ETV Bharat / health

జొన్నరొట్టెలు చేయడం రావడం లేదా? - ఈ టిప్స్​ పాటిస్తే చాలా ఈజీగా ​! - jowar roti health benefits

Tips to Make Soft Jowar Roti: జొన్న రొట్టెలు ఆరోగ్యానికి మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ.. అవి తయారు చేయడం అందరికీ రాదు. వచ్చినా.. అది చాలా ప్రాసెస్​తో కూడుకున్న పనిగా భావిస్తారు. అయితే.. ఈ టిప్స్​ పాటిస్తే చాలా ఈజీగా రొట్టెలు చేయచ్చు!

Tips to Make Soft Jowar Roti
Tips to Make Soft Jowar Roti
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 2:14 PM IST

Tips to Make Soft Jowar Roti : జొన్న రొట్టెలకు గిరాకీ ఎంతగా ఉందో.. సాయంత్రం వేళ సందుల్లో ఉండే తోపుడు బండ్లను చూస్తే అర్థమవుతుంది. ఆరోగ్య ప్రయోజనాల నేపథ్యంలో.. వాటిని చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. అయితే.. ఇంట్లో చేయడం మాత్రం చాలా మందికి రాదు. అలాంటి వారి కోసమే ఈ స్టోరీ. జొన్నరొట్టెను సాఫ్ట్​గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

జొన్న రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

  • జొన్నపిండి- 1 కప్పు
  • వేడినీరు- అరకప్పు
  • ఉప్పు- రుచికి సరిపడా​
  • నెయ్యి- కావాల్సినంత

తయారీ విధానం:

  • ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో జొన్నపిండి, ఉప్పు, వేడి నీరు పోసుకుని.. స్పూన్​ సాయంతో కలుపుకుని మూత పెట్టి ఓ 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత పిండిని ముద్దగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి జిగటగా ఉంటే మరికొంచెం జొన్నపిండిని కలపాలి. అలాకాకుండా పిండి గట్టిగా ఉంటే చేతులు కొంచెం తడి చేసుకుని పిండిని కలపాలి.
  • ఇప్పుడు కలిపిన పిండిని చపాతి పీట లేదా చపాతి చేసే బండ మీద పెట్టి.. పిండిని బాగా సాగదీస్తూ కలుపుకోవాలి.
  • మధ్యలో కొంచెం పొడి పిండి వేసుకుని బాగా ఒత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి సాఫ్ట్​గా మారుతుంది. ఈ ప్రక్రియ అస్సలు మర్చిపోవద్దు.
  • ఇప్పుడు పిండిని సమాన భాగాలు చేస్తూ ఉండలు చేసుకోవాలి. అందులో ఒక ఉండ తీసుకుని మిగిలిన వాటిని ఓ గిన్నెలో వేసి మూతపెట్టి పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు చపాతి పీట మీద ఉండ పెట్టి.. మరో 40 సెకన్ల పాటు స్ట్రెచ్​ చెయ్యాలి. ఆ తర్వాత పొడి పిండి చల్లుకుంటూ చాలా జాగ్రత్తగా రొట్టెలు షేప్​లో చేసుకోవాలి. ప్రెషర్​ పెట్టి రుద్దడం వల్ల పిండి మధ్యలోకి విరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సున్నితంగా రుద్దుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ మీద తవా పెట్టి ఫ్లేమ్​ను మీడియంలో పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి.
  • ఇప్పుడు వెంటనే కాల్చిన రొట్టెలకు రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుని స్టోర్​ చేసుకోవాలి. అంతే ఎంతో సాఫ్ట్​గా ఉండే జొన్నరొట్టెలు రెడీ..

ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే.. గ్లూటెన్‌ లేకపోవడం, కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ ఉండటం వల్ల మధుమేహులకు ఇది చక్కటి ఆహారం. 100 గ్రాముల జొన్నల్లో 10.4 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. మన శరీరానికి ప్రతిరోజూ అవసరమైన ఫైబర్‌ను 40శాతం ఇది అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ (LDL) తగ్గించడంలో సహాయపడటంతో పాటుగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా.. గ్లూటెన్‌ పదార్థాల ఎలర్జీ ఉన్న వారితోపాటుగా.. ఉదర కుహర వ్యాధి ఉన్న వారికీ ఇది మేలు చేస్తుంది. ఇంకా.. జొన్నల్లో ఐరన్‌, కాల్షియం, విటమిన్‌ బి, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటివి ఉన్నాయి. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గేందుకూ సాయపడుతుంది.

బ్రెడ్​తో స్పైసీ స్పైసీ వంటలు- తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసుకోవడం పక్కా!

పనీర్‌తో ఈ స్నాక్స్ ట్రై చేయండి-​ పిల్లలు నుంచి పెద్దల వరకు ఆహా అనడం ఖాయం!

వహ్వా అనిపించే "బటర్​ గార్లిక్​ పొటాటో" - తిని తీరాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.