని తెలుస్తోంది. వెజ్​లో వివిధ రకాలు ఉండటంవల్ల పొట్టలో మైక్రోబయోమ్‌ మెరుగవుతుంది. దీనివల్ల గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ల ముప్పూ తగ్గుతుంది. అలాగే పీచు ఎక్కువ, క్యాలరీలు తక్కువ ఉండటంతో బరువు కూడా అదుపులో ఉంటుంది.

కారణాలు ?

మెనోపాజ్‌లో ఈస్ట్రోజన్‌ స్థాయులు తగ్గడం వల్ల వేడి ఆవిర్లు, నిద్రలేమి.. వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే.. వాల్‌నట్స్, సోయా, అవిసెలు.. వంటి వాటిల్లోని ఫైటోఈస్ట్రోజన్స్‌ అచ్చం ఈస్ట్రోజన్‌లా పనిచేస్తాయి. దాంతో ఆయా హెల్త్​ ప్రాబ్లమ్స్​ తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

సోయా.. ఫైటోఈస్ట్రోజన్స్‌కి మంచి వనరు. అదీ పులియబెట్టిన మిసో, టెంపె.. వంటివైతే అందులోని సహజ పదార్థాలన్నీ విభజితమై బాడీ త్వరగా శోషించుకుంటుంది. అందుకే మెనోపాజ్‌కి చేరువలో ఉన్నప్పుడే డైట్​లో ముడిధాన్యాలు, బీన్స్, పప్పుధాన్యాలతోపాటు అవిసెలు, సోయా ఉత్పత్తులైన గ్రాన్యూల్స్, చంక్స్, టోఫు, టెంపె.. వంటివి తీసుకుంటే మంచిది. వీటిల్లో ఉండే ఫైటోన్యూట్రియంట్లు పొట్టలోని బ్యాక్టీరియా సహాయంతో ఈస్ట్రోజన్‌లా మారతాయి.

మెనోపాజ్‌లో డైట్​లో మార్పు చేయాలనుకుంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!

  • మాంసాహారంలో ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది. అది మానేసేటప్పుడు.. శాకాహారంలో ప్రొటీన్‌ వనరులైన సోయామిల్క్, టోఫు.. వంటివి తరచూ తీసుకోవాలి. అయితే.. మన శరీర బరువును బట్టి ప్రొటీన్‌ అవసరమవుతుంది. కాబట్టి, మెనోపాజ్‌లో ప్రతి కిలోకి సుమారు ఒక గ్రా. ప్రొటీన్‌ తీసుకోవాలి.
  • ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉండే గింజల్నీ, నట్స్‌నీ డైట్​లో చేర్చుకోవాలి. చియా, బాదం, అవిసెలు, వాల్‌నట్స్‌.. వంటి వాటివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇవీ మోతాదులో అంటే- 35గ్రాములకు మించకుండా తీసుకోవాలి.
  • ఐరన్, కాల్షియం కోసం పాలకూర, బచ్చలి, పప్పుధాన్యాలు, ఫోర్టిఫైడ్‌ సెరియల్స్ తినాలి. విటమిన్‌-సి ఎక్కువగా ఉన్న పండ్లు తింటే పోషకాలు అందుతాయి.
  • క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీలు ఈస్ట్రోజన్‌ స్థాయుల్ని పడిపోకుండా చేస్తాయి. అలాగే ఓట్స్, చిరుధాన్యాలు, ముడిధాన్యాలు, ఆకుకూరల్లోని మెగ్నీషియం, విటమిన్‌-బి6 కూడా ఈ హార్మోన్‌ శాతాన్ని తగ్గనివ్వవు.
  • అయితే.. విటమిన్‌-బి12 శాకాహారంలో లభించదు. ఇంకా విటమిన్‌-డి, కాల్షియం.. వంటివి కూడా ఆహారం ద్వారా పూర్తిస్థాయిలో అందకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ సప్లిమెంట్స్‌ లేదా ఫోర్టిఫైడ్‌ ఫుడ్స్‌ రూపంలో తీసుకోవచ్చు. లేదా కాల్షియం కోసం తక్కువ కొవ్వు ఉన్న డెయిరీ ప్రొడక్ట్స్​ తీసుకోవచ్చు.
  • ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అప్పుడే కొవ్వుకణాలు ఈస్ట్రోన్‌ అనే స్పెషల్​ హార్మోన్‌ను ఉత్పత్తిచేస్తాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మెనోపాజ్‌ సమస్యల్ని అధిగమించవచ్చని డాక్టర్​ లతాశశి అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

వింటర్ స్కిన్ కేర్ టిప్స్- ఇలా చేస్తే చర్మంపై పగుళ్లు పోయి అందం మీ సొంతం!

పీరియడ్స్ నొప్పులు తగ్గాలా? ఈ టిప్స్ పాటిస్తే నెలసరిలోనూ ఫుల్ యాక్టివ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.