ETV Bharat / health

'ఎయిడ్స్​ వల్ల నిమిషానికి ఒకరు మృతి - 4 కోట్ల మందికి HIV' - UNAIDS Report - UNAIDS REPORT

UNAIDS Report 2023 : దాదాపు 6.30 లక్షల మంది 2023లో ఎయిడ్స్ సంబంధిత రుగ్మతలతో ప్రాణాలు విడిచారు. గత ఏడాది ముగిసే నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది హెచ్​ఐవీతో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 90 లక్షల మంది తగిన చికిత్సను పొందలేకపోతున్నారని 2023 గణాంకాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఓ నివేదికను విడుదల చేసింది.

UNAIDS Report 2023
UNAIDS Report 2023 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 3:28 PM IST

UNAIDS Report 2023 : ప్రాణాంతక ఎయిడ్స్‌ వ్యాధికి కారణమయ్యే హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ కేసులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి (యూఎన్) తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. 2023 సంవత్సరం ముగిసే నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. వీరిలో దాదాపు 90 లక్షల మంది తగిన చికిత్సను పొందలేకపోతున్నారని తెలిపింది. ఎయిడ్స్ సంబంధిత కారణాలతో ప్రతి నిమిషానికి ఒకరు చొప్పున మరణిస్తున్నారని పేర్కొంది.

టార్గెట్​ కంటే రెట్టింపే
2004లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 21 లక్షల మంది ఎయిడ్స్ సంబంధిత వ్యాధులతో చనిపోయారు. అయితే 2023లో దాదాపు 6.30 లక్షల మంది ఎయిడ్స్ సంబంధిత రుగ్మతలతో ప్రాణాలు విడిచారు. 2004 నాటితో పోలిస్తే ఎయిడ్స్ మరణాలు చాలావరకు తగ్గిపోయాయి. 2025 నాటికి ఎయిడ్స్ మరణాల సంఖ్యను 2.50 లక్షలకు తగ్గించాలనే ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ విభాగం (యూఎన్ఎయిడ్స్) లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత నివేదికలు చూస్తే ఆ లక్ష్యం​ కంటే మరణాల సంఖ్య రెట్టింపుపైనే ఉందని ఐరాస విశ్లేషించింది. 2023 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ‌తో బాధపడుతున్న 3.99 కోట్ల మందిలో 86 శాతం మందికే తమకు ఎయిడ్స్ ప్రబలిందని, వారిలో 77 శాతం మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది. చికిత్స పొందిన వారిలో దాదాపు 72 శాతం మందిలో హెచ్‌ఐవీ వైరస్ నిర్వీర్యం అయింది. సెక్స్ వర్కర్లు, హిజ్రాలు, డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకునే వ్యక్తులలో కొత్తగా ఎయిడ్స్ ఇన్ఫెక్షన్స్ నిర్ధరణ అయ్యే కేసులు 55 శాతానికి పెరిగాయి. 2010 నాటికి ఈ కేటగిరీల వారిలో 45 శాతం మందిలోనే కొత్త ఎయిడ్స్ ఇన్ఫెక్షన్లు నిర్ధరణ అయ్యేవి. అంటే వీరిలో ఎయిడ్స్ కేసులు పెరిగాయని అర్థం.

ఆఫ్రికా మహిళలకు ముప్పు
ఎయిడ్స్ మహమ్మారి నియంత్రణ చర్యల కోసం నిధులు తగ్గిపోతున్నాయని యూఎన్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా, తూర్పు ఐరోపా, మధ్య ఆసియా, లాటిన్ అమెరికాలోని పలు దేశాల్లో కొత్త అంటువ్యాధులు ప్రబలుతున్నాయని వెల్లడించింది. లింగ అసమానతల వల్ల ఆఫ్రికా దేశాల్లో చాలామంది బాలికలు, మహిళలకు ఎయిడ్స్ సోకుతోంది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులకు కూడా అత్యధిక హెచ్‌ఐవీ ముప్పు పొంచి ఉంటోందని ఐరాస తన నివేదికలో తెలిపింది.

ఆర్థిక, వైద్య వనరులతోనే నియంత్రణ
'2025 నాటికి వార్షిక కొత్త హెచ్‌ఐవీ కేసులను 3.70 లక్షల లోపునకు తగ్గిస్తామని ప్రపంచ దేశాల ప్రభుత్వాధినేతలు గతంలో ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆందోళనకరంగా 2023 సంవత్సరంలో కొత్త హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్లు అంతకంటే మూడు రెట్లు అధికంగా 13 లక్షలకు చేరుకున్నాయి' అని యూఎన్ఎయిడ్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బయానిమా తెలిపారు. హెచ్‌ఐవీ కట్టడికి అవసరమైన ఆర్థిక, వైద్య వనరులను ప్రపంచదేశాలు సమకూర్చగలిగితేనే ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

లక్షల్లో హెచ్‌ఐవీ ఇంజెక్షన్ ధర
వివిధ వ్యాక్సిన్ కంపెనీలు హెచ్‌ఐవీ ఇంజెక్షన్ల అభివృద్ధి ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయని యూఎన్ ఎయిడ్స్ విభాగం తెలిపింది. 'ఆ హెచ్‌ఐవీ ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చాక, రోగులు తీసుకుంటే ఆరునెలల పాటు శరీరంలో యాక్టివ్‌గా ఉండి పనిచేస్తుంటాయి. అయితే రెండు డోసులకు ఏటా దాదాపు రూ.33 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది' అని వెల్లడించింది. అందువల్ల హెచ్‌ఐవీ ఇంజెక్షన్లు కేవలం ధనికులకే అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. పేద, మధ్యతరగతి దేశాలకు తక్కువ రేటుకు ఆ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవాలని యూఎన్ ఎయిడ్స్ విభాగం వ్యాక్సిన్ కంపెనీలను కోరుతోందని పేర్కొంది. సోమవారం జర్మనీలోని మ్యూనిచ్‌లో ప్రారంభమైన 25వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సులో హెచ్‌ఐవీ ఇంజెక్షన్లు, ఏడు కేసులపై చర్చిస్తామని తెలిపింది.

రక్తం క్వాలిటీని జుట్టు చెప్పగలదా? నిపుణులు ఏమంటున్నారు? - Hair Health Tips

నూడుల్స్ తరచుగా తింటున్నారా? వెంటనే ఆపేయండి! లేకుంటే ఏమవుతుందో తెలుసా? - Noodles Health Effects

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.