ETV Bharat / health

కాకరకాయ అనగానే పిల్లలు NO అంటున్నారా? - ఈ టిప్స్‌ పాటిస్తే చేదు మొత్తం ఆవిరైపోతుంది! - Remove Bitterness Of Bitter Gourd - REMOVE BITTERNESS OF BITTER GOURD

Tips To Remove Bitterness Of Bitter Gourd : మనలో చాలా మంది చేదుగా ఉంటుందనే ఒక్క కారణంతోనే.. కాకరకాయను తినకుండా ఉంటారు. అయితే, కూర వండేటప్పుడు కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల చేదును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Bitter Gourd
Tips To Remove Bitterness Of Bitter Gourd (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 5:15 PM IST

Tips To Remove Bitterness Of Bitter Gourd : ఎక్కువ మంది ఇష్టపడని కూరల్లో కాకరకాయ ఒకటి. ఈ కాకరకాయను ఫ్రై చేసినా.. లేదా పులుసు లాగా వండినా కూడా చేదుగానే ఉంటుంది. ఈ కారణంగానే దీన్ని తినడం చాలా మందికి ఇష్టం ఉండదు! నిజానికి చేదుగా ఉండే కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా మందికి తెలుసు. ఆరోగ్య నిపుణులు కూడా ఇదే చెప్తారు. వారానికి ఒకసారైనా కాకరకాయను తినడం వల్ల.. ఎన్నో రకాల హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ను దూరం చేసుకోవచ్చని సూచిస్తారు. అయినప్పటికీ.. కాకరకాయ పేరు చెప్పగానే "నో" అంటారు! అయితే.. సరిగ్గా వండాలే గానీ కాకరకాయలోని చేదు మొత్తం తగ్గించవచ్చు అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. మరి.. కాకరకాయను ఎలా వండితే చేదు తగ్గుతుందో మీకు తెలుసా? ఆ టిప్స్​ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ టిప్స్ పాటించండి :

  • కాకరకాయలో చేదు మొత్తం పైన ఉండే గరుకు భాగంలోనే ఉంటుంది. అయితే, మీరు ఈ సారి కాకరకాయలను కట్‌ చేసేటప్పుడు గరుకు భాగాన్ని మొత్తం బీరకాయ పొట్టు తీసేసినట్లు తొలగించండి.
  • తర్వాత మీకు నచ్చినట్లుగా కాకరకాయలను కట్‌ చేసుకుని కర్రీ చేయండి. ఇలా చేస్తే చేదు చాలా వరకు తగ్గిపోతుందని నిపుణులంటున్నారు.
  • అలాగే కాకరకాయలను కట్‌ చేసినప్పుడు అందులోని గింజలను తొలగించండి. ఇలా చేయడం వల్ల కూడా చేదు తగ్గుతుందట.
  • కాకరకాయలను కట్‌ చేసిన తర్వాత వాటిపైన కొద్దిగా ఉప్పు చల్లి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని శుభ్రంగా నీళ్లలో కడిగి వండితే కూడా చేదు తగ్గుతుంది.
  • అలాగే మరుగుతున్న నీళ్లలో కట్‌ చేసుకున్న కాకరకాయ ముక్కలను.. ఉప్పు వేసుకుని రెండు నిమిషాలు ఉడికించుకోవడం వల్ల కూడా చేదు తగ్గుతుంది.

ఇంట్లో కమ్మటి గడ్డ పెరుగు తోడుకోవాలంటే - ఈ టిప్స్‌ పాటిస్తే సరి! - how to make thick curd

  • కాకరకాయ కర్రీ వండేటప్పుడు అందులో ఉల్లిపాయలను ఎక్కువగా వేసుకోండి. దీనివల్ల చేదు తగ్గుతుంది.
  • కట్‌ చేసిన కాకరకాయలో కొద్దిగా పెరుగు వేసుకుని బాగా కలిపి గంటసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ వండుకుంటే కూడా చేదు చాలా వరకు తగ్గుతుంది.
  • కాకరకాయ పులుసు పెట్టినప్పుడు చేదు తగ్గడానికి చివర్లో కొద్దిగా బెల్లం ముక్కను వేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
  • ఇంకా కాకరకాయ ఫ్రై, పులుసు వండినప్పుడు అందులో కొద్దిగా యాలకుల పొడి, సోంపు గింజలను వేసుకోవడం వల్ల కూడా చేదును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
  • ఈ టిప్స్‌ పాటించడం వల్ల ఈజీగా కాకరకాయ చేదును తగ్గించుకోవచ్చు.
  • మరి.. మీరు కూడా ఈ సారి కాకరకాయ కర్రీ వండేటప్పుడు ఈ టిప్స్​ ట్రై చేయండి.

వేసవిలో స్కిన్‌ ప్రాబ్లమ్స్‌ వేధిస్తున్నాయా ? ఈ టిప్స్‌ పాటిస్తే అంతా సెట్​! - Skincare Tips in Summer

మీరు తింటున్న బియ్యం మంచివేనా? - క్వాలిటీని ఇలా చెక్ చేయండి! - How To Identify fake Rice

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.