ETV Bharat / health

వాజిలిన్​ను అన్ని రకాలుగా వాడొచ్చా? అవేంటో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా! - Vaseline Benefits - VASELINE BENEFITS

Uses Of Vaseline Jelly : మార్కెట్లో దొరికే పెట్రోలియం జెల్లీ (వాజిలిన్) కేవలం చలికాలంలో పెదాలు, కాళ్లు పగలితే మాత్రమే వాడుతున్నారా? అయితే మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి. వాజిలిన్ కేవలం చర్మం రక్షణ కోసమే కాకుండా మరిన్ని ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Vaseline Benefits
Vaseline Benefits (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 10:10 AM IST

Uses Of Vaseline Jelly : చిన్నప్పటి నుంచి పెదాలు పగిలినా, చర్మం పొడిగా మారిన మనం రాసుకునే పెట్రోలియం జెల్లీ అదేనండి వాజిలిన్. ఈ క్రీమ్ గురించి మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు చాలా ఉన్నాయట. సరిగ్గా ఉపయోగిస్తే వాసెలిన్ మనల్ని ఎన్నో రకాల సమస్యల నుంచి దూరంగా ఉంచుతుందని నిపుణులు అంటున్నారు. అవేంటో ఆలస్యం చేయకుండా చూసేద్దామా మరి.

పర్ఫ్మూమ్ ఎక్కువ కాలం ఉండేందుకు!
చెమట, దుర్వాసన నుంచి తప్పించుకునేందుకు మనం రోజూ రాసుకునే పర్ఫ్యూమ్ ఎక్కువ సేపు ఉండేందుకు వాసెలిన్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పర్ఫ్యూమ్ రాసుకునే ముందు కొంచెం పెట్రోలియం జెల్లీని రాసుకోవడం వల్ల పర్ఫ్యూమ్ ఎక్కువ సేపు ఉంటుందట.

చర్మం ముడతలకు!
చర్మం పగుళ్లకు మాత్రమే కాదు, ముడతలతో ఇబ్బంది పడుతున్నవారికి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. మాయిశ్చరైజింగ్ లక్షణాలున్న వాజిలిన్ ప్రతి రోజూ రాసుకోవడం వల్ల చర్మం ముడతలు తగ్గిపోతాయట.

చిట్లిన వెంట్రుకలకు!
వెంట్రుకల చివర్లు చిట్లిపోయాయంటే ఎదుగుదల ఆగిపోయినట్టే, జుట్టు ఆరోగ్యం దెబ్బతిన్నట్లే. అలాంటప్పడు వాజిలిన్ మీకు అద్భుతంగా పనికొస్తుంది. చిట్లిన వెంట్రుకలకు తరచుగా వాజిలిన్ రాసుకోవడం వల్ల వెంట్రుకలు తిరిగి ఆరోగ్యంగా మారడమే కాదు జుట్టు మృదువుగా, మెరిసేలా తయారవుతుంది.

పెంపుడు జంతువుల పాదాలకు!
మీరు జంతుప్రియులైతే, మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే మీకు పెట్రోలియం జెల్లీ బాగా ఉపయోగపడుతుంది. ఇవి మీ కుక్క లేదా పిల్లి పాదాలకు తేమ అందించడంలో, సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఫర్నీచర్ కోసం!
ఇంట్లో బల్లలు, బెడ్​ల మీద గీతలు పడి చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో గీతలు పడ్డచోట వాజిలిన్ రాసి రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు క్లాత్​తో తుడిచేయండి. రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు.

పిల్లల విషయంలో!
డైపర్ వేయడం వల్ల చాలామంది పిల్లలకు దురద, దద్దుర్లు వంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇలాంటప్పుడు పెట్రోలియం జెల్లీ రాయడం వల్ల వారికి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది మీ పిల్లల చర్మాన్ని చక్కగా కాపాడుంది.

మేకప్ తీయడానికి!
ఈ రోజుల్లో మేకప్ అనేది చాలా సాధారణ విషయం అయిపోయింది. అలాంటి మేకప్ తీసేయడానికి ఖరీదైన క్రీములకు బదులు పెట్రోలియం జెల్లీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యాటన్ ప్యాడ్​కు కొంచెం వాజిలిన్ పూసి దాంతో మేకప్ తీయడం చాలా ఈజీ అండ్ సేఫ్.

రన్నింగ్ చేసేవారికి!
రోజూ రన్నింగ్ చేసేవారు అలాగే స్ట్పోర్స్ పర్సన్స్ చాలా మంది తమ పాదాలను రక్షించికునేందుకు ప్రతి రోజూ రన్నింగ్​కు వెళ్లే ముందు వాజిలిన్ రాసుకుంటారట. వాజిలిన్ రాయడం వల్ల మీ బ్యాగులు, డ్రెస్సులకున్న జిప్పులు ఫ్రీ అవుతాయట. మీ ఇంట్లోని కత్తులు, షేవింగ్ మిషన్లు పదును కోల్పోతే వాటి పదును పెంచుందుకు పెట్రోలియం జెల్లీ చాలా బాగా సహాయపడుతుంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

IVF ద్వారా పిల్లలు కనేవారికి వాయు కాలుష్యంతో ఇబ్బందులు- అన్నీ లింకే!

స్మోకింగ్ వల్ల మెమొరీ లాస్ పక్కా! పరిశోధనలో కీలక విషయాలు!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.